ఒకే భూమిని పలువురికి విక్రయించిన వ్యక్తి అరెస్టు
పటాన్చెరు: మృతిచెందిన తన వ్యాపార భాగస్వామి పేరు మీద ఉన్న భూమిని పలువురికి విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుకున్న వ్యక్తిని మెదక్ జిల్లా పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లైట్ క్రియేట్ పరిశ్రమ స్థాపిస్తామంటూ అయినంపూడి క్షీరసాగర్, ఘన్‌శ్యాంలు పటాన్చెరు ఏపీఐఐసీకి దరఖాస్తు చేసుకున్నారు. సాగర్ పేరున 110 ఎకరాల ప్రభుత్వ భూమిని పొందారు. అయితే 1994లో సాగర్ మృతి చెందాడు.
దీంతో ఘన్‌శ్యాం ఆ భూమిని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన పత్తిపాటి శ్రీనివాస్‌రావుకు భూమిని అమ్మినట్లు ఒప్పందం చేసుకుని అతనివద్ద రూ.2.01 కోట్లు తీసుకున్నాడు. మోసపోయినట్లు తెలుసుకున్న శ్రీనివాస్‌రావు పోలీసులను ఆశ్రయించడంతో కోర్డు ఆదేశాల మేరకు ఘన్‌శ్యాంను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే ఇదే భూమిని పలువురికి విక్రయించిన ఘన్‌శ్యాం రూ.100 కోట్ల మేర సొమ్ము చేసుకున్నట్లు భావిస్తున్నారు.