london city
-
చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కావడం లేదు:: రాహుల్
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌కి చైనా బెదిరింపు అస్సలు అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మళ్లీ చైనాను ఆక్రమించుకోమని ఆహ్వానిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు లండన్‌లో ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో జరిగిన సంభాషణలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ ఎలాంటి వైఖరి తీసుకోలేదు కాబట్టి పాక్ లేక చైనాలు భారత్‌ని ఆక్రమించేందుకు యుద్ధానికి దిగితే ప్రపంచం విస్మరించే అవకాశం ఉంది కదా అని విలేకరులు ప్రశ్నించగా.. దీనికి రాహుల్ స్పందిస్తూ.. మేము ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాం అన్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) చేతిలో దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్లకు వరకు మా భూభాగం ఉందని చెప్పారు. కానీ ప్రధాని మోదీ మాత్రం స్వయంగా ఎవరూ ప్రవేశించలేదని ప్రకటించడం విశేషం. పైగా ఈ విషయం గురించి చర్చిస్తుంటే ఏమిటి రచ్చ అని ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రస్తుతం చైనా విషయంలో భారత్ కాస్త జాగ్రత్తాగా ఉండాల్సిందే కదా అని మరో ప్రశ్న సంధించగా.. చైనా నుంచి ముప్పు ఉందనే తాను పదేపదే ప్రభుత్వానికి చెబుతున్నానన్నారు రాహుల్. భారత భూభాగంలోకి ఎవర్నీ ప్రవేశించకుండా చేయడం కాంగ్రెస్ విధానమని నొక్కి చెప్పారు. చైనా విషయలో కాంగ్రెస్ పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. భూభాగంలోకి ప్రవేశించి, చుట్టుముట్టడం, బెదిరించడం వంటి వాటికి కాంగ్రెస్ అస్సలు అంగీకరించదన్నారు. మిలటరీ బెదిరింపులు గురించి విలేకరులు అడిగనప్పుడూ..రాహుల్ మాట్లాడుతూ.. బెదిరింపులు గురించి అర్థం చేసుకోవాలి, రానున్న ముప్పు గురించి స్పందిచాలి. విదేశాంగ మంత్రి జైశంకర్‌కి చైనా నుంచి ఉన్న అసలు ముప్పు ఏమిటో అర్థం కావడం లేదు. బహుశా ప్రధాని ఎవరూ ప్రవేశించలేదని ప్రకటించడం వల్ల ఆయనకు వాస్తవం ఏమిటో అర్థం కావటం లేదని రాహుల్ జర్నలిస్ట్‌ల సంభాషణలో చెప్పారు. కాగా, ఎస్ జైశంకర్ ఏఎన్ఏ మీడియా సమావేశంలో రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..సైన్యాన్ని వాస్తవ నియంత్రణ రేఖకు పంపింది కాంగ్రెస్ నాయకుడు కాదని, ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. 1962లో ఏమి జరిగిందో ఒక్కసారి గుర్తుతెచ్చుకోవాలంటూ ధీటుగా కౌంటరిచ్చారు. అసలు ఆ భూభాగం చైనాలో కంట్రోల్లోకి 1962లో వెళ్లిపోతే 2023లోని మోదీ ప్రుభుత్వంపై నిందాలా? అని మండిపడ్డారు జైశంకర్ (చదవండి: మా రక్షణ కోసం చేస్తున్న యుద్ధం': రష్యా విదేశాంగ మంత్రి) -
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లండన్
లండన్: ప్రపంచంలోని ప్రముఖ నగరాలను వెనక్కినెట్టి వరుసగా రెండోసారి విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన నగరంగా బ్రిటన్ రాజధాని లండన్ సిటీ మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ నగరాలైన టోక్యో, మెల్‌బోర్న్‌లు వరుసగా రెండు, మూడు ర్యాంకులను సాధించాయి. విద్యార్థులకు ఉత్తమమైన నగరాల జాబితాను బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్స్(క్యూఎస్) బుధవారం విడుదల చేసింది. ప్రతీ నగరానికి సంబంధించి ప్రధానంగా ఆరు అంశాలను నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, జనాభా, జీవన ప్రమాణాలు, డిగ్రీ అనంతరం ఉద్యోగ అవకాశాలు, కొనుగోలు సామర్థ్యాలు, విద్యార్థుల అభిప్రాయాలు వంటి అంశాలు ఆయా నగరాల్లో ఏ మేరకు ఉన్నాయో విశ్లేషించి జాబితా రూపొందించింది. మొత్తం ప్రపంచంలోని 120 నగరాలకు సంబంధించి ఈ ర్యాంకులను విడుదల చేయగా.. భారత్ నుంచి బెంగళూరు 81వ ర్యాంకు, తర్వాత ముంబై–85, ఢిల్లీ–113, చెన్నై–115వ స్థానాల్లో నిలిచాయి. పెరుగుతున్న భారతీయ విద్యార్థులు.. భారతదేశం నుంచి లండన్‌కు విద్యనభ్యసించేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2017–18లో ఈ సంఖ్య 20 శాతం పెరిగింది. 2017–18లో మొత్తం 5,455 మంది విద్యార్థులు లండన్‌లో విద్యాసంస్థల్లో చేరగా.. 2016–17లో ఆ సంఖ్య 4,545గా ఉంది. అయితే విద్యార్థుల సంఖ్య ప్రస్తుతానికి తక్కువగానే కనిపిస్తుంది. దానికి కారణం వీసా జారీ ప్రక్రియ నిబంధనలు కొంతమేర కు కఠినతరంగా ఉండటంతో భారతీయ విద్యార్థులు లండన్ వైపు మొగ్గు చూపట్లేదని నివేదిక పేర్కొంది. అందుకే అగ్రస్థానం లండన్‌లోని విద్యార్థుల హర్షం విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన నగరంగా లండన్ ఎంపిక కావడం పట్ల అక్కడి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఉత్తమ నగరంగా లండన్ ఎంపిక సరైనదేనంటున్నారు. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, అద్భుతమైన ఉపాధి అవకాశాలు, వైవిధ్యభరితమైన విద్యార్థి సంఘాలు వంటివి లండన్‌ను అగ్ర స్థానంలో నిలబెట్టాయని వివరిస్తున్నారు. యూరప్ ఆధిపత్యం టాప్–120 సిటీల్లో యూరప్ నగరాలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. జర్మనీలోని మ్యూనిచ్ 4, బెర్లిన్ 5వ స్థానాల్లో నిలిచాయి. పారిస్ 7వ స్థానం, జ్యూరిచ్(స్విట్జర్లాండ్) 8వ స్థానం దక్కించుకున్నాయి. మాంట్రియల్ (కెనడా) 6వ స్థానం, సిడ్నీ(ఆస్ట్రేలియా) 9వ స్థానం, సియోల్(దక్షిణ కొరియా) 10వ స్థానంలో ఉన్నాయి. ఇక టాప్–30లో మరో రెండు బ్రిటిష్ నగరాలైన ఎడిన్బర్గ్ 15వ ర్యాంకు, మాంచెస్టర్ 29వ ర్యాంకు పొందాయి. -
2,400 అడుగుల ఎత్తు నుంచి లండన్
లండన్ నగరాన్ని 2,400 అడుగుల ఎత్తులో నుంచి చూస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా కనిపిస్తుంది. అంత ఎత్తు నుంచి ఈ వర్ణరంజిత దృశ్యాన్ని తన కెమెరాలో బంధించింది ఈయనే. పేరు జాసన్ హాక్స్. వృత్తిరీత్యా ఏరియల్ ఫొటోగ్రాఫర్. 1991 నుంచి ఈయన ఇదే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు కొన్ని లక్షల ఏరియల్ ఫొటోలు తీశారు. లండన్‌కు చెందిన జాసన్.. ప్రపంచవ్యాప్తంలో అనేక కంపెనీలకు తన సేవలందించారు. హెలికాప్టర్ ద్వారా నిర్దేశించిన ఎత్తుకు వెళ్లి అక్కడ నుంచి అందమైన భూప్రపంచాన్ని తన కెమెరాలో అద్భుతంగా బంధిస్తారు. ఏరియల్ ఫొటోగ్రఫీకి సంబంధించి 50కి పైగా పుస్తకాలు కూడా రూపొందించారు.