ఘనంగా మహావీర్ జయంతి వేడుకలు
బళ్లారి నగరంలోని మహావీర జయంతిని పురష్కరించుకుని ఆయా జైనుల ఆలయాలలో మహావీర్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం తేరువీధిలోని జైనుల ఆలయంలో జైనులు, మార్వాడీలు మహావీర్ విగ్రహానికి వివిధ ధార్మిక పూజలు నిర్వహించారు.
అలాగే కౌల్బజార్లోని జైనుల ఆలయం, సత్యానారాయణపేట్ జైనుల ఆలయం, మోతీ సర్కిల్ జైనుల మార్కెట్లో తదితర జైనుల ఆలయాలలో మహావీర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక సంఘం సంస్థల నేతలు కూడా జైనుల చిత్రపటాన్ని ఉంచి పూజలు నిర్వహించి మహావీరుని తత్వాలు, సిద్ధాంతాలు, శాంతి సందేశాలను వివరించి మహావీర్ విగ్రహాన్ని నగర పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు.
బళ్లారి అర్బన్: