Los Angeles police
-
ముంబై దాడుల దోషి రానా మళ్లీ అరెస్ట్
వాషింగ్టన్: భారత్‌లో 2008నాటి ముంబై ఉగ్రదాడుల ఘటనలో దోషి అయిన పాకిస్తాన్ సంతతి కెనడా వ్యాపారి తహవుర్ రానాను అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. ఉగ్రదాడుల కేసు నిమిత్తం తమకు అప్పగించాలన్న భారత్ అభ్యర్థన మేరకు రానాను ఈనెల 10న అరెస్ట్‌చేశారు. 59 ఏళ్ళ రానాకు కరోనా సోకిన కారణంగా ఇటీవలే అమెరికా జైలు నుంచి విడుదలచేశారు. రానాను తమకు అప్పగించాల్సిందిగా భారత్ తాజాగా కోరినట్టు అమెరికా అటార్నీ జాన్ లులేజియన్ కోర్టుకి వెల్లడించారు. 2006 నవంబర్ నుంచి 2008 నవంబర్ మధ్యకాలంలో రానా పాకిస్తాన్‌లోని తన చిన్ననాటి స్నేహితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ(దావూద్ గిలానీ), మరికొందరితో కలిసి లష్కరే తోయిబా, హరాకత్ ఉల్–జిహాదీ–ఇ ఇస్లామీ ఉగ్ర సంస్థలకు ముంబై దాడుల్లో సహకరించారని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ వెల్లడించారు. -
అత్యాచారం కేసులో నటుడి అరెస్ట్
లాస్ఏంజెల్స్: ‘దట్ సెవంటీస్ షో’ నటుడు డానీ మాస్టర్సన్ కటకటాల వెనక్కి వెళ్లాడు. అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను బుధవారం లాస్ ఏంజెల్స్ పోలీసులు అరెస్టు చేశారు. కాగా డానీ మాస్టర్‌సన్‌పై ముగ్గురు యువతులపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2001లో 23 ఏళ్ల యువతిని, 2003లో 28 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడగా, 2003 చివర్లో 23 ఏళ్ల యువతిని ఇంటికి పిలిచి మరీ అత్యాచారం చేసినట్లు కేసులు నమోదు అయ్యాయి. వీటిపై పోలీసులు మూడేళ్లుగా దర్యాప్తు చేపట్టారు. తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు జైలు శిక్ష విధించింది. అయితే కొద్ది గంటల్లోనే డానీ మాస్టర్సన్ కోర్టుకు 3.3 మిలియన్ డాలర్లు చెల్లించి జైలు నుంచి విడుదలయ్యాడు. (డేంజర్లో హలీవుడ్) కాగా సెప్టెంబర్ 18న మరోసారి విచారణ చేపట్టనున్న న్యాయస్థానం డానీ మాస్టర్‌సన్‌కు 45 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా నెట్‌ప్లిక్స్ 2017లో ‘ద రాంచ్’ షో నుంచి ఆయనను తొలగించింది. మరోవైపు నిందితుడి తరపు న్యాయవాది థామస్ మెసెరో మాట్లాడుతూ.. మాస్టర్సన్ అమాయకుడుని తెలిపారు. నిజం ఏంటో ఎప్పటికైనా తెలుస్తుందని, అప్పుడు ఆయన నిర్దోషి అని నిరూపితమవుతుందన్నారు. కాగా థామస్ మెసెరో.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మైఖేల్ జాక్సన్, బిల్ కాస్బేల తరపు న్యాయవాదిగా కోర్టులో వాదించాడు. (ప్రజలు అసహనానికి లోనవుతారు: ప్రముఖ దర్శకుడు) -
హంతకుడి ఆచూకీ చెబితే రూ.12 లక్షలు
కాలిఫోర్నియా: భారతీయ అమెరికన్ ప్రవీణ్ పటేల్(62) హత్య కేసును ఛేదించేందుకు లాస్ ఏంజెలెస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హంతకుడికి సంబంధించిన సమాచారం అందిస్తే సుమారు రూ.12 లక్షలు నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. శాండిమాస్ ప్రాంతంలో శాండ్ విచ్ షాపు నడుపుతున్న ప్రవీణ్ పటేల్ జూన్ 2న హత్యకు గురయ్యారు. దుకాణంలో దొంగతనానికి వచ్చి దుండగుడు పటేల్ ను తుపాకీతో కాల్చి చంపాడు. హత్య జరిగిన సమయంలో సెక్యురిటీ కెమెరాలు పనిచేయకపోవడంతో హంతకుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. హంతకుడు తెలుపు వర్ణంలో ఉన్నాడని, అతడి వయసు 20 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. సుమారు ఆరు అడుగుల పొడవు ఉన్నాడని వెల్లడించారు. హత్య జరిగిన సమయంలో అతడు బేస్ బాల్ టోపీ, బ్లాక్ టీషర్ట్ ధరించివున్నాడని తెలిపారు. అతడికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.12 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.