Liow Tiong Lai
-
ఆ శకలాలు ఆ విమానానివేనా?
అమెరికా : ఫ్రెంచ్లోని ల రియునియన్ ద్వీపం బంగాళాఖాతం తీర ప్రాంతంలో కనుగొన్న విమాన శకలాలు గుర్తించేందుకు ఓ బృందం ఇప్పటికే బయలుదేరి వెళ్లిందని మలేసియా రవాణా శాఖ మంత్రి ఎల్ టీ లై వెల్లడించారు. బుధవారం ఐక్యరాజ్యసమితిలోని భద్రత మండలిలో ఆయన మాట్లాడుతూ... ల రియూనియన్ ద్వీపంలోని తీర ప్రాంతానికి కొట్టుకువచ్చిన ఆ శిధిలాలు గతేడాది అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానానికి చెందినవా లేక కూలిన ఎమ్హెచ్ 17 విమానానికి చెందినవా అనేది తేల్చవలసిందన్నారు. సదరు బృందం ఈ అంశంపై దర్యాప్తు జరిపి ఆ శకలాలు ఏ విమానానివో గుర్తించి సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ల రియునియన్ ద్వీపంలోని బీచ్లో శుభ్రపరిచే కార్యక్రమాన్ని స్థానికులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు మీటర్లు వెడల్పు ఉన్న విమానం రెక్కను కనుగొన్నారు. అది ఎమ్హెచ్ 370 విమానానికి సంబంధించినదని స్థానికులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలిపారు. దాంతో ఫ్రెంచ్ విమానయాన శాఖ ఉన్నతాధికారులు దీనిపై విచారణ ప్రారంభించారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం గత ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ విమానంలో మలేసియా వాసులు, 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎమ్హెచ్ 370 విమానం ప్రమాదానికి గురైందని... ప్రయాణికులంతా మరణించారని మలేసియా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం విదితమే. -
విమాన ఆచూకీ కోసం స్పీడ్ పెంచిన మలేసియా
కౌలాలంపూర్: గతేడాది మార్చిలో అదృశ్యమైన ఎమ్హెచ్ 370 విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అందుకోసం నాలుగు నౌకలు రంగంలోకి దింపినట్లు మలేసియా రవాణా శాఖ మంత్రి లియోవ్ టియాంగో లాయి గురువారం వెల్లడించారు. విమానం ఆదృశ్యమైన ప్రాంతం... దక్షిణ బంగాళఖాతంలో నౌకలు అణువణువు శోధన చేస్తున్నాయని తెలిపారు. ఓ నౌక మంగళవారమే గల్లంతైన విమానాన్ని శోధించేందుకు రంగంలోకి దిగిందని పేర్కొన్నారు. అయితే ఎమ్హెచ్ 370 అదృశ్యమై దాదాపు ఏడాది కావస్తున్న ఇప్పటి వరకు ఆచూకీ కనుగొనక పోవడంపై సదరు విమాన ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మలేసియా ప్రభుత్వంపై ఇప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న సంగతి తెలిసిందే. ఎమ్హెచ్ 370 విమానం కోసం ప్రార్థన చేస్తున్నాం అనే అక్షరాలు గల ఏరుపు రంగు టీ షర్ట్ ధరించి.. తెల్లని టోపి పెట్టుకుని గల్లంతైన వారి బంధువులు 15 మంది మంగళవారం పౌర విమానయాన శాఖ కార్యాలయం ఎదుట నిలబడ్డారు. ఈ ప్రమాదం నిన్న వారికి జరిగింది. నేడు, రేపో మీలో మాలో ఎవరో ఒకరికి ఇదే సంఘటన ఎదురు కావచ్చు' అంటూ రాసిన ప్లకార్డులు వారు చేతిలో పట్టుకున్నారు. 239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎమ్హెచ్ 370 విమానం ఈ ఏడాది మార్చి 8వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన 40 నిమిషాలకే ఆ విమానం విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచదేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు. ఎమ్హెచ్ 370 ప్రమాదానికి గురైందని మలేసియా ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అధికారికంగా ప్రకటించడంతో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. ఈ విమానంలో 154 మంది చైనా జాతీయులతోపాటు నలుగురు ఫ్రెంచ్ జాతీయులు, ఐదుగురు భారతీయులు ఉన్న సంగతి తెలిసిందే.