breaking news
little hearts
-
రౌడీ టీ షర్ట్.. మహేశ్ ట్వీట్.. ఇవన్నీ ఫేక్: బండ్ల గణేశ్
సినిమా ఇండస్ట్రీ అనేది చూడటానికి బాగానే ఉంటుంది గానీ లోపల చాలా సంగతులు జరుగుతుంటాయి. అవన్నీ సామాన్య ప్రేక్షకుడికి తెలిసేది తక్కువే. ఎప్పుడో ఎవరో ఒకరు బయటకు చెబితే అలాంటివి వైరల్ అవుతుంటాయి. తాజాగా నటుడు-నిర్మాత బండ్ల గణేశ్ అలాంటి వాటి గురించి మాట్లాడారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్ గురువారం సాయంత్రం జరగ్గా.. ఇందులో హీరో మౌళిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.'ఈ 20 రోజులు జరిగింతా అబద్ధం, ఓ కల్పన. కళ్లజోడు తీసేయ్. ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఎలా అయితే ఉన్నావో అలానే ఉండు. ఎవరేం చెప్పినా నమ్మకు. నువ్వు ఓ చంద్రమోహన్‌లా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నాను. ఈ ఫిల్మ్ నగర్, ఈ సినిమా, ఈ ట్వీట్స్, ఈ పొగడ్తలు ఇదంతా అబద్ధం. ఇంటికెళ్లిన తర్వాత వాస్తవానికి వెళ్లిపో.. లేదంటే ఈ మాఫియా మనల్ని బతకనివ్వదు. ఈ మాఫియాకు దూరంగా ఉండాలంటే మన బేస్ మీదే ఉండాలి. ఎవడు బాగుంటే.. అబ్బబ్బా ఎంత పొడుగుందో అని అంటారు. అవన్నీ నమ్మకు'(ఇదీ చదవండి: సగం వయసున్న వాళ్లతో డేటింగ్.. నేను కూడా రెడీ: హీరోయిన్ అమీషా పటేల్)'రౌడీ టీ షర్ట్ ఇచ్చాడు. మహేశ్ బాబు ట్వీట్ వేశాడు. బండ్ల గణేశ్ అవి వేశాడు. ఇవన్నీ అబద్ధాలు. నిన్ను ఆశీర్వదించడానికి, నీకు విషెస్ చెప్పడానికి అలా చేస్తారు. ఇంకో ఫ్రైడే ఇంకో మౌళి వస్తాడు. ప్రతిదానికి సిద్ధమై ఉండు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు. ఎవరినీ నమ్మకు. నమ్మినట్లు ఉండు. వాస్తవంగా బతుకు. అద్భుతంగా సినిమాలు చేసుకో. నటుడిగా పేరు తెచ్చుకో. మీ అమ్మనాన్న తలెత్తుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడేలా మనస్పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను' అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు.బండ్ల గణేశ్ చెప్పిన వాటిలో పచ్చి నిజాలు బోలెడన్ని ఉన్నాయి. కానీ ఆయన ఇలా డైరెక్ట్‌గా చెప్పేసరికి అందరూ షాకయ్యారు. 'లిటిల్ హార్ట్స్' విషయానికొస్తే.. మౌళి, శివాని హీరోహీరోయిన్లుగా నటించగా సాయి మార్తాండ్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. రెండున్నర కోట్లతో మూవీ తీస్తే రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. (ఇదీ చదవండి: హీరో శర్వానంద్ దంపతులు విడిపోయారా?)"ఈ మాఫియా నిన్ను బతకనివ్వదు..."A life lesson by #BandlaGanesh 👏Only he has the guts to speak facts like this. pic.twitter.com/kMqCTPciXG— Movies4u Official (@Movies4u_Officl) September 18, 2025 -
అల్లు అరవింద్ ఏమీ చేయరు, చివర్లో వచ్చి పేరు కొట్టేస్తారు!
యూట్యూబర్ మౌళి కథానాయకుడిగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts Movie). సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ మూవీని బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 5న రిలీజ్ చేశారు. కేవలం రెండున్నర కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దాదాపు రూ.40 కోట్లు వసూలు చేసింది. దీంతో చిత్రయూనిట్ సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ పేరిట సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, బండ్ల గణేశ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.కోట్లల్లో ఒకరుఈ కార్యక్రమంలో బండ్ల గణేశ్ (Bandla Ganesh) మాట్లాడుతూ.. సినిమా అంటేనే కష్టాలు, కన్నీళ్లు, బాధలు. అన్నీ ప్రిపేర్ అయి రావాలి. కానీ, వందల కోట్లలో ఒకాయన మాత్రం దీనికి అతీతులుగా ఉన్నారు. ఆయన (అల్లు అరవింద్‌ను ఉద్దేశిస్తూ) స్టార్ కమెడియన్‌కు కొడుకుగా పుడతాడు, మెగాస్టార్‌కు బామ్మర్దిగా, ఐకాన్ స్టార్‌కు తండ్రిగా ఉంటాడు. ఎప్పుడూ కాలు మీద కాలేసుకుంటాడు. ఆయనెవరికీ అందుబాటులో ఉండడు. ఆయన కావాలనుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటాడు. సిగ్గుతో తలదించుకోవాలిఅదీ జీవితం అంటే! అలాంటి మహర్జాతకుడిని నేను జీవితంలో చూడలేదు, ఇక చూడబోను కూడా! అలా జీవితాన్ని అద్భుతంగా ప్లాన్ చేసుకున్న అరవింద్‌గారు ఇక్కడికి రావడం సంతోషం. చిన్న సినిమా చచ్చిపోయింది అనుకుంటున్న తరుణంలో బడ్జెట్‌తో కాదు, కథతో మూవీ తీస్తే హిట్టవుతుందని నిరూపించింది లిటిల్ హార్ట్స్. రెండున్నర కోట్లతో రూ.50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే మెచ్చుకుని తీరాల్సిందే! మిమ్మల్ని చూసి నేను సహా పెద్దపెద్ద దర్శకనిర్మాతలు సిగ్గుతో తలదించుకునేలా చేశారు. ఈ మూవీని జనానికి చేరువ చేసిన బన్నీ వాసు, వంశీని అభినందించాలి. ఆయన పేరు కొట్టేస్తారుమీరెంత కష్టపడ్డా చివరికి అల్లు అరవింద్ (Allu Aravind)గారి సినిమా అంటున్నారు. అది ఆయన అదృష్టం, మీ దురదృష్టం. నేనేం చెప్పలేను. ఆయనేమీ చేయరు. చివరి నిమిషంలో వస్తారు, పేరు కొట్టేస్తారు. ఆయన జాతకం అలాంటిది, దానికి మనమేమీ చేయలేం అన్నాడు. ఈ కామెంట్స్‌తో అక్కడున్నవాళ్లు షాకయ్యారు. దీంతో బన్నీ వాసు స్పందిస్తూ.. అల్లు అరవింద్‌గారు పుట్టాకే అల్లు రామలింగయ్యగారు స్టార్ కమెడియన్ అయ్యారు. ఆ విషయం బండ్లన్నకు తెలియదేమో! మా అందరికీ అరవింద్‌గారే ఆదర్శం అని పేర్కొన్నాడు.ఆయన మాకెంతో ఇష్టంఇక బండ్ల కామెంట్స్‌పై నెట్టింట ట్రోలింగ్ జరుగుతుండటంతో సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేశ్ ఓ పోస్ట్ పెట్టాడు. అల్లు అరవింద్‌గారు మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత. ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్స్. ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీదున్న ప్రేమ వల్ల తెలుగు సినిమా గర్వంగా నిలబడింది. అల్లు అరవింద్గారంటే మాకెంతో ఇష్టం అని ట్వీట్ చేశాడు.అల్లు అరవింద్ గారు మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత 🙏ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్స్.ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీద ఉన్న ప్రేమ వలన తెలుగు సినిమా గర్వంగా నిలిచింది.అల్లు అరవింద్ గారు అంటే మాకు ఎంతో ఇష్టం ❤️ 🙏— BANDLA GANESH. (@ganeshbandla) September 19, 2025చదవండి: లిటిల్ హార్ట్స్.. మరీ అంత బాగోలేదు: యాటిట్యూడ్ స్టార్ -
దయచేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్.. మహేశ్‌బాబు రిక్వెస్ట్
