
ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు పైన వెళ్తోన్న ముగ్గురిని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైకుపై వెళ్తోన్న ముగ్గురిని అటుగా వస్తోన్న లారీ అదుపుతప్పి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు స్థానికులు. ప్రమాదంలో చనిపోయిన వారు అంబాపురంకు చెండియాన్ వినోద్, నాని, వీరేంద్రగా గుర్తించారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మృతుల బంధువులు అక్కడికి చేరుకుని మృతదేహాలతో నిరసన తెలుపుతున్నారు. రోడ్డుపైన మృతుల బంధువులు భారీ సంఖ్యలో రహదారిపైనే బైఠాయించడంతో రహదారిపై వాహానాలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment