నేడు జాతీయ లోక్ అదాలత్
వరంగల్ లీగల్ : జాతీయ న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రిన్స్‌పల్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతినెల రెండో శనివారం నిర్వహించే లోక్ అదాలత్ ఈసారి రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.