ఏపీ రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో తుళ్లూరు మండలం లింగాయపాలెంలో ఉద్రికత్త ఏర్పడింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరిస్తూ నదీ పరివాహక ప్రాంతం నుంచి ప్రొక్లయిన్ల ద్వారా ఇసుకను తరలిస్తున్న ఇరిగేషన్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్లి స్థానికులను ఇసుక క్వారీ లోపలకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు.
రాజధాని ప్రకటన నాటి నుంచి ఇసుక మాఫియా తమను క్వారీలోకి రాకుండా అడ్డుకుంటోందని స్థానికులు పోలీసులకు చెప్పారు. తమ జీవనోపాధిని కోల్పోయామని తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటూ ఇరిగేషన్ అధికారులను, పోలీసులను స్థానికులు ప్రశ్నించారు. పోలీసులు అక్కడి నుంచి స్థానికులను పంపివేసి లారీలో ఇసుకను తరలిస్తున్నారు.