![Three Youth Dead In Road Accident At Sangareddy Kandi](/styles/webp/s3/article_images/2024/07/25/Road-Accident_1.jpg.webp?itok=wCzbMNoz)
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతిచెందారు. కాగా, మృతులను పుల్కల్ మండలానికి చెందిన సందీప్, నవీన్, అభిషేక్‌గా గుర్తించారు.
వివరాల ప్రకారం.. కంది మండలం తునికిళ్ల తండా శివారులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. నాందేడ్-అకోల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కాగా, నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను పుల్కల్ మండలానికి చెందిన సందీప్, నవీన్, అభిషేక్‌గా గుర్తించారు. ఇక, వీరు ముగ్గురు కందిలోని అక్షయ పాత్రలో పని చేస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment