lorry - bike collisioned
-
సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతిచెందారు. కాగా, మృతులను పుల్కల్ మండలానికి చెందిన సందీప్, నవీన్, అభిషేక్‌గా గుర్తించారు.వివరాల ప్రకారం.. కంది మండలం తునికిళ్ల తండా శివారులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. నాందేడ్-అకోల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కాగా, నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను పుల్కల్ మండలానికి చెందిన సందీప్, నవీన్, అభిషేక్‌గా గుర్తించారు. ఇక, వీరు ముగ్గురు కందిలోని అక్షయ పాత్రలో పని చేస్తున్నట్టు సమాచారం. -
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు పైన వెళ్తోన్న ముగ్గురిని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైకుపై వెళ్తోన్న ముగ్గురిని అటుగా వస్తోన్న లారీ అదుపుతప్పి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు స్థానికులు. ప్రమాదంలో చనిపోయిన వారు అంబాపురంకు చెండియాన్ వినోద్, నాని, వీరేంద్రగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మృతుల బంధువులు అక్కడికి చేరుకుని మృతదేహాలతో నిరసన తెలుపుతున్నారు. రోడ్డుపైన మృతుల బంధువులు భారీ సంఖ్యలో రహదారిపైనే బైఠాయించడంతో రహదారిపై వాహానాలు నిలిచిపోయాయి. -
ఊహించని ప్రమాదం.. తండ్రితో కలిసి కాలేజీకి వెళ్తుండగా...
సాక్షి, ఖమ్మం: లారీ డ్రైవర్ మద్యం మత్తు ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిర్లక్ష్యంగా లారీ నడపడంతో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి సమీపంలో వరంగల్– అశ్వారావుపేట ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన ఎనగందుల దేవయ్య అదే మండలంలోని పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్నాడు. ఖమ్మంరూరల్ మండల పరిధిలోని సాయికృష్ణ నగర్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి కుమారుడు ఠాగూర్(18), కుమార్తె పవిత్ర ఉన్నారు. వారిద్దరూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ, మొదటి సంవత్సరాలు చదువుతున్నారు. చదవండి: వారి వయసంతా 25 లోపే.. అన్నీ హైస్పీడ్ స్పోర్ట్స్ బైక్‌లే పిల్లలను కాలేజీలో దిగబెట్టడానికి వెళ్లి.. కళాశాలలో దిగబెట్టేందుకని పిల్లలిద్దరినీ తీసుకొని దేవయ్య శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గం మధ్యలోని కరుణగిరి సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. లారీ టైర్ ఠాగూర్ నడుముపై నుంచి వెళ్లడంతో కిడ్నీలు బయటకు వచ్చి అక్కడికక్కడే మృతిచెందాడు. దేవయ్య, పవిత్రలపై నుంచి కూడా లారీ వెళ్లడంతో ఇద్దరికీ తీవ్ర గామాలమ్మాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు 108కి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించారు. పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి లారీ సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య పిండిప్రోలులో ఠాగూర్ అంత్యక్రియలు.. కాగా మృతుడు ఠాగూర్ అంత్యక్రియలు స్వగ్రామం పిండిప్రోలులో జరిగాయి. ఓ పక్క తండ్రీ కుమార్తె తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ఉండగా ఠాగూర్ అంత్యక్రియలను తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు బాధాతృప్త హృదయాలతో నిర్వహించారు. ఉన్నత చదువులు చదివి తమను సంతోషంగా చూసుకుంటావని అనుకుంటే కానరాని లోకాలకు వెళ్లిపోయావా కొడకా అంటూ ఠాగూర్ తల్లి రోదిస్తుంటే అక్కడున్న వారు కన్నీరుమున్నీరయ్యారు. -
భగ్గుమన్న ‘బిచ్కుంద’
నిజాంసాగర్ (జుక్కల్): ద్విచక్రవాహన దారుడిని ఇసుక లారీ ఢీకొనడంతో సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం భగ్గుమంది. ప్రమాదానికి కారణమైన ఇసుక లారీకి స్థానికులు నిప్పుపెట్టడంతో పాటు మరో 12 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. వివరా లుఇలా ఉన్నాయి. గోపన్‌పల్లి గ్రామా నికి చెందిన విజయ్ బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాం తంలో బార్బర్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాపును మూసివేసిన విజయ్, ద్విచక్రవాహనంపై గోపన్‌పల్లికి బయలు దేరాడు. బిచ్కుందలోని ఎస్బీఐ బ్యాంక్ ప్రాంతంనుంచి వెళుతున్న విజయ్ను అదే సమయంలో వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్ బైక్‌పై నుంచి కిందపడిపోగా లారీ అతని నడుముపై నుంచి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన విజయ్ను చుట్టుపక్కలవారు వెంటనే 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు ప్రమాదానికి కారణమైన ఇసుక లారీకి నిప్పుపెట్టారు. అంతేకాకుం డా రోడ్డుపై నిలిపి ఉంచిన మరో 12 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడి చేరుకోగా ఆందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు. బిచ్కుంద సీఐ సాజిద్ ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు శాంతించకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. సుమా రు రెండు గంటల పాటు బిచ్కుంద పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితులను చక్కదిద్దారు. -
బైక్, లారీ ఢీ..ఒకరి మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: టేకులపల్లి మండలం బోజ్జాయిగూడెం ఆరో మైలు తండా వద్ద ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని బూడిద లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకిస్ట్ అక్కడికక్కడే మృతిచెందగా..వెనక కూర్చున్న యువతికి తీవ్రగాయాలు అయ్యాయి. యువతి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు గమనించి ఇల్లెందు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు రోంపేడు గ్రామానికి చెందిన భూక్యా సురేష్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని ఇంటర్ విద్యార్థి మృతి
రైల్వేకోడూరు: వైఎస్సార్‌జిల్లా రైల్వే కోడూరు మండల కేంద్రంలో లారీ ఢీకొనడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానిక ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్న ఎర్రపోగు ప్రవీణ్ మంగళవారం ఉదయం బైక్‌పై వెళుతుండగా.. ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. -
లారీ ఢీకొని మహిళ మృతి
ఖమ్మం: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు దాటుతున్న వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకనగర్ కాలనిలో మంగళవారం ఉదయం జరిగింది. వివరాలు... పశ్చిమ గోదావరి జిల్లా చింతలపుడి మండలానికి చెందిన మల్లెలరంగయ్య(42) పెంటమ్మతో(35) కలిసి వినాయకనగర్ కాలనిలో గత ఎనిమిదేళ్లుగా సహ జీవనం చేస్తున్నాడు. ఈరోజు ఉదయం వినాయకనగర్ కాలని నుంచి వినాయకపురం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. అశ్వరావుపేట నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న లారీ కాలనీ కమ్యూనిటి హాల్ వద్ద అదుపుతప్పి వారి పైకి దూసుకువచ్చింది. దీంతో పెంటమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. రంగయ్యకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ఆస్పత్రికి త రలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ముదినేపల్లి (కృష్ణా): రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న లారీ బైక్ పై నుంచి వెళ్లడంతో వాహనం పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరు క్రాస్‌రోడ్డు సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. గుడివాడ నుంచి ముదినేపల్లి వైపు వెళ్తున్న ద్విచ క్రవాహనం కోడూరు క్రాస్‌రోడ్డు వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి కాలు విరగడంతో పాటు.. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అదుపుతప్పి రోడ్డు పై పడ్డారు. అదే సమయంలో గుడివాడ వైపు వెళ్తున్న గుర్తుతెలియని లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డు మీద కిందపడి ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించి.. కే సు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.