obscene
-
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు
-
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
బెంగళూరు: మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణకు బెంగళూరు కోర్టు రిమాండ్ విధించింది. ఆరు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డ మహిళను కిడ్నాప్ చేశారని రేవణ్ణపై కేసు నమోదైంది. ఈ కేసులో రేవణ్ణను ఇటీవలే సిట్ అరెస్టు చేసింది. తన తల్లిని కిడ్నాప్ చేయడమే కాక ఆమెపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని కిడ్నాప్‌కు గురైన మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రేవణ్ణపై కేసు నమోదైంది. -
అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ మహిళా నేతల అరెస్టు
గుడివాడ రూరల్(కృష్ణా జిల్లా): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఫొటోలతో అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ మహిళా నేతలను అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ గోవిందరాజు తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకురాలు, మాజీ కౌన్సిలర్ రేమల్లి ప్రభోద రాణి ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో అభ్యంతకరమైన పోస్టులు పెట్టిన టీడీపీ నాయకురాలు అసిలేటి నిర్మల, సిరిపురపు తులసీరాణి, మాదాల సునీత, బంటు రోజాలను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిపై నాన్‌బెయిల్ సెక్షన్ 505–2 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు వివరించారు. చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం! -
స్పా, సెలూన్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: స్పా, సెలూన్లు, వెల్నెస్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై విజయవాడ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. గత వారం రోజులుగా వీటిపైన పోలీసులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఎనీ్టఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆదేశాల మేరకు డీసీపీ విశాల్ గున్నీ నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 18 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి. ‘స్పా’ట్ పెట్టారు.. నగరంలో మాచవరం, మొగల్రాజపురం, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో 190కి పైగా స్పా సెంటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో ఇప్పటికే 60 స్పాలపై దాడులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 46 స్పాలను సీజ్ చేశారు. పోలీసులు దాడులు చేస్తుండటంతో కొన్ని స్పాలను నిర్వాహకులు మూసివేశారు. అలాంటి వాటిపైనా పోలీసులు దృష్టి సారించి వివరాలు సేకరిస్తున్నారు. విజయవాడ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. వీటిపై దృష్టి.. ప్రధానంగా వీరి తనిఖీల్లో నిబంధనల ప్రకారం వ్యాపార నిర్వహణ కోసం లైసెన్సు తీసుకొన్నారా లేదా? ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా? వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చాలా వాటికి ఇలాంటి అనుమతులు లేకుండానే అనధికారికంగా నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కొన్ని సెంటర్లలో స్పా, మసాజ్‌ల పేరుతో ఏకంగా క్రాస్ మసాజ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఇలా ఇప్పటి వరకు దివ్య యూనిసెక్స్ అండ్ బ్యూటీ సెలూన్, గోల్డెన్ ఓక్స్, హనీ బ్యూటీస్పా, ఫర్ యూ ఫ్యామిలీ సెలూన్ సెంటర్లలో క్రాస్ మసాజ్ జరుగుతున్నట్లు గుర్తించి, అందుకు తగిన ఆధారాలు లభించడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే ఏడుగురు స్పా నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 18 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. 