పన్ను ఆదా.. చేద్దాం ఇలా!
ఆదాయపన్ను చట్టంలో పన్ను ఆదాకు ఎన్నో మార్గాలున్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకుంటే ఎంతో ఆదా చేసుకోవచ్చు. అందుకు గతం నుంచి ఉన్న పాత విధానంలోనే కొనసాగాల్సి ఉంటుంది. ఎన్నో సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే పన్ను ఆదా ప్రయోజనాలను గరిష్ట పరిమితి మేరకు పొందగలరు. అందరికీ అన్ని సాధనాలు అనుకూలమని చెప్పలేం. వీటిల్లో పెట్టుబడులకు నిరీ్ణత కాలం పాటు లాకిన్ ఉంటుంది. కొన్నింటితోపాటు రిస్‌్కను కూడా ఆహా్వనించాల్సి వస్తుంది. తమ లక్ష్యాలు, రాబడి ఆకాంక్షలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోవాలి.
► రాబడులు 5–6 శాతం
► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు
జీవిత బీమా పాలసీలు పన్ను ఆదా కోసం తీసుకునేవి కావు. జీవితంలో అన్ని ఆరి్థక లక్ష్యాలకు రక్షణ కలి్పంచే సాధనం జీవిత బీమా. ఆరోగ్య బీమాని సైతం ఆరోగ్య విపత్తుల నుంచి రక్షించే సాధనంగానే చూడాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్ట వశాత్తూ మరణిస్తే, బీమా పరిహారం రూపంలో వచ్చే మొత్తం సదరు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉండాలి. కనుక బీమా పాలసీలను ఎప్పుడూ రక్షణ కోణంలోనే చూసి తీసుకోవాలి. పొదుపుతో సంబంధం లేని, టర్మ్ ప్లాన్లు మెరుగైనవి. టర్మ్ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకుని పన్ను ఆదా చేసుకోవచ్చు.
ఆరోగ్య బీమాకు చెల్లించే ప్రీమియం 60 ఏళ్లలోపు వారు అయితే సెక్షన్ 80డీ కింద గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపును పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి అయితే ఈ పరిమితి రూ.50,000గా ఉంది. 30 ఏళ్ల వ్యక్తి రూ.కోటి బీమాతో టర్మ్ ప్లాన్ తీసుకుంటే ఏటా రూ.12,000–14,000 ప్రీమియం కింద చెల్లించాలి. అదే వ్యక్తి రూ.50 లక్షల ఎండోమెంట్ ప్లాన్ తీసుకుంటే ఏటా రూ.5 లక్షలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమా పాలసీలలో మరణించిన సందర్భాల్లో వచ్చే పరిహారం, కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే వచ్చే మెచ్యూరిటీ బెనిఫిట్‌పై పూర్తిగా పన్ను మిహాయింపు ఉంటుంది. కాకపోతే పన్ను మినహాయింపు కోరుకునే వారు ఎండోమెంట్ ప్లాన్లకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.2.5 లక్షలకు మించకూడదు. యులిప్ ప్లాన్లలో అయితే వా ర్షిక ప్రీమియానికి కవరేజీ కనీసం 10 రెట్లు అయినా ఉండాలి.
► రాబడులు 7–8 % మధ్య
► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు
వీటిల్లో పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం ఉంది. కానీ, రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ తన ఆదాయంలో చూపించి, ఏ శ్లాబులో ఉంటే ఆ ప్రకారం రేటు చెల్లించాలి. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను పోను నికర రాబడి 5 శాతం కంటే తక్కువే. కాకపోతే వేగంగా, సులభంగా ఇన్వెస్ట్ చేసుకోగల సౌలభ్యం ఇందులో ఉంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీ, ఎన్ఎస్సీలో పెట్టుబడిని ఐదేళ్లకు ముందే ఉపసంహరించుకోవడం కుదరదు. ఇన్వెస్టర్ మరణించిన సందర్భాల్లోనే దీనికి మినహాయింపు ఉంటుంది. బ్యాంక్ ఎఫ్డీ కంటే ఎన్‌ఎస్‌సీలోనే కాస్తంత మెరుగ్గా వడ్డీ రేటు 7.7 శాతం ఉంది.
► ప్రస్తుత రాబడి 7.1%
► లాకిన్: 15 ఏళ్లు
ఇది రిస్‌్కలేని డెట్ సాధనం. ఇందులో రాబడిపై ఎలాంటి పన్ను లేకపోవడం అదనపు ఆకర్షణ. పీపీఎఫ్ పథకం కాల వ్యవధి 15 ఏళ్లు. ఈ పథకంలో ప్రస్తుత రేటు 7.1 శాతంగా ఉంది. సెక్షన్ 80సీ కింద ఈ సాధనంలో రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒకవేళ సెక్షన్ 80సీ కింద పూర్తి పరిమితి (రూ.1.5 లక్షలు) మేరకు ఇతర సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, రాబడిపైనా పన్ను మినహాయింపు ప్రయోజనం కోసం పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లల ఉన్నత విద్యకు దీన్ని పరిశీలించొచ్చు. ఇందులో పాక్షిక ఉపసంహరణలకే అనుమతి ఉంటుంది. ప్రారంభించి ఐదేళ్లు నిండిన తర్వాత ఇందుకు అనుమతిస్తారు. ప్రముఖ బ్యాంక్‌లు, పోస్టాఫీసుల్లో దీన్ని ప్రారంభించొచ్చు
► ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతం
► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు
60 ఏళ్లు నిండిన వృద్ధులకు రిస్‌్కలేని రాబడి సాధనం ఇది. కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పథకం. ప్రస్తుతం ఇందులో రాబడి 8.2 శాతంగా ఉంది. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే రాబడి ఎక్కువ. పెట్టుబడి కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత నుంచి ప్రతి మూడేళ్లకు ఒకసారి చొప్పున కాల వ్యవధి పెంచుకుంటూ వెళ్లొచ్చు. పొడిగించుకునే సమయంలో ఉన్న రేటు తదుపరి కాలానికి వర్తిస్తుంది. ఇందులో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. ఒక వ్యక్తి ఇందులో గరిష్టంగా రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. పెట్టుబడిపై వచ్చే రాబడి పన్ను పరిధిలోకే వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఆదాయపన్ను చట్టం కింద వృద్ధులకు ఉంది. అంటే రూ.6.25 లక్షల వరకు పెట్టుబడిపై వచ్చే రాబడి పన్ను మినహాయింపు అయిన రూ.50 వేలలోపే ఉంటుంది. 60 ఏళ్లు నిండిన వారు, ముందస్తు పదవీ విరమణ పొందిన వారు 58 ఏళ్ల తర్వాత ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రక్షణ సిబ్బందికి వయో పరిమితి లేదు.
► గడిచిన ఐదేళ్లలో కనిష్ట రాబడి: 8.16%
► పెట్టుబడులకు లాకిన్: 60 ఏళ్లు వరకు
పన్ను ఆదాకు మెరుగైన సాధనాల్లో ఇదీ ఒకటి. ఒకవైపు విశ్రాంత జీవనం కోసం నిధిని సమకూర్చుకూర్చుకుంటూ, మరోవైపు పన్ను ఆదా చేసుకునే ప్రయోజనంతో వస్తుంది. గరిష్టంగా ఒక వ్యక్తి ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.2 లక్షల పెట్టుబడిపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ(1) కింద రూ.1.5 లక్షలు, 80సీసీడీ(1బి)కింద రూ.50వేలపై పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల గరిష్ట పరిమితి పరిధిలోకే సెక్షన్ 80సీసీడీ (1) కూడా వస్తుంది. దీనికి అదనంగా మరో రూ.50వేలను ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీసీడీ (1బి) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సెక్షన్ 80సీసీడీ (2) కింద కంపెనీ యాజమాన్యం ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు జమ చేస్తే.. ఉద్యోగి వేతనంలో 10 శాతాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఎన్‌పీఎస్‌లో యాక్టివ్ ఆప్షన్ కింద ఈక్విటీలకు గరష్టంగా 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. అంతేకాదు ఏడాదిలో పెట్టుబడుల కేటాయింపులను (ఈక్విటీ, డెట్, ఏఐఎఫ్) నాలుగు పర్యాయాలు సవరించుకోవచ్చు. పెన్షన్ ఫండ్ మేనేజర్లనూ మార్చుకోవచ్చు. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ఆప్షన్ (ఎస్‌డబ్ల్యూపీ/క్రమానుగతంగా ఉపసంహరణ)ను కూడా పీఎఫ్ఆర్డీఏ ప్రవేశపెట్టింది. దీనివల్ల గడువు తీరిన తర్వాత ఒకే విడత కాకుండా, నెలవారీగా కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. గడిచిన ఏడాది కాలంలో ఎన్పీఎస్ ఫండ్స్ మంచి పనితీరు చూపించాయి. ఇక ముందూ ఇదే పనితీరు ఉంటుందని అంచనా. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ ఫండ్స్ అధిక శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయిస్తాయి. కనుక రిస్క్ దాదాపు చాలా తక్కువ.
► ఐదేళ్లలో వార్షిక రాబడి 7–14 శాతం
► లాకిన్ పీరియడ్: రిటైర్మెంట్ వరకు
బీమా కంపెనీలు ఆఫర్ చేసే పెన్షన్ ప్లాన్లు కూడా ఉన్నాయి. కాకపోతే చార్జీలు, సౌలభ్యం, పన్ను ప్రయోజనాల కోణంలో ఎన్పీఎస్ కంటే ఇవి మెరుగైనవి కావు. జీవిత బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లు సాధారణంగా యులిప్‌ల మాదిరి పనిచేస్తాయి. కానీ, ఎన్పీఎస్, యులిప్‌లలో ఉండే పన్ను ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే, పెన్షన్ ప్లాన్లు అంత ఆకర్షణీయం కాదని చెప్పుకోవచ్చు. పెన్షన్ ప్లాన్లకు సెక్షన్ 80సీసీడీ కింద పన్ను ప్రయోజనం కలి్పంచాలని బీమా పరిశ్రమ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా, అది సాకారం కావడం లేదు. ప్రస్తుతం ఎన్పీఎస్కు ఈ సెక్షన్ కింద అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం కల్పిస్తున్నారు. ఎన్‌పీఎస్‌లో ఫండ్ మేనేజర్ పనితీరు నచ్చకపోతే, మరో ఫండ్ మేనేజర్ కిందకు పెట్టుబడులను మార్చుకోవచ్చు. కానీ బీమా కంపెనీల పెన్షన్ ప్లాన్లలో చివరి వరకు అదే కంపెనీతో కొసాగాల్సి వస్తుంది. యాన్యుటీలపై పన్ను ఎత్తివేస్తే అప్పుడు ఈ ఉత్పత్తి ఆకర్షణీయంగా మారుతుందన్నది నిపుణుల అంచనా.
► రాబడులు: గత ఐదేళ్లలో 7–9 %
► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు
ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ పెట్టుబడులను పూర్తిగా ఈక్విట్లీలోనే పెట్టేస్తాయి. కానీ, రిటైర్మెంట్ ఫండ్స్ అలా కాదు. ఈక్విటీతోపాటు డెట్ సాధనాల్లోనూ కొంత పెట్టుబడులు పెడతాయి. దీంతో డెట్ పెట్టుబడులు పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వాన్ని ఇస్తాయి. ఈక్విటీ భాగం అధిక రాబడులకు వీలు కలి్పస్తుంది. సెక్షన్ 80సీ కింద వీటిల్లో పెట్టుబడులపై ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈ విభాగంలో యూటీఐ రిటైర్మెంట్ ఫండ్ మెరుగైన పనితీరు చూపించే వాటిల్లో ఒకటి. తక్కువ
రిస్‌్కతో, మెరుగైన రాబడులను ఇస్తోంది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులు 40 శాతంలోపే ఉన్నాయి. తక్కువ రిస్క్ కోరుకుంటూ, విశ్రాంత నిధిని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే ఈ పథకాల్లో పెట్టుబడులపై లాకిన్ ఐదేళ్లుగా ఉంటుంది. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్ అయితే 58 ఏళ్లు నిండడానికి ముందే పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ చార్జీలు విధిస్తోంది.
► ఇందులో రాబడి ప్రస్తుతం 8.2 శాతం
► లాకిన్ పీరియడ్: కుమార్తెకు 18 ఏళ్లు వచ్చే వరకు
ఇటీవలే ఈ పథకంలో వడ్డీ రేటును 8.2 శాతానికి పెంచారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ మాదిరే వడ్డీ రేటు, కేంద్ర సర్కారు గ్యారంటీతో కూడిన రిస్క్ లేని సాధనం ఇది. తల్లిదండ్రులు గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఇద్దరి పేరిట గరిష్టంగా ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ మొత్తంపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో రాబడిపై పూర్తి పన్ను మినహాయింపు ఉంది.
పథకాన్ని ప్రారంభించాలంటే కుమార్తెల వయసు 10 లోపు ఉండాలన్నది నిబంధన. పోస్టాఫీసులు, బ్యాంక్‌ల్లో ఈ స్కీమ్ కింద ఖాతాను ప్రారంభించొచ్చు. ఆర్బీఐ వచ్చే ఆరి్థక సంవత్సరం ద్వితీయ భాగంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత చేపడుతుందని అంచనా. ప్రతి త్రైమాసికం ఆరంభంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను కేంద్ర సర్కారు సవరిస్తుంటుంది. కనుక సుకన్య సమృద్ధి యోజనలో ప్రస్తుత రేటు 8.2 శాతం ఎక్కువ కాలం కొనసాగుతుందని ఆశించరాదు. కాకపోతే ఇందులో రాబడిపై ఎలాంటి పన్ను లేనందున, కుమార్తెల భవిష్యత్ అవసరాలకు సంబంధించిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని రిస్‌్కలేని ఈ పథకానికి కేటాయించుకోవచ్చు.
