Living organism
-
నిప్పులకొలిమిలా భగభగలు.. అయినా జీవరాశి ఉనికి!
మిగతా గ్రహాల్లాగే అక్కడా సముద్రాలు, జీవరాశి ఉనికి ఉండేది ఒకప్పుడు. కానీ, సూర్యుడికి దగ్గరగా ఉండడంతో ఆ అధిక వేడిమికి సముద్రాలు ఆవిరైపోవడం, జీవరాశి కనుమరుగైపోవడం.. భూమికి సిస్టర్ గ్రహాంగా అభివర్ణించే శుక్ర గ్రహం విషయంలో జరిగి ఉంటుందనేది ఖగోళ శాస్త్రవేత్తల అంచనా. కానీ, ఇప్పుడు ఆ అంచనాలను తలకిందులు చేసే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. వీనస్‌పై జీవరాశికి ఆస్కారమే లేదని వాదిస్తున్న సైంటిస్టులు.. ఇప్పుడక్కడ జీవరాశికి ఆస్కారం ఉందనే వాదనను తెరపైకి తెచ్చారు. పలు అధ్యయనాల తర్వాత ఫొటోసింథటిక్ మైక్రోఆర్గానిజమ్స్(కిరణజన్య సంయోగ సూక్ష్మజీవులు) ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సౌర వ్యవస్థలో ముందు వరుసలో ఉండడం, పైగా గ్రీన్ హౌజ్ ప్రభావం వల్ల హాట్ గ్యాస్ బెలూన్లా కార్బన్ డై యాక్సైడ్‌తో నిండిపోయింది శుక్ర గ్రహం. దరిమిలా 462 డిగ్రీ సెల్సియస్ సెంటిగ్రేడ్(863 డిగ్రీల ఫారన్‌హీట్) గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యి నిప్పుల కొలిమిని తలపిస్తుంది. అలాంటిది ఈ గ్రహంపైనా జీవరాశి ఉనికిని పసిగట్టారు సైంటిస్టులు. శుక్ర గ్రహం వాతావరణంలో జీవరాశి ఉనికి ఉన్నట్లు గుర్తించారు. శుక్ర గ్రహం మేఘాల నుంచి సూర్యకాంతి చొచ్చుకెళ్లినప్పుడు.. ఫొటోసింథటిక్ మైక్రోఆర్గానిజమ్స్ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. 1. A new study has revealed that the sunlight passing through Venus' clouds could support the growth of photosynthetic microorganisms. Moreover, photosynthesis could even occur during the night time thanks to the planet's thermal energy! pic.twitter.com/j5NfFYmPF5 — The Weather Channel India (@weatherindia) October 11, 2021 సోలార్ ఎనర్జీతో పాటు గ్రహం ఉపరితలం నుంచి థర్మల్ ఎనర్జీ పుట్టడం, కాంతి తరంగదైర్ఘ్యం కారణంగా ఫొటోసింథటిక్ పిగ్మెంట్స్‌ను గుర్తించారు. ఇది అచ్చం భూమి మీద సూర్యకిరణాల వల్ల ఏర్పడే ప్రక్రియలాగే ఉంటుందని చెబుతున్నారు. అధ్యయనానికి సంబంధించిన వివరాలను కాలిఫోర్నియా స్టేట్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాకేష్ మొఘల్ వెల్లడించారు. ఆమ్ల, ద్రావణ(వాటర్) చర్యల వల్ల మైక్రోబయాల్ పెరిగే అవకావం ఉందని చెప్తున్నారు వాళ్లు. Astrobiology జర్నల్‌లో శుక్ర గ్రహంపై జీవరాశి ఉనికికి సంబంధించిన కథనం తాజాగా పబ్లిష్ అయ్యింది. చదవండి: శుక్రుడు మా వాడు.. రష్యా సంచలన ప్రకటన -
అక్కడ జీవం ఉండేందుకు అవకాశం
లండన్: అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు ఉన్నాయా.. సూదూరాన ఇంకా ఎక్కడైనా జీవులు మనగల అవకాశం ఉందా అనే విషయం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎడతెరపి లేని ప్రయోగాలు చేస్తుంటారు. అరుణ గ్రహం, చంద్రుడి మీద జీవం మనగడకు గల అవకాశాలను తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన కొన్ని కథనాలు శుక్రుడి మీద జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుపుతున్నాయి. శుక్రుడిపై ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్పైన్ అణువులు ఉన్నట్టు