living man
-
మారిన గుండెతో 4 దశాబ్దాలు
ఆమ్స్టర్డ్యామ్: గుండె కండరాల సమస్య కారణంగా అవయవాలకు అతని గుండె సరిగా రక్తాన్ని సరఫరా చేయలేని పరిస్థితి. ఈ దుస్థితి ఇలాగే ఉంటే మరో 6 నెలలకు మించి బతకవు అని వైద్యులు కరాఖండిగా చెప్పేశారు. అదేకాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె ఈయనకు సరిగ్గా సరిపోయింది. వెంటనే హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీతో ఈయనకు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. 1984లో గుండె మార్పిడి చేయించుకున్నాక ఇప్పటికీనిక్షేపంగా ఉన్నారు. ప్రపంచంలో గుండె మార్పిడి చేయించుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నెదర్లాండ్స్ వాసి, 57 ఏళ్ల బెర్ట్ జాన్సెన్ కథ ఇది. ప్రస్తుతం గ్లైడర్ పైలెట్‌గా పనిచేస్తున్న ఇతనికి గుండె మార్పిడి చికిత్స జరిగి నేటికి 39 ఏళ్ల 8 నెలల 29 రోజులు. 17 ఏళ్లకు ఫ్లూ వ్యాధి సోకినపుడు వైద్యులు పరీక్షలు చేసి కార్డియో మయోపతి అనే సమస్య ఉందని గుర్తించారు. త్వరగా గుండె మార్చకపోతే ప్రాణానికే ప్రమాదమని తేల్చారు. లండన్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె సరిపోలడంతో ఆయనకు ఆ గుండెను అమర్చారు. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే 16 ఏళ్లకు మించి బతకరనేది అవాస్తవం. గుండె మార్పిడి అద్భుతం అనేందుకు నేనే నిలువెత్తు నిదర్శనం. బర్త్‌డేను అయినా పెద్దగా పట్టించుకోనుగానీ ఆపరేషన్ జరిగిన తేదీ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు’ అని జాన్సెన్ వ్యాఖ్యానించారు. ‘గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండాలి’ అని ఆపరేషన్ చేసిన ప్రఖ్యాత వైద్యుడు మ్యాగ్డీ యాకూబ్ చెప్పారు. ‘40 ఏళ్ల క్రితం నెదర్లాండ్స్‌లో ఇలాంటి ఆపరేషన్ సౌకర్యాలు లేవు. అందుకే జాన్సెన్ను లండన్‌లోని హేర్ఫీల్డ్ ఆస్పత్రిలో గుండెమార్పిడి చేశా’ అని చెప్పారు. -
బతికుండగానే.. మూడురోజులు అంత్యక్రియలు!
అది కర్ణాటకలోని బళ్లారి జిల్లా... భీమసముద్ర అనే కుగ్రామం.. అక్కడ ఓ వ్యక్తికి అంత్యక్రియలు చేస్తున్నారు. పాడెమీద పడుకోబెట్టి.. దండలు వేసి, శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక గొయ్యి తీసి అందులో అతడిని కప్పెట్టారు. గ్రామస్తులంతా ఏడ్చి, తర్వాత ఇళ్లకు తిరిగి వచ్చేశారు. కాసేపు గడిచిందో లేదో.. అతడు గొయ్యిలోంచి బయటకు వచ్చి, చెరువులో స్నానంచ ఏసి మళ్లీ ఇంటికెళ్లిపోయాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు రోజుల పాటు అలాగే చేశారు. ఇదంతా ఎందుకో తెలుసా.. వర్షాలు పడాలని!! ఒకవైపు కర్ణాటయ ప్రభుత్వం మూఢాచారాలకు వ్యతిరేకంగా బిల్లు తేవాలని.. టీవీలలో జాతకాల కార్యక్రమాలను నిషేధించాలని ప్రయత్నిస్తుంటే, మరోవైపు అదే రాష్ట్రంలో ఇలాంటి మూఢాచారాలు కొనసాగుతున్నాయి. ఇలా బతికున్న మనిషికి అంత్యక్రియలు చేస్తే వర్షం పడుతుందన్నది వాళ్ల నమ్మకం. వర్షాలు కురవడం రెండు మూడు నెలలు ఆలస్యం అయితే తాము చర్చించుకుని, ఎవరో ఒకరిని శవంలా నటించడానికి ముందుకు రావాలని అడుగుతామని, వచ్చేవాళ్లు కూడా స్వచ్ఛందంగానే వస్తారు తప్ప బలవంతం ఏమీ ఉండబోదని గ్రామ పెద్దల్లో ఒకరైన ఏటీ భీమణ్ణ తెలిపారు. -
బతికున్న వ్యక్తిని 'చంపేసిన' పేపర్!!
ఆయన వయసు 81 ఏళ్లు. పొద్దున్నే పేపర్ చదవడం ఆయనకు బాగా అలవాటు. అందులో భాగంగానే ఒకరోజు పేపర్ తీసుకున్నారు. అందులో తీరా చూసేసరికి.. తాను చనిపోయినట్లు వార్త ప్రచురితమై ఉంది. అంతే.. దెబ్బకు ఆయన దిమ్మ తిరిగిపోయింది. ఈ సంఘటన స్వీడన్లో జరిగింది. స్వెన్ ఒలోఫ్ స్వెన్సన్ అనే వ్యక్తికి క్రిస్మస్ రోజు నుంచే అనారోగ్యంగా ఉండటంతో దక్షిణ స్వీడన్‌లోని ఆస్పత్రిలో ఆయనను చేర్చారు. ఆయన చెల్లెలు వైద్యులతో ఫోన్లో మాట్లాడగా, ఆయన చెప్పింది విని తన అన్న చనిపోయాడని అనుకుంది. దాంతో ఆయన చనిపోయినట్లు పత్రికలో ప్రకటన ఇచ్చేసింది. కానీ, స్వెన్సన్ స్నేహితుడు ఆ ఆస్పత్రికి అదేరోజు వెళ్తే.. ఈయన భేషుగ్గా మంచం మీద కూర్చుని కనిపించాడు. అదేంటి, నువ్వింకా చచ్చిపోలేదా అనుకుంటూ ఇద్దరూ నవ్వుకున్నారు. వెంటనే పెద్దాయన పత్రికా కార్యాలయానికి ఫోన్ చేసి, తానింకా బతికే ఉన్నానని కూడా చెప్పారు. పత్రికలో జరిగిన పొరపాటును తేలిగ్గా తీసుకుని, మర్నాడు సవరణ వేయాల్సిందిగా కోరడంతో పాటు రిపోర్టర్‌ను కూడా పంపమని అడిగారు.