బరితెగిస్తున్న వెబ్‌సైట్‌లపై విచారణకు ఆదేశం
యూజర్లను పెంచుకోవడానికి ఆన్‌లైన్ లైవ్‌స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు ఎంత దూరమైన వెలుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారాల్లో అశ్లీలత, గేమ్‌లలో హింసను ప్రేరేపించే కంటెంట్‌లు ఎక్కువగా వాడుతున్నాయి. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా చైనా ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారాలు చేసే వెబ్‌సైట్‌లపై నిఘా పెంచాలని నిర్ణయం తీసుకుంది. వివిధ ఆన్‌లైన్ లైవ్‌స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లలో 20 కోట్లకు పైగా యూజర్లు రిజిస్టర్ చేస్తున్నారని చైనా సంస్కృతికి శాఖ తెలిపింది. అశ్లీల కార్యక్రమాలు, హింసను ప్రేరేపించేలా ఉన్న ప్రత్యక్ష ప్రసారాలు చేసే వెబ్‌సైట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాని భావిస్తుంది. దీనిలో భాగంగానే నిబంధనలను విరుద్ధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ప్రత్యక్షప్రసారాలను చేసే వెబ్‌సైట్‌లపై చైనా సంస్కృతికి శాఖ గురువారం విచారణకు ఆదేశించింది.
వీటిలో చైనాలో ఎంతగానో పేరున్న(douyu.com, zhanqi.tv) ప్రముఖ వెబ్‌సైట్‌లు కూడా ఉన్నాయి. జనవరిలో douyu.com లో తెల్లవారు జామున ఆన్‌లైన్ హోస్ట్ చేసే వ్యక్తి మరో మహిళతో శృంగారంలో పాల్గొంటూ ప్రత్యక్షప్రసారం చేశాడు. దీంతో ఈ సంఘటన పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే సదరు వెబ్‌సైట్ యాజమాన్యం ఆ ఉద్యోగిని తొలగించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని వివరణ ఇచ్చుకుంది. అప్పటి నుంచే ఆన్‌లైన్ లైవ్‌స్ట్రీమింగ్ వెబ్‌సైట్స్ పై ప్రభుత్వ నియంత్రణలోపించిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.