యూట్యూబర్, మీమర్ మౌళి హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన చిత్రం లిటిల్ హార్ట్స్ (Little Hearts Movie). శివానీ నాగారం హీరోయిన్గా నటించింది. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా సినిజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించాడు. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.30 కోట్లకుపైగా వసూలు చేసింది.సెలబ్రిటీల ప్రశంసలు సినిమా బాగుందంటూ గోపీచంద్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి సినీతారలు అభినందించారు. అయితే ఈ సినిమా దర్శకుడు సాయి, మ్యూజిక్ డైరెక్టర్ సినిజిత్ మహేశ్‌కు పెద్ద ఫ్యాన్స్. ముఖ్యంగా సినిజిత్.. నా దేవుడు మా సినిమా గురించి ఒక్క ట్వీట్ వేస్తే చాలు.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్లిపోతా.. అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఎట్టకేలకు ఆయన కోరిక ఫలించింది. మహేశ్‌బాబు లిటిల్ హార్ట్స్ సినిమాపై రివ్యూ ఇచ్చాడు. దయచేసి ఎక్కడికీ వెళ్లకు'లిటిల్ హార్ట్స్ కొత్తగా, వినోదాత్మకంగా ఉంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. సినిజిత్.. నువ్వు దయచేసి ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్, త్వరలోనే నువ్వు చాలా బిజీ అయిపోతావ్.. ఇలాగే అదరగొడుతూ ఉండు. చిత్రయూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు' అని మహేశ్‌బాబు ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్ట్ పెట్టాడు. అభిమాన హీరో ట్వీట్ చూడగానే సినిజిత్ సంతోషంతో ఎగిరి గంతేశాడు. నేను ఎక్కడికీ వెళ్లను అన్నా అని రిప్లై ఇచ్చాడు. NENU INKA YEKKADIKI VELLANU ANNA @urstrulyMahesh 😭😭😭😭😭😭❤️❤️❤️💥💥💥💥💥 https://t.co/KcVcyVHwMK pic.twitter.com/eTH3pOQl0d— SinjithYerramilli (@SinjithYerramil) September 16, 2025 చదవండి: మళ్లీ జతకట్టిన 'కోర్ట్' జంట.. శ్రీదేవి నోట బూతులు -
ఈ లవ్ స్టోరీ చూసి ఫుల్ ఎంటర్టైన్ అయ్యా: అల్లు అర్జున్ ప్రశంసలు
టాలీవుడ్లో ఇటీవలే విడుదలైన చిన్న సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. లిటిల్ హార్ట్స్ తన మనసును దోచుకుందని ట్వీట్ చేశారు. చాలా సరదాగా నవ్వులు పూయించారని అల్లు అర్జున్ కొనియాడారు. ఈ యంగ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా, వినోదంగా అనిపించిందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ చిత్ర బృందానికి తన అభినందనలు తెలియజేశారు ఐకాన్ స్టార్. డైరెక్టర్ సాయి మార్తాండ్ పనితీరు తనకు నచ్చిందని.. మ్యూజిక్ రిఫ్రెసింగ్గా అనిపించిందని పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేక చిత్రాన్ని థియేటర్లకు తీసుకువచ్చినందుకు నిర్మాత బన్నీ వాసుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg— Allu Arjun (@alluarjun) September 11, 2025 -
ఆడియన్స్ పిచ్చోళ్లా.. ఇంత సపోర్ట్ చేస్తారా?: యంగ్ హీరో
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు సైతం సరిగ్గా ఆడడం లేదు. ఇలాంటి సమయంలో తక్కువ బడ్జెట్ వచ్చిన చిన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’ భారీ విజయం సాధించింది. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ చిత్రం రిలీజైన తొలిరోజే(సెప్టెంబర్ 5) హిట్ టాక్ తెచ్చుకొని.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా హీరో మౌళి మాట్లాడుతూ ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదని అన్నారు. ‘ఆడియన్స్.. పిచ్చోళ్లా మీరు. ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా. మేము అస్సలు ఊహించలేదు. మంచి సినిమా చేశామని తెలుసు. తొలి వారం కొంతమంది చూస్తారు. మౌత్ టాక్‌తో రెండో వారం నడుస్తుందేమో అనుకున్నాం. అలా అనుకొనే గట్టిగా ప్రమోషన్స్ చేశాం. అయినా కూడా ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారా రారా అనుకున్నాం. కానీ ప్రీమియర్స్, ఫస్ట్ రోజు..థియేటర్స్ అన్ని నిండిపోయాయి. ఫస్ట్‌డే రూ.2.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇది మా సినిమా బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. పిచ్చోళ్లం అయిపోయాం. మమ్మల్ని నమ్మి సినిమాకు వచ్చిన ఆడియన్స్‌కి థ్యాంక్స్. ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు. ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తునారనో నాకే అర్థం కాలేదు. ఎవరైనా సినిమా బాగోలేదని కామెంట్ పెడితే.. వాళ్లను తిడుతూ రిప్లై ఇస్తున్నారు. రవితేజ, నాని మొదలు ఇండస్ట్రీ పెద్దలంతా మా సినిమాను మొచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇలానే కష్టపడి మంచి సినిమాలు తీస్తానని అందరికి మాట ఇస్తున్నా’ అన్నారు.సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించారు. 2009-2020 మధ్యకాలంలో జరిగే టీనేజ్ లవ్‌స్టోరీ ఇది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. యువత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. -
