Lord Ayyappa Devotees
-
అయ్యప్పభక్తులకు గుడ్‌న్యూస్ : వాట్సాప్‌లో శబరిమల సమాచారం
ఇకపై శబరిమల వెళ్లే యాత్రికులు ఆలయ సమాచారం తెలుసుకోవడం కోసం ప్రయాస పడనక్కరలేదు. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్‌లో 6238998000 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు... క్షణాల్లో శబరిమల ఆలయ సమాచారం అందుతుంది.‘స్వామి చాట్‌బాట్’ పేరిట అందించే ఈ సేవలను ముత్తూట్ గ్రూప్ సహకారంతో ఇంగ్లిష్, హిందీ, మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అందించనున్నట్టు పథానంతిట్ట జిల్లా అధికార యంత్రాంగం తెలియజేసింది. ఆలయ వేళలు, ప్రసాద లభ్యత, పూజ వేళలు, శబరిమల చుట్టుపక్కల ఉండే ఇతర ఆలయాల వివరాలు, దగ్గరలో ఉండే రైళ్లు, బస్సులు, ఎయిర్పోర్ట్ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈ చాట్‌బోట్ ద్వారా తెలుసుకోవచ్చునని దేవస్థానం అధికారులు తెలియజేశారు -
శబరిమలపై మహిళ పోస్టు.. తీవ్ర ఉద్రిక్తత
కన్నూర్ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలకు అనుమతిస్తూ సుప్రీం తీర్పునిచ్చిన నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. కోర్టు తీర్పుని కొందరు సమర్ధిస్తుండగా పలు హిందూ ధార్మిక సంస్థలు మాత్రం అయ్యప్ప ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా కోర్టు తీర్పు ఉందని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాగా, శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తే అడ్డంగా నరికేస్తానని కేరళకు చెందిన సినీ నటుడు, బీజేపీ సానుభూతిపరుడు కొల్లం తులసి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. (‘అయ్యప్ప గుళ్లోకి ప్రవేశిస్తే నరికేస్తా’) మరోవైపు.. శబరిమల ఆలయంలోకి ప్రవేశిస్తాననీ, 18 మెట్లెక్కి అయ్యప్ప దర్శనం చేసుకుంటానని కేరళకు చెందిన రేష్మా నిశాంత్ (32) ప్రకటించారు. సుప్రీం కోర్టు 10 నుంచి 50 ఏళ్ల వయసు వారికి శబరిమల ఆలయంలోకి అనుమతి ఇచ్చినందున అయ్యప్ప దర్శనం చేసుకుంటానని ఆదివారం తన ఫేస్బుక్ అకౌంట్లో పేర్కొన్నారు. దీంతో పలు హిందూ సంస్థల కార్యకర్తలు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఎట్టిపరిస్థితుల్లోను అమెను అయ్యప్ప ఆలయానికి వెళ్లనివ్వమని హెచ్చరికలు జారీ చేశారు. వీటన్నిటిపై స్పందించిన రేష్మా... మహిళగా పుట్టడం తన తప్పుకాదనీ, కోర్టు అందరికీ సమాన హక్కులుండాలనే మహిళలు శబరిమలకు వెళ్లొచ్చొనే తీర్పునిచ్చిందని తెలిపారు. పవిత్రమైన అయ్యప్ప మండల దీక్ష (41 రోజులు) ధరించినా కూడా అయ్యప్ప దర్శనం చేసుకోకుండా మహిళలను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. తను గతంలో మండల దీక్ష వేసుకున్నప్పుడు రుతుస్రావం అయిన రోజులను మినహాయించి 55 రోజులు దీక్షలో ఉన్నానని గుర్తు చేశారు. ఏదేమైనా శబరిమలలోని అయ్యప్ప దర్శనం చేసుకుంటానని స్సష్టం చేశారు. రేష్మా డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. (చదవండి : ‘శబరిమల’ తీర్పుపై రివ్యూ పిటిషన్లు) -
శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
కొచ్చి: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నాంబళంమేడు కొండల్లో శనివారం సాయంత్రం మకర జ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో ఇప్పటికే జ్యోతి దర్శనం కోసం శబరిమలకు చేరుకున్న భక్తులు జ్యోతిని చూసి ఆనంద పరవశులయ్యారు. స్వామియే శరణం అయ్యప్పా అన్న నినాదాలు మిన్నంటాయి. అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో శబరిమలకు చేరుకున్నారు. అయ్యప్పల నామస్మరణతో శబరిమల మార్మోగిపోయింది. మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు తరలివెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు మాలను ధరించి మకరజ్యోతి దర్శనం కోసం వెళ్తారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో తరలివెళ్లారు. గతంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మకరజ్యోతి దర్శనాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అయ్యప్ప స్వామి మాలను ధరించిన భక్తులు నియమ నిష్టలతో దీక్షను ఆచరించి దర్శనానికి వెళ్తారు.