► గడిచిన ఐదేళ్ల కాలంలో కనిష్ట వార్షిక రాబడి 8.15 శాతం
► లాకిన్ పీరియడ్: ఐదేళ్లు
యూనిట్డ్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో (యులిప్‌లు) పెట్టుబడులపైనా పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఈఎల్ఎస్ఎస్ మాదిరిగా పెట్టుబడులకు అంత సౌకర్యవంగా ఉండవు. పోర్ట్‌ఫోలియో వివరాలు తెలుసుకోవడం కూడా సౌకర్యంగా కష్టమే. కాకపోతే యులిప్‌ల నుంచి దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఆశించొచ్చు. పైగా పన్ను ఆదాకు అవకాశం ఉంటుంది. బీమా రక్షణ కూడా కొంత లభిస్తుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో పెట్టుబడిపై పన్ను మిననహాయింపు ఉంటుందే కానీ, లాభాల ఉపసంహరణ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో లాభం రూ.లక్షకు మించితే 10 శాతం పన్ను చెల్లించాలి.
కానీ, యులిప్‌లలో రాబడి ఎంత వచి్చనా కానీ, గడువు తీరిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపై పన్ను ఉండదు. ఈ ప్రయోజనం కోసం చెల్లించే ప్రీమియానికి బీమా రక్షణ కనీసం 10 రెట్లు అధికంగా ఉండాలని సెక్షన్ 10(10డి) చెబుతోంది. యులిప్ పాలసీలోనూ ఈక్విటీ, డెట్ విభాగాల మధ్య ఇన్వెస్టర్ తన స్వేచ్ఛ ప్రకారం పెట్టుబడుల ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. అలా మార్చుకున్నప్పటికీ పన్ను బాధ్యత ఉండదు. యులిప్ ప్లాన్లలో ఐదేళ్ల తర్వాత నుంచి పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. యులిప్ ప్లాన్లలో బీమా రక్షణ పరిమితంగానే ఉండడం ప్రతికూలం. వార్షిక ప్రీమియానికి 10–12 రెట్ల వరకే రక్షణ ఎంపిక చేసుకోగలరు. అంటే ఏడాదికి రూ.1–1.20 లక్షలు చెల్లించినా, లభించే రక్షణ రూ.10–12 లక్షలకు మించదు. కనుక తగినంత జీవిత బీమా కోసం టర్మ్ ప్లాన్ కూడా తీసుకోవాల్సి రావచ్చు. యులిప్‌ను రిటైర్మెంట్ను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలం పాటు కొనసాగాల్సి
ఉంటుంది.
► గడిచిన ఐదేళ్ల కాలంలో ఏటా సగటు రాబడి 17 శాతం
► లాకిన్ పీరియడ్: మూడేళ్లు
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్ కూడా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందిస్తున్నాయి. ఇవి ప్రధానంగా లార్జ్‌క్యాప్‌లో ఎక్కువ పెట్టుబడులు పెడతాయి. కనుక సమీప కాలంలో వీటిల్లో రాబడులు మెరుగ్గానే ఉంటాయని అంచనా. రాబడులు, భద్రత, లాకిన్ పీరియడ్ తదితర అంశాల పరంగా చూస్తే ఎన్పీఎస్ తర్వాత, ఎన్‌పీఎస్‌తో సమానంగా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ కూడా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈఎల్ఎస్ఎస్లో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. పైగా పారదర్శకత ఎక్కువ.
పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పెట్టుబడికి లాకిన్ కేవలం మూడేళ్లుగానే ఉంటుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రిస్‌్కను సమర్థవంతంగా అధిగమించొచ్చు. సెక్షన్ 80సీ కింద ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసి పన్ను మినహాయింపు పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో సగటు రాబడులు ఏడాది కాలంలో 19 శాతం, మూడేళ్లలో 18.50 శాతం, ఐదేళ్లలో 17 శాతం, ఏడేళ్లలో 15.46 శాతం, పదేళ్లలో ఏటా 16.60 శాతం చొప్పున ఉన్నాయి.