రోడ్డు ప్రమాదంలో దర్శకుడికి గాయాలు
ముంబై: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ (52) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ముంబైలో మంగళవారం ఉదయం ఆయన బైక్ పై నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని అదుపు చేయలేక కిందిపడినట్టు సమాచారం. ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఫ్రాక్చర్స్ అయ్యాయని, ఆపరేషన్ నిర్వహించనున్నాని తెలిపారు.
బాలీవుడు ప్రముఖులు, నటులు లీలావతి ఆసుపత్రికి వెళ్లి హిరానీని పరామర్శించారు. బాలీవుడ్‌కు హిరానీ ఎన్నో బ్లాక్ బ్లస్టర్స్ అందించారు. ముఖ్యంగా మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకె సినిమాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పడతాయి.