ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి | Five Family Members Died In Road Accident chittoor | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

Published Sun, Dec 2 2018 7:17 AM | Last Updated on Sun, Dec 2 2018 6:02 PM

Five Family Members Died In Road Accident Chittiru - Sakshi

కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు

సాక్షి, తిరుపతి: రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఢీ కోనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. అందులో ఏడాదిన్నర చిన్నారి  కూడా మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు... ఈ ప్రమాదం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కడప నుంచి చెన్నైకు పౌడర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ, రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి వస్తున్న కారు ఢీకోనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కువైట్‌ నుండి ఇండియాకు తిరిగివస్తున్న గంగాధరం(35) ను చెన్నై ఎయిర్ పోర్టు నుంచి కుటుంబసభ్యులు రిసీవ్‌ చేసుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కడప జిల్లా సకేదిన్నేకు చెందిన వారీగా గుర్తించారు. ఈ దుర్ఘటనలో గంగాధరం(35), భార్య విజయమ్మ(30), తమ్ముడు ప్రసన్న(32), మరియమ్మ(25), ఏడాదిన్నర చిన్నారి మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని  పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement