ముద్దులతో రికార్డు సాధిస్తా
పెదవి ముద్దులతో రికార్డ్ సాధిస్తానంటోంది నటి రెజీనా. కోలీవుడ్ హీరోయిన్లకు అచ్చొచ్చిన సినిమారంగం అనవచ్చు. మలయాళ భామలు, ముంబయి బ్యూటీస్ దృష్టి ముందుగా దక్షిణాదిలో తమిళ చిత్ర పరిశ్రమ పైనే పడుతుంది. ఇక్కడ హీరోయిన్గా కాలుపెట్టి కాస్త పేరు తెచ్చుకుంటే చాలు ఇతర భాషల్లో బ్రహ్మరథం పట్టేస్తారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నా తాజాగా రెజీనా సినీ కెరీర్‌నే ఉదహరించవచ్చు. ఈ బ్యూటీ తమిళంలో కేడీ బిల్లా కిలాడీ రంగ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించింది. అయినా రెజీనాకు ఇక్కడ మరిన్ని అవకాశాలు రాలేదు. అయితేనేం ఈ అమ్మడిపై టాలీవుడ్ దృష్టి పడింది. అక్కడ కొత్త జంట చిత్రంలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత రారా కృష్ణయ్య, పవర్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది.
పవర్ చిత్రంలో ఆ చిత్ర హీరో రవితేజతో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి బోలెడు ప్రచారం పొందింది. తాజాగా నవ నటుడు, ప్రఖ్యాత నటుడు చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ సరసన పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంలో ఆయన్ని లిప్‌లాక్‌లతో ముంచెత్తిందనే ప్రచారం హోరెత్తుతోంది. నటి రెజీనా ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ ఏదో ఒక విషయంలో ప్రశ్నలు గుప్పిస్తూ తనను నోరుజారే పరిస్థితికి తీసుకొస్తారని నిష్టూరం ఆడింది. మళ్లీ తనే మాట్లాడుతూ ఇంతకీ మీరడిగిన ప్రశ్న ఏమిటి లిప్‌లాక్‌ల విషయం గురించేనా? అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి చుంభనాల సన్నివేశాలలో నటించి రికార్డ్ కెక్కుతానని రెజీనా పేర్కొంది.