live-streame
-
సుప్రీంకోర్టు లో వాదనలు ప్రత్యక్ష ప్రసారం
-
షాకింగ్ లైవ్ స్ట్రీమింగ్.. వ్యక్తి అరెస్టు!
సాక్షి, కొచ్చి: చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఏదైనా ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం లభిస్తోంది. అయితే, ఈ టెక్నాలజీని దుర్వినియోగపరిచేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా కేరళలో ఓ యువకుడు మహిళతో శృంగారాన్ని నెరుపుతూ.. దానిని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనపై అత్యాచారం చేశాడని పేర్కొంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానిక మీడియా, పోలీసుల కథనాల ప్రకారం వివరాలివి.. 23 ఏళ్ల లినుకు ఇడుక్కీలోని ఓ వస్త్రాల దుకాణంలో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వివాహిత అయిన ఆమెకు ఓ చిన్నారి ఉంది. అయితే, భర్తకు దూరంగా ఉంటోంది. ఇద్దరూ ఆరు నెలలుగా సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన లిను తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో అతను మహిళతో శృంగారాన్ని జరుపుతున్న ఘటనను ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారిపోయింది. ఇద్దరు పరస్పర సమ్మతితో శృంగారంలో పాల్గొన్నప్పటికీ.. అతను ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సంగతి ఆమెకు తెలిసి ఉండకపోవచ్చునని పోలీసులు అంటున్నారు. లైకుల కోసమే తాను లైవ్ స్ట్రీమింగ్ చేశానని..ఈ విషయం ఆమెకు తెలుసనని లిను ఆరోపిస్తున్నాడు. అతని ఫోన్లో ఇద్దరూ సాన్నిహితంగా గడుపుతున్న వీడియోలు మరికొన్ని దొరికాయని పోలీసులు అంటున్నారు. మహిళపై ప్రతీకారం తీర్చుకోవడానికో, కోపం ప్రదర్శించడానికో అతను ఇలా ప్రత్యక్ష ప్రసారం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడంతో మహిళ పెట్టిన రేప్ కేసు మాత్రం నిలబడదని అంటున్నారు. -
లైవ్‌లో సొంత చెల్లెలిని చంపేసింది!
-
లైవ్‌లో సొంత చెల్లెలిని చంపేసింది!
అడ్డదిడ్డంగా కారును నడిపి.. ఆ ప్రమాదంలో చెల్లెలు చనిపోతుండగా.. ఆ ఘటనను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది ఓ ప్రబుద్ధురాలు. అమెరికాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిరేపింది. 18 ఏళ్ల అబ్డులియా సాంచెజ్ కాలిఫోర్నియా హైవేపై కారును నడుపుతూ ఒక్కసారిగా అదుపు కోల్పోయింది. దీంతో రోడ్డు అంచుల వరకు వెళ్లి తిరిగి మలుపుతీసుకొని.. ఆ తర్వాత పక్కన ఉన్న వైరు ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో వెనుకసీటులో కూర్చున్న సాంచెజ్ 14 ఏళ్ల సోదరి జాక్వలిన్, మరో టీనేజ్ అమ్మాయి కారులోంచి బయటకు ఎగిసిపడ్డారు. ఇద్దరూ సీటు బెల్ట్‌లు ధరించలేదు. ప్రమాదం అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్స్టీమింగ్ చేసిన సాంచెజ్ తన ప్రియమైన సోదరి జాక్వలిన్ చనిపోతున్నదని, ఆమెను చంపాలని తాను అనుకోలేదని, అయినా ఆమె చనిపోతున్నదని పేర్కొంది. ప్రమాదం కారణంగా తలనుంచి తీవ్రరక్తస్రావమైన జాక్వలిన్ ఆ తర్వాత కాపేటికే చనిపోయింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ప్రమాదంపై సాంచెజ్ తండ్రి స్పందిస్తూ తన పెద్ద కూతురే తన సొంత చెల్లెలిని చంపేసిందని పేర్కొన్నారు. 'తానేదో తప్పు చేసింది. ఆ విషయం తనకు చెడుగా అనిపించింది. అందుకే సొంత చెల్లెలిని తను చంపేసింది' అని ఆయన మీడియాతో చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కారును అడ్డదిడ్డంగా నడిపి సోదరి మృతికి కారణమైనట్టు సాంచెజ్ పోలీసు కేసును ఎదుర్కొంటున్నది. -
బరితెగిస్తున్న వెబ్సైట్లపై విచారణకు ఆదేశం
యూజర్లను పెంచుకోవడానికి ఆన్లైన్ లైవ్‌స్ట్రీమింగ్ వెబ్సైట్లు ఎంత దూరమైన వెలుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారాల్లో అశ్లీలత, గేమ్‌లలో హింసను ప్రేరేపించే కంటెంట్లు ఎక్కువగా వాడుతున్నాయి. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా చైనా ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారాలు చేసే వెబ్సైట్లపై నిఘా పెంచాలని నిర్ణయం తీసుకుంది. వివిధ ఆన్లైన్ లైవ్‌స్ట్రీమింగ్ వెబ్సైట్లలో 20 కోట్లకు పైగా యూజర్లు రిజిస్టర్ చేస్తున్నారని చైనా సంస్కృతికి శాఖ తెలిపింది. అశ్లీల కార్యక్రమాలు, హింసను ప్రేరేపించేలా ఉన్న ప్రత్యక్ష ప్రసారాలు చేసే వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాని భావిస్తుంది. దీనిలో భాగంగానే నిబంధనలను విరుద్ధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ప్రత్యక్షప్రసారాలను చేసే వెబ్సైట్లపై చైనా సంస్కృతికి శాఖ గురువారం విచారణకు ఆదేశించింది. వీటిలో చైనాలో ఎంతగానో పేరున్న(douyu.com, zhanqi.tv) ప్రముఖ వెబ్సైట్లు కూడా ఉన్నాయి. జనవరిలో douyu.com లో తెల్లవారు జామున ఆన్లైన్ హోస్ట్ చేసే వ్యక్తి మరో మహిళతో శృంగారంలో పాల్గొంటూ ప్రత్యక్షప్రసారం చేశాడు. దీంతో ఈ సంఘటన పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే సదరు వెబ్సైట్ యాజమాన్యం ఆ ఉద్యోగిని తొలగించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని వివరణ ఇచ్చుకుంది. అప్పటి నుంచే ఆన్లైన్ లైవ్‌స్ట్రీమింగ్ వెబ్‌సైట్స్ పై ప్రభుత్వ నియంత్రణలోపించిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.