'లిటిల్ హార్ట్స్'.. ఇది ఒరిజినల్ సాంగ్
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో 'లిటిల్ హార్ట్స్' హిట్ టాక్ తెచ్చుకుంది. పెట్టుబడితో పోలిస్తే ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయింది. ప్రేక్షకుల్ని అలరిస్తుంది. అయితే ఈ మూవీలో మిగతా పాటలేమో గానీ సెకండాఫ్‌లో వచ్చే 'కాత్యాయని' పాట అయితే వేరే లెవల్ ఉంటుంది. సంగీతంలో ఉండే రూల్స్ లాంటివి ఏం అందులో పాటించరు కానీ చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంటుంది. అయిదే ఇది రీమేక్. దీనికి ఒరిజినల్ ఇప్పటికే ఉంది.(ఇదీ చదవండి: మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. నటికి రూ.1.14 లక్షల జరిమానా)'కాత్యాయని' అంటూ సినిమాలో ఉన్న పాటకు ఎనిమిదేళ్ల క్రితం యూట్యూబ్‌లో రిలీజైన ఓ సాంగ్ మూలం. శరత్ గౌడ్ అనే కుర్రాడు 'కమాన్ బేబీ' పేరుతో ఓ గీతాన్ని పాడుతూ డ్యాన్స్ చేశాడు. అప్పట్లో పెద్ద వ్యూస్ రాలేదు కానీ ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' రిలీజైన తర్వాత దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. పాటని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఈ సాంగ్ ఓసారి వినేయండి.'లిటిల్ హార్ట్స్' విషయానికొస్తే.. మౌళి, శివాని నాగరం హీరోహీరోయిన్లుగా నటించారు. సాయి మార్తాండ్ దర్శకుడు. టీనేజ్ లవ్ స్టోరీతో తీసిన ఈ చిత్రంలో పెద్ద కథేం ఉండదు. ఫన్నీ మూమెంట్స్ మాత్రమే ఉంటాయి. అవే ఇప్పుడు ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తున్నాయి. నాలుగు రోజుల్లో కలెక్షన్ కూడా చాలానే వచ్చాయి.(ఇదీ చదవండి: హిందీ వెబ్ సిరీస్‌లో రాజమౌళి.. ట్రైలర్ రిలీజ్) -
'లిటిల్ హార్ట్స్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
రీసెంట్ వీకెండ్లో మూడు సినిమాలొస్తే ఏ మాత్రం అంచనాల్లేని 'లిటిల్ హార్ట్స్' అనే చిన్న చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్ చేసిన మౌళి, శివాని నాగారంతో పాటు హీరో ఫ్రెండ్‌గా చేసిన జయకృష్ణని అందరూ ప్రశంసిస్తున్నారు. మౌళి, జయకృష్ణ యూట్యూబర్స్ అని చాలామందికి తెలుసు. కానీ కాత్యాయని పాత్రలో హీరోయిన్గా కనిపించిన శివాని ఎవరా అని సెర్చ్ చేస్తున్నారు? ఇంతకీ ఎవరీమె? డీటైల్స్ ఏంటి?ఈ సినిమాలో మౌళితో పాటు కాత్యాయని పాత్రలో శివాని కూడా ఆకట్టుకుంది. ఈమె ఇదివరకే ఓ తెలుగు సినిమాలో చేసింది. అయితే ఈమె యాక్టింగ్‌తోపాటు సింగర్ కమ్ ట్రైన్డ్ కూచిపూడి డ్యాన్సర్ కూడా. 1988లో హైదరాబాదులో పుట్టిన శివానీ.. చిన్నతనం నుంచే కూచిపూడి నేర్చుకుంది. విల్లా మేరీ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ చేసింది. 'అంతర్గత' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా మారింది. 2020లో మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.(ఇదీ చదవండి: మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?)ఇన్ స్టాలో చూసి 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' చిత్రంలో ఛాన్స్ ఉందని శివానికి తెలిసింది. అయితే హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్ ఇస్తే, అదృష్టం కలిసొచ్చి ఈమెనే హీరోయిన్గా తీసుకున్నారు. సంగీతంలో ప్రావీణ్యం ఉన్న ఈమె.. ఖాళీ సమయంలో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది. అలానే తమ్ముడితో కలిసి సాంగ్స్ పాడుతూ ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తొలి సినిమా కంటే ముందు 'జాతిరత్నాలు'లో న్యూస్ ప్రెజెంటర్‌గా చిన్న పాత్రలో కనిపించింది. ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' మూవీతో కాత్యాయనిగా కుర్రాళ్ల మనసు కొల్లగొట్టేస్తోంది. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న 'హే భగవాన్' అనే మూవీలో హీరోయిన్గా చేస్తోంది.(ఇదీ చదవండి: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) -
ఘాటీ, మదరాసి, లిటిల్ హార్ట్స్.. తొలిరోజు కలెక్షన్ ఎంతొచ్చాయ్?
ఈ వీకెండ్ థియేటర్లలోకి మూడు సినిమాలొచ్చాయి. వీటిలో అనుష్క 'ఘాటీ', శివకార్తికేయన్ 'మదరాసి', లిటిల్ హార్ట్స్ అనే చిన్న చిత్రం ఉన్నాయి. అయితే అనుహ్యంగా అనుష్క మూవీకి తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు మదరాసి చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాకు మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. మరి తొలిరోజు వసూళ్లు ఏ చిత్రానికి ఎంతొచ్చాయ్?(ఇదీ చదవండి: అనుష్క శెట్టి ‘ఘాటి’ మూవీ రివ్యూ)తొలుత ఘాటీ విషయానికొస్తే.. చాన్నాళ్ల తర్వాత అనుష్క లీడ్ రోల్లో ఈ మూవీ చేసింది. తూర్పు కనుమల్లో గంజాయి బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. రిలీజ్‌కి ముందు వరకు బాగానే హైప్ ఏర్పడింది. కానీ కంటెంట్ మరీ పేలవంగా ఉందనే టాక్ రావడం దీనికి మైనస్ అయిందని చెప్పొచ్చు. అనుష్క తప్పితే పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోవడం జనాల్ని థియేటర్లలోకి రప్పించలేకపోయింది. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.2.89 కోట్ల కలెక్షన్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.4.28 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు ఏఆర్ మురుగదాస్-శివకార్తికేయన్ కలిసి చేసిన 'మదరాసి'పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎందుకంటే ఈ దర్శకుడు హిట్ కొట్టి చాలా కాలమైపోయింది. కాస్తోకూస్తో హైప్ హీరో వల్ల ఏర్పడింది. దానికి తోడు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కావడం దీనికి ప్లస్ అయింది. దీంతో మొదటిరోజు 'మదరాసి' చిత్రానికి రూ.13 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: శివకార్తికేయన్ 'మదరాసి' సినిమా రివ్యూ)మరోవైపు మౌళి అనే యూట్యూబర్ లీడ్ రోల్ చేసిన సినిమా 'లిటిల్ హార్ట్స్'. టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి రెండు రోజుల ముందే ప్రీమియర్లు కూడా వేశారు. అక్కడి నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు రూ.1.32 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. అలానే రీసెంట్ టైంలో మొదటిరోజే బ్రేక్ ఈవెన్ అయిన సినిమాగానూ ఇది నిలిచినట్లు తెలుస్తోంది. వీకెండ్ పూర్తయితే ఎవరి జాతకం ఏంటనేది పూర్తిగా తేలుతుంది.(ఇదీ చదవండి: ‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ) -
‘లిటిల్ హార్ట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: లిటిల్ హార్ట్స్నటీనటులు: మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులురచన, దర్శకత్వం : సాయి మార్తండ్నిర్మాత: ఆదిత్య హాసన్సంగీతం: సింజిత్ యెర్రమల్లిసినిమాటోగ్రఫీ : సూర్య బాలాజీవిడుదల తేది: సెప్టెంబర్ 5, 2025‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ఫేమ్ హీరోయిన్ శివానీ నాగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసుకుంది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న సినిమాపై ఓ మోస్తరు అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మరి అంచనాలను ఈ చిత్రం అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఈ సినిమా కథ 2009-2020 మధ్య కాలంలో సాగుతుంది. నల్లి అఖిల్(మౌళి తనూజ్) చదువులో చాలా వీక్. అతన్ని ఇంజనీర్ చేయాలానేది తండ్రి గోపాలరావు(రాజీవ్ కనకాల)ఆశయం. కానీ అఖిల్ ఎంసెట్‌లో క్వాలిఫై కూడా కాడు. తనవల్ల కాదని చెప్పినా వినకుండా లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి పంపిస్తాడు తండ్రి. ఆ కోచింగ్ సెంటర్లో ఉన్న కాత్యాయని(శివానీ నాగారం) పరిస్థితి కూడా అంతే. ఆమెకు మెడిసిన్ చదవడం ఇష్టం ఉండదు. కానీ పెరెంట్స్ బలవంతంగా లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి పంపిస్తారు. అక్కడే అఖిల్‌కి కాత్యాయని పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమకు దారి తీస్తుంది. అఖిల్ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టగానే.. కాత్యాయని ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడిస్తుంది. అదేంటి? అఖిల్, కాత్యాయనిల ప్రేమకు ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని వీరిద్దరు ఎలా ఎదుర్కొని..ఒకటయ్యారు? అనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు చాలా సింపుల్‌గా, రొటీన్‌గా ఉన్నా.. తెరపై చూస్తుంటే బోర్ కొట్టదు. ఊహించే మలుపు ఉన్నా.. ఎక్కడో చూసిన సన్నివేశాలు కనిపించినా.. ఎంటర్టైన్ అవుతుంటాం. లిటిల్ హార్ట్స్ ఆ కోవలోకి చెందిన చిత్రమే. కథగా చెప్పాలంటే ఇందులో కొత్తదనం ఏమి ఉండదు. రెగ్యులర్ రొటీజ్ టీనేజ్ లవ్‌స్టోరీ. కానీ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు.. పంచ్ డైలాగులు సినిమాను నిలబెట్టాయి. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. టీనేజ్ అమ్మాయి/అబ్బాయిలు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా 2009-2020 మధ్య కాలేజీ చదివిన వాళ్లు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. జియో సిమ్ రాకముందు అంటూ హీరోహీరోయిన్లు, వాళ్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించారు. కోచింగ్ సెంటర్లో హీరోహీరోయిన్ల పరిచయం తర్వాత కథనం మరింత ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కాత్యాయని ఇంప్రెస్ చేసేందుకు అఖిల్ చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో స్నేహితుడు వేసే పంచులు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో కామెడీ డబుల్ అవుతుంది. హీరోయిన్‌కి దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు.. ఆమె బర్త్‌డే కోసం అఖిల్ చేసే సర్ప్రైజ్.. అవి ఇంట్లో వాళ్లకు తెలిసిన తర్వాత ఎదురయ్యే చిక్కులు.. ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. అయితే హీరోహీరోయిన్లు కలిసేందుకు చిన్న పిల్లలను వాడుకోవడం.. వారి మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. అలాగే ఒకటి రెండు చోట్ల డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే ప్రస్తుతం వస్తున్న యూత్‌ఫుల్ కామెడీ చిత్రాలతో పోలిస్తే.. ఇందులో వల్గారిటీ చాలా తక్కువనే చెప్పాలి. బూతు సన్నివేశాలేవి లేకుండానే కామెడీ పండించారు. ఈ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. ‘గోల్స్ ఎప్పుడు అందంగా ఉండాలి’ అంటూ హీరోతో ఒక డైలాగ్ చెప్పించడమే కాకుండా.. క్లైమాక్స్‌లో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. యూత్ అయితే ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. అఖిల్ పాత్రలో మౌళి పర్వాలేదనిపించాడు. ఆయన కామెడీ టైమింగ్ బాగుంది. కాత్యాయని పాత్రకి శివానీ నాగారం న్యాయం చేసింది. మౌళికి జోడీగా ఆమెను ఎందుకు తీసుకున్నారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హీరో స్నేహిడు మధుగా జయకృష్ణ పండించిన కామెడీ ఈ సినిమాకు మరో ప్రధాన బలమైంది. మరో స్నేహితుడిగా నిఖిల్ కూడా తన పాత్ర పరిధిమేర చక్కగానే చేశారు. రాజీవ్ కనకాల, అనిత చౌదరి తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. -
అప్పుడే ఎదుగుతాం: మౌళి తనుజ్
‘‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, శివానీ నాగారం జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో మౌళి తనుజ్ మాట్లాడుతూ– ‘‘బీటెక్ పూర్తి చేశాను. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పట్నుంచే బేసిక్ ఎడిటింగ్ నేర్చుకున్నాను. మొదట్లో రియాక్షన్ వీడియోస్ చేశాను. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్, మీమ్స్ చేశాను. నేను చదువుకుంటున్నప్పుడే నా ఖర్చులు నేనే చూసుకున్నాను.రైటర్, డైరెక్టర్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. అయితే ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా కథ విన్నప్పుడు థియేట్రికల్‌గా బాగుంటుందనిపించింది. సోషల్ మీడియాలో విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. అయితే సరైన విమర్శలను తప్పక తీసుకుంటాను.లోపాలు సరి చేసుకుంటేనే ఎదుగుతామని నా ఫీలింగ్. ‘లిటిల్ హార్ట్స్’ కేవలం యూత్ కోసమే కాదు... ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ చిత్రం. ఇక దర్శకుణ్ణి కావాలన్న నా కల నేరవేరుతుందా? లేదా అనేది తెలియదు. కానీ కథ ఉంది. ఈ కథలో నేనే హీరోగా నటించి, దర్శకత్వం వహిస్తాను’’ అని అన్నారు. -
థియేటర్, ఓటీటీ తేడా చూడను.. కథ, నా పాత్ర నచ్చితే చాలు : శివానీ నాగారం
‘‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో కాత్యాయని అనే కాలేజ్ గర్ల్‌గా చేశాను. ప్రేక్షకులు తమని తాము పోల్చుకునేలా నా పాత్ర ఉంటుంది. ఈ సినిమాలోని అఖిల్ (మౌళి తనుజ్ పాత్ర), కాత్యాయని స్నేహం, ప్రేమ చూస్తుంటే కళాశాల రోజులు, అలాగే విద్యార్థిగా మనం చేసిన పనులన్నీ గుర్తొస్తాయి... మేమూ ఇలాగే ఉండేవాళ్లం అనిపిస్తుంది’’ అని శివానీ నాగారం తెలిపారు. మౌళి తనుజ్, శివానీ నాగారం జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాని బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ నాగారం మాట్లాడుతూ– ‘‘లిటిల్ హార్ట్స్’ సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి, నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. తన ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. సాయి మార్తాండ్ కథ, నా పాత్ర చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మంచి కంటెంట్ ఉన్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. మా సినిమా కంటెంట్ నచ్చడంతో ‘బన్నీ’ వాసు, వంశీ నందిపాటిగార్లు రిలీజ్ చేస్తున్నారు. దాంతో మా సినిమా ఓవర్సీస్లోనూ విడుదలవుతోంది. ఇక థియేటర్, ఓటీటీ అనే తేడాలు చూడను. కథ, నా పాత్ర నచ్చితే వెబ్ సిరీస్‌లు కూడా చేస్తాను. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా తర్వాత నేను, సుహాస్ కలిసి ‘హే భగవాన్’ సినిమా చేస్తున్నాం. మరో రెండు చిత్రాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. -
అలా డిమాండ్ చేయడంలో అర్థం లేదు : బన్నీ వాసు
‘‘లిటిల్ హార్ట్స్’ చిత్ర కథ బాగుంది. యూత్ కంటెంట్‌తో మంచి వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో ఎక్కడా అశ్లీలత ఉండదు.. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. మా చిత్రం చూసి, ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు’’ అని నిర్మాత బన్నీ వాస్ తెలిపారు. మౌళి తనుజ్, శివానీ నాగరం జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌పై ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ సినిమాని బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ–‘‘సినిమాలకు ప్రేక్షకులు రావాలని మనం డిమాండ్ చేయడంలో అర్థం లేదు. సినిమా బాగుంటే వాళ్లే వస్తారు. మల్టీప్లెక్స్‌లో ఫుడ్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయనేది నిజమే. అయితే మూవీ బాగుంటే ప్రేక్షకుడు ఆ ఖర్చు భరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రోజుకి ఐదు షోలు వేయాలని ప్రభుత్వం ఆదేశించినా పాటించడం లేదు.. ఇక్కడ నిబంధనలు ఎన్నో ఉంటాయి. కానీ, పాటించడమే అసాధ్యం’’ అన్నారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘బన్నీ వాస్‌గారు తన బ్యానర్ నుంచి తీసుకొస్తున్న తొలి చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. దానికి తగినట్లే నిర్మాతలూ మారాల్సి ఉంది’’ అని తెలిపారు. -
ఆస్కార్ వస్తది చూడు!
‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటించిన లవ్‌స్టోరీ ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రోడక్షన్ పతాకంపై సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 5న థియేటర్స్‌లో విడుదల కానుంది. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నంది పాటి ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. శనివారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో అఖిల్ పాత్రలో మౌళి, కాత్యాయనిగా శివాని నటించారు. ‘‘మన హీరో సైనిక్‌పురిలో చదువు రానివాడు’, ‘మన హీరోయిన్ వాయుపురిలో చదువురానిది’, ‘ఈ చదువు రాని ఇద్దరు చదువు ఎగ్గొట్టి మరీ లవ్ చేసుకుంటారు’, ‘ఈ చదువు రాని పిల్లల హృదయాల మధ్య జరిగే సంఘర్షణే ఈ కథ’, ‘హిట్టవుతదరా... ఈ సినిమా’, ‘నాకు డౌటే...’, ‘పక్కా హిట్టే... ఆస్కార్ వస్తది చూడు..’ వంటి డైలాగ్స్ ఈ సినిమా ట్రైలర్లో ఉన్నాయి. -
నాగచైతన్యపై సెటైర్లు వేసిన ఈ బుడ్డొడు..ఇలా మారిపోయాడేంటి?
‘100% లవ్’ సినిమాలో బొద్దుగా ఉండే ఓ బుడ్డొడు గుర్తున్నాడా..? చదువు.. చదువు అంటూ బాలు(నాగచైతన్య) పెట్టే టార్చర్ భరించలేక మహాలక్ష్మీ(తమన్నా)తో చేతులు కలుపుతాడు. మహాలక్ష్మీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత బాలు ముద్దే చికెన్ తింటూ..‘ఎవడ్రా చికెన్ తింటే బ్రెయిన్ పని చేయదని చెప్పింది?’ అంటూ నాగచైతన్యపై సెటైర్లు వేసి అందరిని కడుపుబ్బా నవ్వించాడు. ఆ బుడ్డొడు ఇప్పుడు చాలా పెద్దవాడైపోయాడు. గడ్డం, మీసాలు పెంచి హీరోలా మారిపోయాడు. అతని పేరు నిఖిల్ అబ్బూరి. #90s సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా తెరకెక్కుతున్న లిటిల్ హార్ట్స్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో మౌళి.. నిఖిల్‌ని పరిచయం చేశాడు. 100% సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడంటూ మౌళి చెప్పేవరకు ఆ బుడ్డోడే ఈ నిఖిల్ అని ఎవరూ గుర్తుపట్టలేదు. ఆ సినిమా నిర్మాత బన్నీవాసు సైతం నిఖిల్‌ని గుర్తుపట్టలేకపోయాడు. అంతలా మారిపోయాడు మనోడు. టీజర్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన అనిల్ రావిపూడి సైతం నిఖిల్‌ని చూసి ఆశ్చర్యపోయాడు. ‘100% లవ్ సినిమాలో చికెన్ తిన్నది నువ్వేనా? గుర్తుపట్టలేకపోయాను నాన్న.. ’ అంటూ నిఖిల్‌ని స్టేజ్‌పైకి పిలిచి అభినందించాడు. ప్రభాస్ ‘మిర్చి’, రామ్ ‘గణేశ్’తో పాటు పలు సినిమాల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన నిఖిల్..ఇప్పుడు హీరోగా ట్రై చేస్తున్నాడు. లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రని పోషించాడు. ఈ చిత్రం ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. #100%Love లో చికెన్ తిన్నది నువ్వేనా? గుర్తుపట్టలేదు నాన్న నిన్ను.... pic.twitter.com/AzUhCTxHCh— Rajesh Manne (@rajeshmanne1) August 19, 2025 -
ఫుల్ కామెడీ
మౌళి తనూజ్, శివానీ నగరం లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించారు. ఈ సినిమాని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు. సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాజా గాడికి...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘లిటిల్ హార్ట్స్’ చూస్తున్నంత సేపూ ఎంజాయ్ చేశాను. థియేటర్స్‌లో ప్రేక్షకులు సీట్ల మీద నుంచి కింద పడేలా బాగా నవ్వుకుంటారు. ఈ సినిమాను కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఫ్రీ షోస్ వేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. ‘‘లిటిల్ హార్ట్స్’ కథను తొలుత మౌళి నమ్మాడు. మౌళి మీద నమ్మకంతో ఆదిత్య హాసన్‌గారు నమ్మారు.అలా ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా మారాను’’ అన్నారు సాయి మార్తాండ్. ‘‘2 గంటలు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు’’ అని ఆదిత్య హాసన్ చెప్పారు. ‘‘బన్నీ వాసుగారు తన బ్యానర్ నుంచి తీసుకొస్తున్న ఫస్ట్ మూవీ ఇది’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ తర్వాత మంచి సబ్జెక్ట్ కోసం వేచి చూడగా ‘లిటిల్ హార్ట్స్’లో మంచి పాత్ర దక్కింది’’ అన్నారు శివానీ. ‘‘పూర్తి వినోదాత్మక చిత్రమిది’’ అని మౌళి తనూజ్ చెప్పారు. -
