వైద్య నిర్లక్ష్యంతో 60 మందికి అంధత్వం
గురుదాస్పూర్/న్యూఢిల్లీ: పంజాబ్లో కంటి వైద్యుడి నిర్లక్ష్యానికి 60 మంది అంధులయ్యారు. నాసిరకం పరికరాలు, అపరిశుభ్ర వాతావరణంలో ఆపరేషన్లు నిర్వహించడంతో శాశ్వతంగా చూపు కోల్పోయారు. గురుదాస్పూర్ జిల్లా గుమన్ గ్రామంలో కొన్ని రోజుల కిందట ఓ ఎన్జీవో వైద్య శిబిరంలో ఏర్పాటు చేసి 130 మందికి శస్త్ర చికిత్సలు చేసింది. వీరిలో 60 మంది చూపు కోల్పోయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన పంజాబ్ ప్రభుత్వం ఆపరేషన్లు నిర్వహించిన డాక్టర వివేక్ అరోరాను అరెస్టు చేయడంతోపాటు ఓ ప్రైవేటు ఆస్పత్రి, సంబంధిత ఎన్జీవోపై కేసులు నమోదు చేసింది.