ఎంబ్రాయిడరీ కన్నా లేసులు మిన్న
నూలు వస్త్రం వేసవికే ప్రత్యేకం. మిగతా కాలాల్లో దీనిని ఎక్కువ వాడలేం. తక్కువ రేటు ఉండే కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఎక్కువ ఖర్చుపెట్టి భారీగా ఎంబ్రాయిడరీ చేయించుకునే దానికన్నా క్రోషియా, జర్దోసీ, క్లాత్, నెట్ లేసులు, పెద్ద పెద్ద బటన్స్ వాడి చూడముచ్చటగా డిజైన్ చేసుకోవచ్చు.
లెదర్ బ్యాగుల స్థానంలో క్లాత్ బ్యాగులు, జూట్, లినెన్ఫ్యాబ్రిక్తో చేసిన బ్యాగులు వాడుకోవచ్చు. ఫంకీ జువెలరీని ఇష్టపడేవారు మెటల్ ఆభరణాలను మానేసి ఉడెన్, బీడ్స్, టైట, నూలు దారాలతో తయారుచేసిన ఆభరణాలను ఎంచుకోవాలి. లైట్ మేకప్ అందంగానూ, సౌకర్యంగానూ ఉంటుంది. పర్ఫ్యూమ్స్ కూడా చాలా తక్కువ గాఢత కలిగినవే ఎంచుకోవాలి.