లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో
అనంతపురం (హిందూపురం) : పోలీసులకు, లారీ అసోసియేషన్ సభ్యులకు మధ్య ఏర్పడిన వివాదం రాస్తారోకోకు దారి తీసింది. అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఎలాంటి సభ్యత్వం లేకుండా సరకు రవాణా చేస్తుండటాన్ని అసోసియేషన్ అడ్డుకుంది.
దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అసోసియేషన్ సభ్యులను మందలించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పీఎ ఆదేశాలతో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ అసోసియేషన్ సభ్యులు రాస్తారోకోకు దిగారు.