బ్రిటన్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం వెల్లడించారు. సాధారణంగా ఆక్సిజన్ లేని ప్రాంతంలో నివసించే సూక్ష్మజీవులు ఫాస్పైన్‌ను విడుదల చేస్తాయి. శుక్రుడిపై ఫాస్పైన్ ఉందంటే.. సూక్ష్మజీవులు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. నిపుణుల బృందం చిలీలోని అటాకామా ఎడారిలోని టెలిస్కోప్‌లను ఉపయోగించి శుక్రగ్రహం ఉపరితం నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని క్లౌడ్ డెక్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో వీరు ఫాస్ఫైన్ ఉనికిని గుర్తించారు. భూమి మీద ఇది సేంద్రీయ పదార్థాల విచ్ఛిన్నం నుంచి లభిస్తుంది. పాస్ఫైన్‌కు మండే స్వభావం ఉంటుంది. (చదవండి: వందేళ్లలో ఈ ‘అగ్ని వలయం’ లోతైనది!) అయితే మరొ కొందరు శాస్త్రవేత్తలు మాత్రం పాస్ఫిన్ ఉన్నంత మాత్రాన జీవం ఉండగలని చెప్పలేమంటున్నారు. ఈ సందర్భంగా కార్డిఫ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీకి చెందిన లీడ్ రచయిత జేన్ గ్రీవ్స్ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ‘ఫాస్ఫైన్ ఉన్నంత మాత్రాన ఆ గ్రహం మీద జీవం ఉందని చెప్పలేం. ఒక గ్రహం మీద భాస్వరం సమృద్ధిగా ఉన్నప్పటికి.. జీవం మనుగడకు సంబంధించిన ముఖ్యమైనది అక్కడ లేకపోవచ్చు. ఇతర మూలకాలు ఉండటం వల్ల అక్కడ పరిస్థితులు చాలా వేడిగా.. పొడిగా ఉండవచ్చు’ అని తెలిపారు. అయితే భూమి కాకుండా వేరే రాతి గ్రహం మీద ఫాస్ఫైన్ కనుగొనడం ఇదే మొదటిసారి అన్నారు గ్రీవ్స్. శుక్ర గ్రహం మీదే ఇంత ఆసక్తి ఎందుకంటే.. ఇది మనకు సమీపంగా ఉండటమే కాక.. పరిమాణంలో భూమికి సమానంగా ఉంటుంది. అంతేకాక గత అధ్యయనాలు ఇక్కడ చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయని లావా ప్రవాహాల సంకేతాలతో సహా గుర్తించాయి. -
జీవరాశిని కాపాడుకోవాలి: మేనకాగాంధీ
శామీర్‌పేట్: కీటకాలు మొదలు పెద్ద జంతువు వరకు ఉన్న జీవరాశిని కాపాడుకోవాల్సిన అవసరముందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో శుక్రవారం జంతు సంబంధిత చట్టాల అధ్యయన కేంద్రాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. మేనకాగాంధీ మాట్లాడుతూ ‘జంతు సంరక్షణ అంటే వాటి పట్ల ప్రేమ చూపడమే కాదు. పర్యావరణ పరిరక్షణ కూడా’అని పేర్కొన్నారు. జంతు సంబంధమైన చట్టాలను రూపొందించాలంటే జంతువులపై ఎంతో అధ్యయనం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర స్థాయిలోని పర్యావరణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పర్యావరణ చట్టాల రూపకల్పనకు సహకరిస్తున్నదని, అదేవిధంగా నల్సార్ జంతు సంబంధ చట్టాల కేంద్రం కూడా జంతు సంరక్షణ చట్టాల రూపకల్పనకు తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కేంద్రం జంతు సంబంధ చట్టాల్లోని సమస్యలు, జంతు సంక్షేమ చట్టాల రూపకల్పనకు సహకరిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్న లకు ఆమె ఓపిగ్గా సమాధానం చెప్పారు. అనంతరం హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్(హెచ్ఎస్ఐ) మేనేజింగ్ డైరెక్టర్ జయసింహాను ఈ కేంద్రానికి గౌరవ డైరెక్టర్‌గా నియమించారు. కార్యక్రమంలో నల్సార్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పైజాన్ ముస్తఫా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.