lorry and bike collisioned
-
‘మదర్స్ డే’ నాడు అమ్మకు కేక్ కొనాలని వెళ్తూ..
నరసరావుపేట రూరల్: మదర్స్ డే సందర్భంగా అమ్మను సంతోషపెట్టాలని కేక్ కొనేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు చేరారు. ఈ విషాద ఘటన మాతృ దినోత్సవం నాడు ఇద్దరు తల్లులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. వివరాలు.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురం గ్రామానికి చెందిన మలతోటి వెంకిబాబు (19), వేమర్తి ఏసుబాబు (17)లు ఆదివారం మదర్స్ డే సందర్భంగా కేక్ కొనేందుకు బైక్‌పై నరసరావుపేటకు వస్తుండగా కేసానుపల్లి గ్రామ సమీపంలోని పెద్ద ఈద్గా వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో వెంకిబాబు ఐటీఐ చదువుతుండగా, ఏసుబాబు పదో తరగతిలో చేరాల్సి ఉంది. వెంకిబాబుకు తల్లిదండ్రులు వెంకటరావు, వజ్రమ్మ, ఒక సోదరి ఉన్నారు. ఏసుబాబు తల్లిదండ్రులు సుధాకరరావు, పుష్పలీలలకు అతనొక్కడే సంతానం. మాతృదినోత్సవం నాడే కొడుకును కోల్పోవాల్సి రావడంతో కన్నవారు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. సీఐ అచ్చయ్య ఆధ్వర్యంలో ఎస్ఐ టి.సూర్యనారాయణరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బోరు వాహనం ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): నగరంలోని వినాయక్‌నగర్ రాజీవ్‌గాంధీ చౌరస్తాలో బోరు వాహనం ఢీ కొని ఒకరు తీవ్రగాయాల పా లయ్యాడు. వినాయక కల్యాణ మండపం వద్ద నివాసం ఉండే సుంకోజ్ సత్యనారాయణ(58) ఆర్యనగర్‌లో ఇటీవల ఇల్లు కొనుగోలు చేశాడు. శుక్రవారం ఇల్లుకు మరమ్మతు పనుల నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటి వైపు తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా రాజీవ్‌గాంధీ చౌర స్తా వద్ద 100 ఫీట్ల రోడ్డు వైపు వెళ్తున్న బోరు లారీ సత్యనారాయణను ఢీకొట్టింది. దీంతో అతను కిందపడి పోగా వెనుక చక్రాలు అతని ఎడమ కా లుపై నుంచి వెళ్తూ ద్విచక్ర వాహనంతో పాటు ఫర్లాంగ్ దూరం ఈడ్చుకు వెళ్లింది. స్థానికులు గమనించి కేకలు వేయడంతో లారీని డ్రైవర్ నిలిపివేశాడు. స్థానికులు సత్యనారాయణను లారీ కింద నుంచి బయటకు తీయ గా అతని కాలు నుజ్జునుజ్జయ్యింది. డ్రైవర్ లారీని వదిలేసి పారిపోయా డు. ఎస్సై శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణ భార్య కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో విషాదం
హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు పోలీసుల తనిఖీలు తప్పించుకునే క్రమంలో మృతిచెందారు. ఈ ప్రమాదం నగరంలోని లంగర్‌హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వద్ద ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా బుద్వేలుకు చెందిన శ్రీనివాస్, రాజేశ్ మద్యం సేవించి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో లంగర్‌హౌస్ బాపూఘాట్ వద్దకు వచ్చారు. అక్కడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారని గమనించిన యువకులు వీరి నుంచి తప్పించుకునే క్రమంలో రాంగ్ రూట్లో వేగంగా బైక్‌పై దూసుకెళ్లారు వీరు వెళ్లేది రాంగ్ రూట్ కావడం, అందులోనూ బైక్‌పై వేగంతో వెళ్తుండటంతో ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. రాజేశ్ అక్కడికక్కడే చనిపోగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శ్రీనివాస్ మృతిచెందినట్లు సమాచారం. బైక్‌ను ఢీకొట్టిన క్రమంలో లారీ డ్రైవర్.. మరో కారు, ట్రాఫిక్ పోలీసుల క్రేన్‌ను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. అనంతరం లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. శ్రీనివాస్, రాజేశ్ వెళ్తున్న బైక్ ఈ ప్రమాదంలో కాలిబూడిదైంది. లారీ డ్రైవర్ కూడా మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని గుర్తించారు. లారీని సీజ్ చేసిన పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో విషాదం
-
బైక్‌ని ఢీకొట్టిన లారీ : ఒకరి మృతి
-
లారీని ఢీకొట్టిన బైక్: ఇద్దరి మృతి
ఏలూరు: ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు వద్ద చోటుచేసుకుంది. అతివేగంతో బైక్ నడపటంతో పాటు తెల్లవారుజాము సమయం కావడంతో ముందు ఉన్న వాహనం కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.