28 మంది యువతులను ఈ మురికి కూపం నుంచి కాపాడి, వారిని తాత్కాలికంగా హోమ్స్‌లో ఉంచి వారి సొంత ఊళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పేరు మాత్రమే ఫ్యామిలీ.. చాలా సెంటర్లు ఫ్యామిలీ స్పాలంటూ పేర్లు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ, హరియాణా, ఈశాన్య రాష్ట్రాలు, థాయ్‌ల్యాండ్ చెందిన యువతులను తెచ్చి వీరితో క్రాస్ మసాజ్‌తో పాటు వ్యభిచారం కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. యువతుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని, డబ్బు ఆశ చూపి, ఇక్కడికి వచ్చాక బలవంతంగా ఈ మురికికూపంలో దించుతున్నట్లు సమాచారం. ఈ తరహా స్పాల్లోకి వెళ్లేందుకు నిర్వాహకులు హై సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు చేసుకున్నారు. ఫింగర్ ప్రింట్ పెడితేనే లోపలికి అనుమతి ఉంటుంది. మొదట సాధారణ మసాజ్ సెంటర్లాగే నిర్వహించి.. ఆ తర్వాత నెమ్మదిగా కస్టమర్లను తమ మార్గంలోకి మలచుకుంటున్నట్లు తెలుస్తోంది. స్పాలోకి వెళ్లే విటుల నుంచి కూడా పెద్ద మొత్తంలో గుంజుతున్నట్లు సమాచారం. గట్టి నిఘా.. విజయవాడలో ఈ విష సంస్కృతి ప్రబలకుండా, వీటిపైన పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఆయా స్పా నిర్వాహకులకు పెద్ద తలకాయలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఈ స్పాల నిర్వహణలో పోలీసుల సహకారం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. రాష్ట్ర నిఘా వర్గాలు ఈ వ్యవహారంపైన సమాచారం సేకరిస్తున్నాయి. ఉపేక్షించేది లేదు.. స్పా సెంటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. వీటిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఇటీవల మూసి వేసిన స్పాల గురించి కూడా ఆరా తీస్తున్నాం. ఆయా స్పాలను ఎప్పుడు మూసివేశారు? దాని నిర్వాహకులు ఎవరూ? గతంలో ఎన్నిరోజుల పాటు నిర్వహించారు? వంటి అంశాలను పరిశీలిస్తున్నాం. నగరంలోని ఏ ప్రాంతాలలోనైనా ఇలాంటివి జరిగితే.. 7328909090 (వాట్సాప్)కుగానీ, డయల్100గానీ సమాచారం ఇవ్వవచ్చు. వీటితో పాటు ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా కూడా తెలుపవచ్చు. సమాచారం ఇచ్చే వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచుతాం. నిర్భయంగా సమాచారం ఇవ్వవచ్చు. – విశాల్ గున్నీ, డీసీపీ, ఎన్టీఆర్ జిల్లా -
మరో పోర్న్ యాప్ గుట్టు రట్టు..నిర్మాతపై కేసు నమోదు
సాక్షి,ముంబై: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ బీటౌన్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఓవైపు విచారణ కొనసాగుతుండగానే, మరో పోర్నో రాకెట్ వెలుగులోకి వచ్చింది. అశ్లీల చిత్రాల పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారన్న కారణంతో ప్రముఖ నిర్మాత విభూ అగర్వాల్‌పై కేసు నమోదైంది. అసభ్యత, అశ్లీల కంటెంట్‌తో వీడియాలు రూపొందిస్తున్న అంశంపై ఉల్లూ యాప్ డిజిటల్ ప్రై.లి. కంపెనీ సీఈవో అయిన విభూ అగర్వాల్, కంపెనీ హెడ్ అంజలీ రైనాలపై అంబోలి పోలిస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు ముంబై పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 354 కింద ఈనెల 4న కేసు ఎఫ్ఐఆర్ నమోదైనట్లు పేర్కొన్నారు. అంధేరీలోని ఉల్లూ ఆఫీస్‌లోని స్టోర్ రూమ్‌లో 28 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు తమ వద్ద సమాచారం ఉందని ముంబై పోలీసులు తెలిపారు. కాగా 2013లో బాత్ బాన్ గయూని సినిమా నిర్మించిన విభూ అగర్వాల్..డాన్స్ బార్ సినిమాతో పాటు మరికొన్ని వెబ్‌సిరీస్‌లను నిర్మించారు. ఆ తర్వాత 2019లో ఉల్లూ యాప్‌ను ప్రారంభించి హిందీ, ఇంగ్లీష్,భోజ్‌పురి,తెలుగు, మరాఠీ సహా వివిధ భాషల్లో అశ్లీల కంటెంట్‌తో వీడియోలు రూపొందించినట్లు తెలుస్తుంది. ఉల్లూ యాప్ నిర్వహణతో పాటు వీడియోల పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు విభూ అగర్వాల్‌పై ఆరోపణలు ఉన్నాయి. Maharashtra | Police have registered a case against Vibhu Agrawal, the CEO of film production company Ullu Digital Pvt Ltd for allegedly sexually harassing a woman, under Section 354 of IPC in Mumbai. Anjali Raina, the company's country head has also been booked: Mumbai Police — ANI (@ANI) August 5, 2021 -
అత్యాచారాలకు అదే కారణం : బీజేపీ ఎంపీ
భోపాల్ : ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్‌లో అశ్లీల చిత్రాలకు యువత అకర్షణకు గురవుతున్నారని, దాని వల్లనే దేశంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ నందకుమార్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. వీటి వల్ల అమాయక వ్యక్తులపై కూడా చెడు ప్రభావం పడుతోందని అన్నారు. కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని ఖాండ్వా బీజేపీ ఎంపీ నందకుమార్ సింగ్ గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మొబైల్ ఫోన్స్‌లో అశ్లీల చిత్రాలను సైబర్ సెల్ పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అని ఓ విలేకరి అడగగా... ప్రతీ వ్యక్తి మొబైల్ ఫోన్‌ను పోలీసులు రహస్యంగా చెక్ చెయాలేరుగా అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల్లో దేశంలోనే మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానక్ అగర్వాల్ విమర్శించారు. ప్రభుత్వమే విఫలమైనప్పుడు మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ లాంటివి ఏం చెయగలవని అన్నారు. క్రిమినల్స్‌పై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమైయ్యారని, అదే మహిళలపై అత్యాచారాలకు దారి తీస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా కాంగ్రెస్ మహిళా విభాగం నేడు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసం ఎదుట ధర్నా నిర్వహించింది. -
మగాళ్లు సీతాకోక చిలుకలు.. !
చిత్తూరు : ‘మగాళ్లు సీతాకోక చిలుకల్లాంటి వారు. ఆడపిల్లలు పూబంతులు. వీరిని ఆకట్టుకోవడానికి సీతాకోక చిలుకలు రంగు రంగుల ఆకర్షణలతో రకాల వేషాలు వేస్తుంటారు. అలాంటి వారి ఆకర్షణకు మహిళలు లోనుకావద్దు. మాన, ప్రాణ, ఆత్మరక్షణ కోసం అవసరమైతే అంతం చేస్తాం.. అని ఎదురుతిరగాలి. అలాగని మగాళ్లందరూ చెడ్డవారు కాదు.’ అని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. పిల్లలు, యువతను పెడదోవ పట్టిస్తున్న అశ్లీల వెబ్సైట్లు, యూ ట్యూబ్‌ల్లోని వీడియోలను కేంద్రం తొలగించాలన్నారు. తమ డిమాండ్‌ను కేంద్రానికి రాతపూర్వకంగా అందిస్తామన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన భార్గవి, తిరుమల, నాగరత్న, నిర్మల అనే నలుగురు మహిళా కానిస్టేబుళ్లు గత 45 రోజులుగా 1200 కిలో మీటర్ల పాటు సైకిల్‌పై తిరుగుతూ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తూరులో గురువారం జరిగిన ఈ ముగింపు కార్యక్రమానికి నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫేస్బుక్, యూ ట్యూబ్, వాట్సప్లను