lorry and car
-
సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పుల్కల మండంలోని చౌటకూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. కాగా, మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక బాలుడు ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానికుల సహయంతో ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతి చెందిన వారి వివరాలు.. 1) హోసన్న గోని దీవెన భర్త లూకా (41), గ్రామము రంగంపేట కొల్చారం మండలం. 2) లూకా తండ్రి నారాయణ (44), గ్రామము రంగంపేట కొల్చారం మండలం.3) బుర్ర అంబదాస్ తండ్రి శాకయ్య (33), గ్రామం సంగాయి పేట్ కొల్చారం మండలం. 4) బుర్ర వివేక్, (6) తండ్రి అంబదాస్ సంగాయి పేట్ కొల్చారం మండలం. 5) డ్రైవర్ యొక్క పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
సాక్షి, తిరుపతి: రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఢీ కోనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. అందులో ఏడాదిన్నర చిన్నారి కూడా మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు... ఈ ప్రమాదం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కడప నుంచి చెన్నైకు పౌడర్ లోడ్‌తో వెళ్తున్న లారీ, రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న కారు ఢీకోనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కువైట్ నుండి ఇండియాకు తిరిగివస్తున్న గంగాధరం(35) ను చెన్నై ఎయిర్ పోర్టు నుంచి కుటుంబసభ్యులు రిసీవ్ చేసుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కడప జిల్లా సకేదిన్నేకు చెందిన వారీగా గుర్తించారు. ఈ దుర్ఘటనలో గంగాధరం(35), భార్య విజయమ్మ(30), తమ్ముడు ప్రసన్న(32), మరియమ్మ(25), ఏడాదిన్నర చిన్నారి మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
లారీని ఢీకొన్న కారు
నాయుడుపేటటౌన్: ఆగిఉన్న లారీని కారు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన మండలంలోని పండ్లూరు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా రెట్టచింతల మండలం పాల్వాయి గ్రామానికి చెందిన ఆత్మకూరు పూర్ణచంద్రరావు (55) అతని భార్య నాగలక్ష్మి, సమీప బంధువైన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన పోలిశెట్టి పూర్ణశంకర్, అతని తల్లి రామకోటమ్మ, నర్సారావుపేటకు చెందిన కుక్కర్ల నర్సింహులు, అతని భార్య విజయలు కారు తీసుకుని రెట్టచింతల గ్రామానికి చెందిన పోలిశెట్టి నాగరాజు అనే వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకుని సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పాల్వాయి గ్రామం నుంచి తిరుమలకు బయలుదేరారు. నెల్లూరుకు వచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తుగా ఉందని చెప్పాడు. దీంతో వారు మంగళవారం సాయంత్రం స్వామివారి కల్యాణం ఉందని, దైవదర్శనం చేసుకునేందుకు సమయం ఉందని తొందర పడవద్దని చెప్పి నెల్లూరులో గంటపాటు డ్రైవర్‌ను నిద్రపోమని చెప్పి విశ్రాంతి తీసుకున్నారు. మంగళవారం ఉదయం తిరుమలకు వెళుతుండగా మార్గమధ్యలో మండలంలోని పండ్లూరు వద్ద రోడ్డుపక్కనే నిలబెట్టి ఉన్న లారీని కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో డ్రైవర్ పక్కనే కూర్చుని ఉన్న ఆత్మకూరు పూర్ణచంద్రరావు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మిగిలిన ఐదుగురురికి గాయాలయ్యాయి. డ్రైవర్‌కు గాయలు కాలేదు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పూర్ణచంద్రరావు మృతదేహానికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్‌మార్టం జరిపి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లడిల్లిన కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదంలో పూర్ణచంద్రరావు మృతిచెందిన విషయం మధ్యాహ్నం వరకు అతని భార్య నాగలక్ష్మీకి తెలియనివ్వలేదు. సమాచారం తెలుసుకుని మృతుడి బంధువులు నాయుడుపేట వైద్యశాల వద్దకు చేరుకోవడంతో ఆమెకు విషయం తెలిసింది. దీంతో ఆమెను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. గాయపడిన వారు కూడా ప్రత్యేక వాహనంలో తరలివెళ్లారు. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
బీదర్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఐదుగురు మృత్యువాత పడ్డారు. బీదర్ సమీపంలోని 9వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ-కారు ఢీకొన్నాయి. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.