కల్తీ మద్యానికి మరొకరు బలి
అమరావతి(గుంటూరు): కల్తీ మద్యానికి మరొకరు బలయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం మండెపూడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొండమూడి లింగారావు(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.
అర్ధరాత్రి దాటాక అనారోగ్యానికి గురవడంతో.. కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతు బుధవారం మృతిచెందాడు. ఇదే ఆస్పత్రిలో మరో వ్యక్తి కూడా కల్తీ మద్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.