Loan waiver Documents
-
డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వకపోతే రోజుకు రూ. 5 వేల పరిహారం
న్యూఢిల్లీ: రుణం పూర్తి చెల్లింపుల తర్వాత రుణానికి సంబంధించి తనఖాగా ఉంచిన ఒరిజినల్ స్థిర లేదా చర ఆస్తి పత్రాలు అన్నింటినీ రుణగ్రహీతకు 30 రోజుల లోపు తిరిగి ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు స్పష్టం చేసింది. ఏదైనా ఆలస్యం జరిగితే రోజుకు రూ. 5 వేలు పరిహారంగా చెల్లించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన చార్జీలను అన్నింటినీ నిర్దేశిత 30 రోజుల్లో తీసివేయాలని కూడా ఒక నోటిఫికేషన్లో ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ తరహా పలు ఫిర్యాదుల నమోదు నేపథ్యంలో బ్యాంకింగ్ రెగ్యులేటర్ తాజా ఆదేశాలు ఇచి్చంది. డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వడంలో నెల రోజులు దాటితే ఈ జాప్యానికి స్పష్టమైన కారణాలను రుణగ్రహీతకు తెలియజేయాల్సి ఉంటుందని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వడానికి సంబంధించిన విధివిధానాల వివరాలను బ్యాంకింగ్ లేదా ఆర్థిక సంస్థలు తమ తమ వెబ్సైట్లో ఉంచాలని సూచించింది. నష్టం జరిగితే.. మరో 30 రోజులు ఒరిజినల్ చర లేదా స్థిర ఆస్తి పత్రాలు కనబడకుండా పోవడం లేదా ఏదైనా నష్టం జరిగితే అటువంటి పత్రాల డూప్లికేట్ లేదా సరి్టఫైడ్ కాపీలను పొందడంలో రుణగ్రహీతకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పూర్తిగా సహాయపడాలని కూడా ఆర్బీఐ నిర్దేశించింది. ఇందుకు మరో 30 రోజుల సమయాన్ని తీసుకోవచ్చని పేర్కొంది. ఆ తర్వాతే (60 రోజుల తర్వాత) జాప్యానికి రోజుకు రూ.5 వేల పరిహారం నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. కాగా, ఈ పరిహారం... ఇతర ఏదైనా (వర్తించే) చట్టం ప్రకారం ఏదైనా ఇతర పరిహారం పొందేందుకు రుణగ్రహీత కు ఉండే హక్కులకు ఎటువంటి భంగం కలిగించబోదని ఆర్బీఐ స్పష్టం చేయడం గమనార్హం. 2023 డిసెంబరు 1 తర్వాత ఒరిజినల్ చర లేదా స్థిరాస్తి పత్రాలను విడుదల చేసే అన్ని కేసులకు ఈ తాజా ఆదేశాలు వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది. -
మంత్రి గంటాకు చేదు అనుభవం
పులివెందుల: ఏపీ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం పులివెందులలోని చింతారామంలో రెండో విడత రుణమాఫీ పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమకు రుణమాఫీ వర్తించలేదంటూ మంత్రి గంటాను నిలదీశారు. -
రైతుల్లేకుండానే సదస్సులు !
* మమ అనిపిస్తున్న అధికారులు విజయనగరం కంటోన్మెంట్: రైతులకు రుణమాఫీ పత్రాలు అందించేందుకు నిర్వహిస్తున్న రైతు సాధికార సదస్సుల్లో రైతులు కానరావడం లేదు. జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులకు రైతులు హాజరు కాకపోవడంతో వెలవెలబోతున్నాయి. అప్పులున్న వారికి రుణమాఫీ వర్తించకపోవడంతో రైతులు ఈ కార్యక్రమాలపై నిరాసక్తతతో ఉన్నారు. ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ సదస్సులను రైతులు కనీసం పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధికారులు, మం డల స్థాయి అధికారులు హాజరవుతున్న సదస్సులు జనాల్లేక చప్పగా సాగుతున్నాయి. బలిజపేట మండలం చిలకలపల్లిలో నిర్వహించిన సదస్సులో రైతులు తమకు రుణమాఫీ పత్రాలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా గ్రామంలో రూ.50వేల లోపు రుణాలు కలిగి ఉన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారని, వారికి ఎందుకు మాఫీ వర్తింపజేయలేదని అధికారులను నిలదీశారు. అదేవిధంగా బలిజిపేటలో కూడా దాదాపు వందమంది రైతులకు రుణాలు వర్తింపజేయకపోవడంతో వారంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. పార్వతీపురం, మున్సిపాలిటీ, రూరల్ ప్రాంతాల్లో సదస్సులు పేలవంగా జరిగాయి. సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని మెంటాడ వీధి, గాడి వీధుల్లో నిర్వహించిన సదస్సులకు రైతులు కరువయ్యారు. ఎక్కడ చూసినా రైతులు లేకపోవడంతో కొద్ది మంది మాత్రమే వచ్చిన అధికారులు కూడా తిరుగుముఖం పట్టారు. సాలూరు మండలం కందులపదం, కొట్టు పరుపు గ్రామాల్లో అధికారులు పర్యటించినపుడు రైతుల జాడ లేదు. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో ఉన్న వారు అరటి రైతులు కావడంతో వారికి రుణమాఫీ వర్తించకపోవడంతో అక్కడున్న కొద్దిపాటి రైతులను గుర్తించి వారి చేతిలో రుణ విముక్తి పత్రాలను అధికారులు పెట్టి వెళ్లిపోయారు. అయితే పత్రాలిచ్చిన వారికి కూడా ఖాతాల్లో సొమ్ము పడకపోవడంతో నిరాశగా ఉన్నారు. బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో రైతులు లేని సాధికార సదస్సులను అధికారులు మమ అనిపించారు. విజయనగరం డివిజన్లోని నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో రైతు సాధికార సదస్సులు తూతూమంత్రంగా నడిపించారు. ఎస్‌కోట, వేపాడ, కొత్తవలస మండలాల్లో ఈ సదస్సులకు హాజరైన రైతులకు రుణమాఫీ పత్రాలు లేకపోవడం విచారకరం. చాలా మండలాల్లో అన్ని ఆధారాలు సమర్పించిన వారికి కూడా రుణమాఫీ జరగకపోవడంతో వారంతా ఇదేం రుణమాఫీ అని సణుక్కోవడం కనిపించింది.