locals protest
-
రాయలసీమ ద్రోహి గోబ్యాక్.. చంద్రబాబుకు నిరసన సెగ
సాక్షి, కర్నూలు జిల్లా: పత్తికొండలో చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. హైకోర్టును అడ్డుకుంటున్న ద్రోహి అంటూ ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు కాన్వాయ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. రాయలసీమ ద్రోహి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కాగా, కర్నూలుకు చంద్రబాబు ఏం మొహం పెట్టుకుని వచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గురించి చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలపైన బాదుడే బాదుడు చేసింది.. బాబే కాదా. మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు. తన రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు తాపత్రయం అంటూ ఆయన మండిపడ్డారు. చదవండి: ‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్ చంద్రబాబే’ -
షాహీన్ బాగ్‌లో బుల్డోజర్లు.. స్థానికుల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఢిల్లీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మళ్లీ బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా భారీగా ఆందోళనలు నిర్వహించి వార్తల్లో నిలిచిన షాహీన్ బాగ్ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం బుల్డోజర్లు, జేసీబీలను అధికారులు షాహీన్బాగ్కు తరలించారు. అయితే ఈ కూల్చివేత డ్రైవ్‌ను అడ్డుకొని స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో షాహిన్ బాగ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక నివాసితులతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూల్చివేతలను అడ్డుకున్నారు. బుల్డోజర్లను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆందోళన కారులు వెనక్కి తగ్గకపోవడంతో కూల్చివేత ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. బుల్డోజర్లను అక్కడి నుంచి వెనక్కి పంపారు. చదవండి: ఇండిగో ఘటనపై కేంద్రమంత్రి ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్ #WATCH | Delhi: AAP MLA Amanatullah Khan join the protest at Shaheen Bagh amid the anti-encroachment drive here. pic.twitter.com/4MJVGoku39 — ANI (@ANI) May 9, 2022 ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలను ఇప్పటికే తొలగించామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగాశాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే బుల్డోజర్ల చర్య తీసుకున్నారని బీజేపీపై మండిపడ్డారు. కాగా కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని జహంగిర్‌పురిలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకొని నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. Delhi | Locals sit on roads and stop bulldozers that have been brought for the anti-encroachment drive in the Shaheen Bagh area. pic.twitter.com/EQJOWBzAxS — ANI (@ANI) May 9, 2022 -
ఏపీ రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో తుళ్లూరు మండలం లింగాయపాలెంలో ఉద్రికత్త ఏర్పడింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరిస్తూ నదీ పరివాహక ప్రాంతం నుంచి ప్రొక్లయిన్ల ద్వారా ఇసుకను తరలిస్తున్న ఇరిగేషన్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లి స్థానికులను ఇసుక క్వారీ లోపలకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. రాజధాని ప్రకటన నాటి నుంచి ఇసుక మాఫియా తమను క్వారీలోకి రాకుండా అడ్డుకుంటోందని స్థానికులు పోలీసులకు చెప్పారు. తమ జీవనోపాధిని కోల్పోయామని తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటూ ఇరిగేషన్ అధికారులను, పోలీసులను స్థానికులు ప్రశ్నించారు. పోలీసులు అక్కడి నుంచి స్థానికులను పంపివేసి లారీలో ఇసుకను తరలిస్తున్నారు. -
కృష్ణలంక కరకట్ట వద్ద ఉద్రిక్తత
విజయవాడ : విజయవాడ కృష్ణలంక కరకట్ట వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొది. కరకట్ట సుందరీకరణ పేరుతో ఇళ్ల తొలగింపుకు రంగం సిద్ధం అయింది. అయితే పేదల ఇళ్లకు భరోసా తనదేనని గతంలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇళ్ల తొలగింపుకు అధికారులు రావటంతో... గద్దె రామ్మోహన్ మొహం చాటేశారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఎమ్మెల్యే కరకట్ట వద్దకు రావాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు. అంతేకాకుండా అధికారులు చేపట్టిన సర్వే ప్ర్రక్రియను అడ్డుకోవటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.