అవసరాలకు కాకుండా అనవసర విషయాలకు నేటి యువత ఎక్కువగా వినియోగిస్తోందన్నారు. దీనికి తోడు టీవీల్లో వచ్చే కొన్ని సీరియల్స్ మహిళల్ని చులకనగా చూపించడం, నేర ప్రవృత్తిని రెచ్చగొట్టేలా ఉండటం, అసభ్యంగా చూపడం వల్ల సమాజంలో మహిళల పట్ల ఎక్కువగా వేధింపులు, దాడులు జరుగుతున్నాయన్నారు. ఆడ పిల్లలు తల్లితండ్రుల కంటే ఎక్కువ సమయం ఉపాధ్యాయుల వద్దే ఉంటున్నారని, వారిని చదువులకే పరిమితం చేయకుండా సమాజం ఎలా పోతోంది, సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయాలను సైతం నేర్పించాల్సిన బాధ్యత టీచర్లు, అధ్యాపకులపై ఉందన్నారు. -
బరితెగిస్తున్న వెబ్సైట్లపై విచారణకు ఆదేశం
యూజర్లను పెంచుకోవడానికి ఆన్లైన్ లైవ్‌స్ట్రీమింగ్ వెబ్సైట్లు ఎంత దూరమైన వెలుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారాల్లో అశ్లీలత, గేమ్‌లలో హింసను ప్రేరేపించే కంటెంట్లు ఎక్కువగా వాడుతున్నాయి. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా చైనా ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారాలు చేసే వెబ్సైట్లపై నిఘా పెంచాలని నిర్ణయం తీసుకుంది. వివిధ ఆన్లైన్ లైవ్‌స్ట్రీమింగ్ వెబ్సైట్లలో 20 కోట్లకు పైగా యూజర్లు రిజిస్టర్ చేస్తున్నారని చైనా సంస్కృతికి శాఖ తెలిపింది. అశ్లీల కార్యక్రమాలు, హింసను ప్రేరేపించేలా ఉన్న ప్రత్యక్ష ప్రసారాలు చేసే వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాని భావిస్తుంది. దీనిలో భాగంగానే నిబంధనలను విరుద్ధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ప్రత్యక్షప్రసారాలను చేసే వెబ్సైట్లపై చైనా సంస్కృతికి శాఖ గురువారం విచారణకు ఆదేశించింది. వీటిలో చైనాలో ఎంతగానో పేరున్న(douyu.com, zhanqi.tv) ప్రముఖ వెబ్సైట్లు కూడా ఉన్నాయి. జనవరిలో douyu.com లో తెల్లవారు జామున ఆన్లైన్ హోస్ట్ చేసే వ్యక్తి మరో మహిళతో శృంగారంలో పాల్గొంటూ ప్రత్యక్షప్రసారం చేశాడు. దీంతో ఈ సంఘటన పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే సదరు వెబ్సైట్ యాజమాన్యం ఆ ఉద్యోగిని తొలగించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని వివరణ ఇచ్చుకుంది. అప్పటి నుంచే ఆన్లైన్ లైవ్‌స్ట్రీమింగ్ వెబ్‌సైట్స్ పై ప్రభుత్వ నియంత్రణలోపించిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. -
మత బోధకుడి కేసులో నిందితుల అరెస్ట్
విజయవాడ (గుణదల) : ఓ మహిళతో అశ్లీలంగా ప్రవర్తించారని, దానికి సంబంధించిన వీడియో ఉందనే సాకుతో మత బోధకుడిని డబ్బు కోసం వేధిస్తున్న మీడియా మాజీ ప్రతినిధి సహా ముగ్గురు నిందితులను గురువారం మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా కంకిపాడు మం డలం ప్రొద్దుటూరుకు చెందిన సుధీర్ ఓ ప్రైవేటు కార్యక్రమానికి మతబోధకుడిని ఆహ్వానించాడు. అప్పటినుంచి అతనితో సన్నిహితంగా ఉండేవాడు. తాను ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశామని చెప్పి మతబోధకుడి వద్ద తరుచూ విరాళాలు తీసుకునేవాడు. ఆ ప్రైవేటు ఫంక్షన్లో ఓ మహిళతో అశ్లీలంగా వ్యవహరించారని, ఆ వీడియో తన వద్ద ఉందని సుధీర్.. మతబోధకుడిని రూ. 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆయన తన స్నేహితుడితో కలిసి నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను కలిసి విష యం చెప్పారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది 9 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో ఓ శాటిలైట్ చానల్ మాజీ ప్రతినిధి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. సీపీ ఆదేశాల మేరకు నిందితుల్లో ముగ్గురు పాయకాపురానికి చెందిన కోరపాటి జోసఫ్ (ఏ1) , కంకిపాడు ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మరీదు శశిధర్ (ఏ5), మందాటి రామోజిచౌదరి (ఏ8)లను మాచవరం పోలీ సులు అరెస్టు చేశారు. ఏ2గా ఉన్న సుధీర్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకుతమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. సుధీర్, విజ య్, ప్రశాంత్, శ్రీకాంత్, సుబ్రమణ్యం, రాములను విచారిస్తున్నారు. మరో మలుపు.. కీలక నిందితుడిగా భావిస్తున్న న్యాయవాదిని ఇంతవరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదని సమాచారం. ఆ న్యాయవాది చర్చి ఫాదర్‌కు, నిందితులకు మధ్యవర్తిత్వం చేస్తున్నానని, తన వద్ద ఉన్న పెన్డ్రైవ్లోనివి వీడియోలు కాదని ప్లేటు ఫిరాయించినట్లు తెలుస్తోంది. ముగ్గురికి రిమాండ్ విజయవాడ లీగల్ : కేసులో నిందితులైన కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మరీదు శశిధర్, పాయకాపురంలోగల రాధా నగర్‌కు చెందిన కొర్రపాటి జోసఫ్, మండాది రామోజిచౌదరిలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. విచారించిన ఒకటవ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్చార్జ్ జడ్జి జి.సత్యప్రభాకరరావు నిందితులకు ఈ నెల 31వరకు రిమాండ్ విధించారు. నిందితులను రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. మత బోధకుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కొంతమందిపై 120-బి, 384, 385, 386, 450, 452, 506, 34 ఐ.పి.సి. సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రావి ప్రకాష్ అనే వ్యక్తిని మాచవరం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది రోజులుగా అక్రమంగా నిర్బంధించినట్లు అతని భార్య సమత కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన మూడవ అదనపు చీఫ్ మెట్రో పాలి టన్ మెజిస్ట్రేట్ న్యాయవాదిని అడ్వకేట్ కమిషనర్‌గా నియమించి నిందితుడు పోలీసు కస్టడీలో ఉంటే వెంటనే కోర్టులో హాజరు పరచమని ఉత్తర్వులు జారీచేశారు. తీరా స్టేషన్‌కు వెళ్లే సరికి ప్రకాష్ లేడు. -
పండగ సంబరాల్లో అశ్లీల నృత్యాలు
-
గేల్ గతంలోనూ...
♦ మహిళతో అసభ్య ప్రవర్తన సిడ్నీ: మహిళా కామెంటేటర్‌తో అభ్యంతరకరంగా ప్రవర్తించి వార్తల్లోకెక్కిన క్రికెటర్ క్రిస్ గేల్‌కు సంబంధించి మరో వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ సందర్భంగా జరిగిన ఈ ఘటనను ఒక మహిళ ‘ఫెయిర్ ఫ్యాక్స్ మీడియా’ ముందు బయట పెట్టింది. వెస్టిండీస్ టీమ్ సహాయకారిక సిబ్బందిగా ఉన్న ఆ మహిళ... స్నాక్స్ కోసం జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లింది. వాస్తవానికి అది ప్రాక్టీస్ సమయం కావడంతో ఆటగాళ్లంతా మైదానంలోనే ఉంటారని ఆమె భావించింది. కానీ గేల్‌తో పాటు మరో క్రికెటర్ అక్కడే ఉన్నారు. ఈ సమయంలో టవల్‌తో ఉన్న గేల్ దానిని కూడా కాస్త తప్పించి ‘దీని కోసమే వెతుకుతున్నావా’ అని వ్యాఖ్యానించాడు. దాంతో బెదిరిపోయిన ఆ మహిళ నాడు ఎవరికీ దీని గురించి చెప్పుకోలేదు. ఇప్పుడు మరో ఘటన జరగడంతో తాను ధైర్యంగా ముందుకు వచ్చానని ఆమె చెప్పింది. గత కొన్నాళ్లుగా కాలమ్స్ రాసేందుకు ఫెయిర్ ఫ్యాక్స్ మీడియా గేల్‌కు భారీ మొత్తం చెల్లిస్తోంది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్‌ను మీడియా సంస్థ రద్దు చేసుకుంది. మరో వైపు కామెంటేటర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టు గేల్‌కు 7 వేల డాలర్ల జరిమానా విధించింది. ఆ అమ్మాయికి గేల్ క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.