ఓటీటీకి వచ్చేస్తోన్న మలయాళ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళం సినిమాలకు క్రేజ్ ఓ రేంజ్లో ఉంటోంది. గతంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాయి. మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు లాంటి టాలీవుడ్ ప్రియులను అలరించాయి. తాజాగా మరో మలయాళ మూవీ తెలుగు ఆడియన్స్‌ను అలరించేందుకు వస్తోంది.మలయాళంలో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవలం మలయాళం భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ వేదికగా పంచుకుంది. కాగా.. ఈ ఏడాది జూన్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రంలో షేన్ నిగమ్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆంటో జోస్ పెరీరా, అబీ ట్రెసా పాల్ తెరకెక్కించారు.Don't miss the heartwarming journey of #littlehearts. Premieres October 24th on aha. pic.twitter.com/GRHtwgghY7— ahavideoin (@ahavideoIN) October 21, 2024 -
చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో ఈ నెల 23 నుంచి నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 14 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ వారి సహకారంతో పది మంది ఇంగ్లాండ్ వైద్యుల బృందం క్లిష్టతరమైన గుండె సమస్యలు ఉన్న చిన్నారులకు నూరుశాతం విజయవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు ఆంధ్రాహాస్పటల్స్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పీవీ రామారావు మాట్లాడుతూ తమ హాస్పటల్స్‌లో 2015 డిసెంబరు నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాల ద్వారా ఇప్పటి వరకూ 300 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్సలు ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో అత్యంత క్లిష్టమైన గుండె సమస్యలకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు రామారావు చెప్పారు. యూకే హాస్పటల్స్, లెస్టర్ రాయల్ ఇంపమరీ, గ్రేట్హార్మోన్ స్ట్రీట్ హాస్పటల్ లండన్, రాయల్ మాంచెస్టర్ చిల్డ్రన్స్ హాస్పటల్ వంటి ప్రముఖ హాస్పటల్స్ నుంచి వైద్యులు ప్రత్యేక శిబిరాల్లో పాల్గొని శస్త్ర చికిత్సలు నిర్వహించారన్నారు. సమావేశంలో యూకే వైద్యులు డాక్టర్ ఒప్పిడో గిడో, డాక్టర్ సెర్రావు ఆండ్రియా, కార్వే లైనుసయమారీ, స్కేర్పాటి క్యాటీలోసిదే, బీచార్డ్ ఎలిజెబెత్ జీన్, మేరీ క్యాథలీన్, గోపిశెట్టి షర్మిల, ఆంధ్రా హాస్పటల్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుములు, కార్డియాలజిస్ట్ డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. హీరో మహేష్‌బాబు అభినందనలు... నవ్యాంధ్రలో గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్న ఆంధ్ర హాస్పటల్స్, యూకే వైద్యుల బృందాన్ని సినీహీరో మహేష్‌బాబు అభినందించారు. యూకే వైద్యులతోపాటు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న చిన్నారులు, తల్లిదండ్రులు శుక్రవారం హోటల్ డీవీ మానర్‌లో మహేష్‌బాబును కలిశారు. మహేష్‌బాబు మట్లాడుతూ ఇంత మంది చిన్నారులకు నూరుశాతం సక్సెస్ రేటుతో సర్జరీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు సేవలు అందించే విషయంలో తమవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. -
స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం
చెరుకుపల్లి: బ్రేకులు ఫెయిల్ కావటంతో స్కూలు బస్సు బోల్తా పడింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కామినేనివారిపాలెం వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. చెరుకుపల్లి మండలకేంద్రంలోని లిటిల్‌హార్ట్స్ స్కూలుకు చెందిన బస్సు కామినేని వారి పాలెం వైపు నుంచి విద్యార్థులతో వస్తోంది. మార్గమధ్యంలో బ్రేకులు పనిచేయకపోవటంతో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. అదృష్టవశాత్తు విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు.