lottery winner
-
11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు..
కొచ్చిన్: కేరళలోని 11 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. అందరూ కలిసి చందాలు వేసి కొనుక్కున్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.10 కోట్ల బంపర్ లాటరీ గెలుచుకుంది. రాత్రికి రాత్రే అంత పెద్ద మొత్తంలో నడమంత్రపుసిరి సొంతం కావడంతో వారంతా ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నారు. కేరళ ప్రభుత్వం 2023 వర్షాకాలం బంపర్ లాటరీ టికెట్ కొనడం కోసం 11 మంది మహిళా పారిశుధ్య కార్మికులు తలా కొంచెం చందాలు వేసుకున్నారు. పరప్పనంగడి మునిసిపాలిటీలోని హరిత కర్మ సేనకు చెందిన వీరందరివి అత్యంత నిరుపేద కుటుంబాలు. చందాలు పోగు చేసే సమయానికి వారిలో కొందరి వద్ద కనీసం రూ. 25 కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో చేతిలో ఎంత ఉంటే అంత పెట్టి ఎలాగోలా రూ. 250 పోగుచేసి బంపర్ లాటరీ టికెట్టు కొన్నారు. వారు కష్టపడి కొన్న అదే టికెట్‌కు రూ.10 కోట్లు బహుమతి లభించిందని తెలియగానే వారంతా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వారిలో ఒకామె మాట్లాడుతూ.. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. మేము మరికొంతమందిని అడిగి దీన్ని నిర్ధారించుకోవాలి. మేమంతా చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చినవారమే. మాలో చాలామందికి పెద్ద మొత్తంలో అప్పులున్నాయి. నాకే రూ.3 లక్షలు అప్పు ఉంది. ఇందులో నా వాటా డబ్బులతో అప్పులన్నీ తీర్చేస్తాను. డబ్బు సరైన సమయానికి చేతికందిందని అనుకుంటున్నానంది. ఇక హరిత కర్మ సేన కోఆర్డినేటర్ వారి సిబ్బందిలో కొంతమంది లాటరీ గెలవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వారంతా తమ జీవనాన్ని సాఫిగా గడపడం కోసం ఏంతో కష్టపడేవారు. వారు సాధారణంగా ప్రతి ఇల్లు తిరిగి చెత్తను సేకరిస్తూ ఉంటారు. వారి నెల జీతం కూడా రూ. 8000 నుండి రూ. 15000 మాత్రమేనని అన్నారు. ఈ లాటరీలో వారి జీవితాలు మారిపోయినట్లేనని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ 11 మంది పారిశుద్ధ్య కార్మికులు గత నాలుగేళ్లుగా ఈ బంపర్ కాటరీ టికెట్ కొంటుండగా గతంలో ఒకసారి వీరికి ఓనమ్ బంపర్ లాటరీలో రూ. 1000 బహుమతి లభించగా ఈ సారి మాత్రం ఏనుగు కుంభస్థలాన్ని కొల్లగొట్టారు. ఇది కూడా చదవండి: వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం.. -
ఇది కదా జాక్‌పాట్.. ఏడాదికి రూ.20 లక్షల చొప్పున జీవితాంతం
లాన్సింగ్: లాటరీలో అదృష్టం వరించిన వారికి ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని అందరకీ తెలుసు. కానీ, ప్రతి ఏడాది లక్షల రూపాయలు జీవితాంతం లభిస్తే అది జాక్‌పాట్‌కే జాక్‌పాట్ అంటారు కదా? అలాంటి జాక్పాట్నే కొట్టేశాడు మిచిగాన్కు చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి. ఏడాదికి రూ.20లక్షల చొప్పున జీవితాంతం పొందే లాటరీని సొంతం చేసుకున్నాడు. ఆన్లైన్లో రాండమ్ నంబర్ జనరేటర్లో తన టికెట్‌పై ఉన్న నంబర్లను పొంది ఈ లాటరీ గెలుపొందనట్లు యూపీఐ పేర్కొంది. ఆయనే.. మిచిగాన్‌లోని వారెన్ ప్రాంతానికి చెందిన అరోన్ ఎసెన్‌మాచెర్(50). వారెన్ హ్యాపీ డేస్ పార్టీ స్టోర్‌లో సెప్టెంబర్ 15న లక్కీ ఫర్ లైఫ్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.‘నేను లక్కీ ఫర్ లైఫ్ ఆడాను. ప్రతిసారి ఒకే సెట్ నంబర్లను వినియోగించాను. నేను నా టికెట్ కొనుగోలు చేసినప్పుడు సాధారణంగానే సంఖ్యలను ఎంచుకున్నాను. తర్వాత ఆన్లైన్లో కనుగొన్న రాండమ్ సంఖ్యలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నా. డ్రా తీసిన తర్వాతి రోజు నేను నంబర్లను తనిఖీ చేశాను. నేను ఐదు నంబర్లను సరిగా మ్యాచ్ చేసినట్లు తెలుసుకున్నాను. రాండమ్ నంబర్ జనరేటర్లో గెలుపొందిన నంబర్లే ఇక్కడా వచ్చాయి. దాంతో షాక్‌కు గురయ్యాను. ధ్రువీకరించుకునేందుకు నా టికెట్‌ను యాప్‌లో పలుమార్లు స్కాన్ చేసి చూశాను. అప్పుడు నిజంగానే వచ్చిందని తెలుసుకున్నా.’ అని తెలిపారు అరోన్ ఎసెన్‌మాచెర్. ఐదు తెల్లని బంతులపై 02-18-27-41-45 సంఖ్యలు రావటంతో అరోన్ ఎసెన్‌మాచెర్ ఈ జాక్‌పాట్ గెలుపొందారు. దీంతో ఏడాదికి 25వేల డాలర్లు(రూ.20లక్షలు) పొందేందుకు అర్హత సాధించారు. ఇవి 20 ఏళ్లు లేదా జీవితాంతం(ఏది మందుగా వస్తే అది) చెల్లిస్తుంది లాటరీ సంస్థ. అయితే, ఈ 20 ఏళ్ల పాటు చెల్లించే డబ్బులు మొత్తం రూ.3.2 కోట్లు ఒకేసారి ఇవ్వాలని అరోన్ కోరినట్లు లాటరీ సంస్థ పేర్కొంది. అప్పులు చెల్లించాలని, మిగిలిన వాటితో టూర్‌కు వెళ్లాలని చెప్పినట్లు తెలిపింది. లక్కీ ఫర్ లైఫ్ ఆడేందుకు కేవలం 2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నిసార్లైనా ఆడొచ్చు. ఈ గేమ్‌లో రోజుకు వెయ్యి డాలర్లు జీవితాంతం చెల్లించటం అతిపెద్ద ప్రైజ్. 1 నుంటి 48 నంబర్ల మధ్య ఐదు నంబర్లను సహా ఓ లక్కీ బాల్ 1-18 నంబర్లును మ్యచ్ చేస్తే గెలచుకోవచ్చు. అయితే, లక్కీబాల్ కాకుండా ఐదు నంబర్లు మాత్రమే సరిగా గుర్తిస్తే ఏడాదికి రూ.20 లక్షలు వస్తాయి. ఇదీ చదవండి: జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. మరో వివాదంలో కర్ణాటక ప్రభుత్వం -
లాటరీలో ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి.. బీజేపీ మనీలాండరింగ్ ఆరోపణ
కోల్‌కతా: లాటరీలో ఓ ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి జాక్‌పాట్ తగిలింది. అయితే, అది లాటరీ పేరుతో మనీలాండరింగ్‌కి పాల్పడటమేనని బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. టీఎంసీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా భార్య లాటరీలో రూ.కోటి గెలుచుకున్నారు. ఈ క్రమంలో బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ట్విటర్ వేదికగా విమర్శలు గప్పించారు. లాటరీ ద్వారా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మనీలాండరింగ్(అక్రమ నగదు బదిలీ)కి పాల్పడుతోందని ఆరోపంచారు. ‘టీఎంసీకి, లాటరీ సంస్థకు మధ్య సంబంధాలు ఉన్నాయని నేను చెబుతూనే ఉన్నాను. మనీలాండరింగ్‌కు పాల్పడేందుకు ఇది సులభమైన మార్గం. సామాన్య ప్రజలు టికెట్లు కొంటారు. కానీ, టీఎంసీ నేతలు బంపర్ ప్రైజ్ గెలుస్తారు. తొలుత అనుబ్రాత మొండల్ ఈ జాక్‌పాట్ గెలిచారు. ఇప్పుడు టీఎంసీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా భార్య కోటి రూపాయలు గెలచుకున్నారు.’ - సువేందు అధికారి, బీజేపీ నేత ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు చెప్పారు సువేందు అధికారి. డియర్ లాటరీకి బెంగాల్లో పెద్ద మార్కెట్ ఉందని, అయితే, లాటరీలు అక్రమమని పేర్కొన్నారు. లాటరీని అక్రమ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.. దానిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపారు. మరోవైపు.. సువేందు అధికారి ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే వివేక్ గుప్తా. తన భార్యపై రాజకీయ ఆరోపణలు చేయటం సరికాదన్నారు. తనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. I've been saying this all along, that Dear (Bhaipo) Lottery & TMC have a tangled relationship. It's an easy way to launder money. Common people buy tickets but TMC leaders win bumper prize. First Anubrata Mondal won the jackpot & now TMC MLA Vivek Gupta's wife has won 1 crore: pic.twitter.com/owtdGOk6xD — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) October 27, 2022 ఇదీ చదవండి: ఆజంఖాన్ ఖాన్‌కు షాక్.. శాసనసభ్యత్వం రద్దు -
భార్య మాట విన్నాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!
వాషింగ్టన్: ఇంట్లో సరుకులు అయిపోయాయి వచ్చేటప్పుడు తీసుకురండి అనీ భార్య ఫోన్ చేస్తే చాలా మంది భర్తలు విసుక్కుంటారు. నువ్వే వెళ్లి తెచ్చుకో.. నాకు ఓపిక లేదని తెగేసి చెబుతుంటారు. కానీ, భార్య మాట విని చెప్పిన పని చేసిన ఓ భర్త జీవితమే మారిపోయింది. లాటరీలో ఏకంగా రూ.1.5 కోట్ల జాక్‌పాట్ తగిలింది. ఈ సంఘటన అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో జరిగింది. మిచిగన్ రాష్ట్రంలోని మార్క్వేట్ ప్రాంతానికి చెందిన ప్రిస్టోన్ మాకీ(46) అనే వ్యక్తికి ‘మిచిగన్ లాటరీ’లో 190,736డాలర్లు(రూ.1.5కోట్లు) గెలుచుకున్నాడు. అయితే, ఆ లాటరీలో డబ్బులు వచ్చేందుకు తన భార్య పంపిన మెసేజ్ కారణమని చెబుతున్నాడు ప్రిస్టోన్ మాకీ. ‘నేను నా విధులు ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు కిరాణ సరుకులు తీసుకురావాలని నా భార్య మెసేజ్ చేసింది. దీంతో వచ్చే దారిలో సరుకులు కొనేందుకు షాప్‌కి వెళ్లాను, అక్కడే 5 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాను. ఆ తర్వాతి రోజు ఉదయం, కిచెన్‌లో ఉన్న సమయంలో లాటరీ టికెట్లను మొబైల్ యాప్‌లో స్కాన్ చేశాను. నేనే జాక్‌పాట్ విన్నర్‌గా తెలుసుకున్నాను. అది ఊహించని పరిణామంగా అనిపించింది. ’ అని తెలిపారు ప్రిస్టోన్ మాకీ. లాటరీలో లభించే రూ.1.5 కోట్ల నగదులో కొంత తన పెట్టుబడుల కోసం ఉంచుకుని, మిగిలినది కుటుంబ సభ్యులకు పంచిస్తానని చెప్పారు ప్రిస్టోన్ మాకీ. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి సైతం ఈ విధంగానే రూ.15 కోట్ల జాక్‌పాట్ కొట్టినట్లు చెప్పాడు. తాను కిరాణ సరుకుల కోసం వెళ్లి టికెట్ కొనుగోలు చేయటం ద్వారానే లాటరీలో విజేతగా నిలిచానని తెలిపాడు. ఇదీ చదవండి: ఢిల్లీ నుంచే యూరప్‌లో ప్రధాని మోదీ కారు డ్రైవింగ్.. 5జీ సాయంతో.. -
లాటరీ గెలిచానన్న ఆనందమే లేదు.. ప్లీజ్ నన్ను చావగొట్టకండిరా అయ్యా!
అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో తెలియదు. ఒక్కరోజులో సామాన్యుడు ధనవంతుడు కావచ్చు.. కోటీశ్వరుడు సామాన్యుడు కావొచ్చు. కాగా, ఇటీవలే కేరళకు చెందిన ఆటో డ్రైవర్ అనూప్.. లాటరీలో రూ. 25 కోట్ల బహుమతి గెలుచుకొని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఈ క్రమంలో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కానీ, ఐదు రోజులు గడిచిన తర్వాత అనూహ్యంగా తనకు బహుమతి వద్దనిపిస్తుందని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే, కేరళ ప్రముఖ పండగ ఓనం సందర్భంగా ప్రభుత్వం నిర్వహించిన మెగా ఓనం రాఫిల్‌లో ఆటోడ్రైవర్ అనూప్ రూ. 25 కోట్ల లాటరీ బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో, అనూప్.. ఆనందం వ్యక్తం చేశాడు. కానీ, ఇంతలోనే ఆ డబ్బు వస్తున్న కారణంగా తాను మనోవేదనకు గురవుతున్నట్టు తెలిపాడు. తాజాగా అనూప్ మాట్లాడుతూ.. లాటరీ డబ్బులో పన్ను, ఇతర బకాయిలు పోయిన తర్వాత ప్రైజ్ మనీగా రూ. 15 కోట్లు వచ్చే అవకాశం ఉంది. లాటరీ గెలిచాక 2 రోజులుగా ఆనందంగా గడిపాను. కానీ, ప్రస్తుతం మాత్రం మనశ్శాంతిని కోల్పోయాను.. నిద్ర కూడా పట్టడంలేదని అన్నాడు. ఎందుకంటే, నేను లాటరీ గెలిచాక నా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తమ అసరాలను తీర్చమంటూ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. దీంతో, ఇంట్లో నివసించే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగానే నా అవసరాలు తీరే విధంగా తక్కువ మొత్తంలో డబ్బులు వచ్చినా బాగుండేది. అలాగైనా ప్రశాంతంగా ఉండేవాడినని అంటున్నాడు. ఎందుకంటే డబ్భులు వచ్చాయని తెలియగానే తనకు తెలిసిన వారు చాలా మంది శత్రువులుగా మారుతున్నారని వాపోయాడు. అయితే, తనకు ఇంకా డబ్బులు అందలేదని సోషల్ మీడియా ద్వారా అందరికీ చెబుతున్నానని అన్నాడు. కాగా, ఒక్కసారిగా అంత మొత్తంలో డబ్బు వస్తున్నందు వల్ల ఆ డబ్బును ఏం చేయాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. వచ్చిన మొత్తం డబ్బును కొద్దిరోజులు బ్యాంకులోనే ఉంచుతానని స్పష్టం చేశాడు. After being announced as the winner of the Onam bumper lottery, Kerala resident Anoop says that regrets winning the prize amount of INR 25 crore. Anoop said that he has lost all peace of mind winning the lottery.#Lottery #KeralaLottery https://t.co/8oSOFHjwnp — G2G News (@NewsG2G) September 24, 2022 -
ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ
కోజికోడ్: కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఓ వ్యక్తి అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి దిక్కుతోచని స్థితిలో ఉండగా అదృష్టం లాటరీ రూపంలో వచ్చి కాపాడింది. తన సొంతింటిని మరికొద్ది గంటల్లో విక్రయించే సమయంలో ఏకంగా రూ.కోటి జాక్‌పాట్ తగిలింది. కోజికోడ్‌లోని మంజేశ్వర్‌కు చెందిన మహ్మద్ బవ(50) వృత్తిరీత్యా పెయింటర్. ఇతడికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. సుమారు 8 నెలల క్రితం 2వేల అడుగుల విస్తీర్ణంలో ఇంటిని ఎంతో ఇష్టంగా కట్టుకున్నాడు. అయితే, ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేయడంతోపాటు కొడుకును ఖతార్ పంపేందుకు చేసిన రూ.50లక్షల అప్పులు మిగిలాయి. దీంతో, కట్టుకున్న ఇంటిని రూ.40 లక్షలకు అమ్మేందుకు సిద్ధపడ్డాడు. అయితే, ఇతడికి లాటరీ టికెట్లు కొనే అలవాటుంది. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నాలుగు టికెట్లు కొన్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిర్వాహకులు డ్రా తీయగా మహ్మద్‌కు జాక్‌పాట్ తగిలింది. కొద్ది గంటల్లో అడ్వాన్స్ కూడా తీసుకోవాల్సి ఉన్న సమయంలో ఇది జరిగింది. దీంతో మహ్మద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ మొత్తంలో పన్నులు పోగా చేతికి రూ.63 లక్షలు అందనుంది. దీంతో, కలల ఇంటిని అమ్మే అవసరం అతడికి తప్పింది. ఇదీ చదవండి: ఒక్క రూపాయి డాక్టర్ సుషోవన్ ఇకలేరు -
ఏమా అదృష్టం.. పెయింటర్‌ను వరించిన రూ.12 కోట్ల లాటరీ.. టికెట్ కొన్న గంటల్లోనే
కొట్టాయం (కేరళ): యాభై ఏళ్లుగా సామాన్య పెయింటర్... రెక్కల కష్టంతో జీవితం నెట్టుకొస్తున్నాడు. ఆదివారం అదృష్టం ఆయన తలుపు తట్టింది. కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్‌కు సుడి మామూలుగా లేదు. క్రిస్మస్– నూతన సంవత్సరపు బంపర్ లాటరీలో ఆయన ఏకంగా రూ. 12 కోట్లు గెల్చుకున్నారు. ఆదివారం తిరువనంతపురంలో ఈ మెగా లాటరీ డ్రా తీశారు. దానికి కొద్ది గంటలకు ముందు సదానందన్ ‘ఎక్స్‌జి 218582’ నంబర్ లాటరీ టికెట్ కొన్నారు. అట్నుంటే బయటికి వెళ్లి మాంసం కొనుగోలు చేశారు. డ్రా తీశాక ఫలితాలను చెక్ చేసుకుంటే సదానందన్ టికెట్‌కు రూ. 12 కోట్లు తగిలింది. పిల్లలకు మంచి జీవితం అందించడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తానని సదానందన్ చెప్పారు. భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులతో సదానందన్ కుడయంపాడిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. (చదవండి: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..) -
భాగ్యమిత్ర లాటరీ.. సెక్యూరిటీ గార్డు కరోడ్‌పతి
సాక్షి, యశవంతపుర: కర్ణాటకలోని మంగళూరులో సెక్యూరిటీ గార్డుకు లాటరీలో రూ.కోటి వరించింది. వారానికి ఐదుగురికి రూ.కోటి చొప్పున బహుమతి మొత్తం లభించే కేరళ భాగ్యమిత్ర లాటరీ అతనికి తగిలింది. మంగళూరులో ఓ భవనం వద్ద సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మోయిద్దీన్ కుట్టి స్వస్థలం కేరళ. కుటుంబంతో కలిసి ఉపాధి కోసం ఏళ్ల కిందట వచ్చాడు. అతనికి రోజూ లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది. ఏప్రిల్ 4న రూ.100కు కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్ కొన్నాడు. అదృష్టం వరించి ఐదు మందికి రూ.కోటి చొప్పున లాటరీ తగిలింది. అందులో మోయిద్దీన్ ఒకరు. డబ్బులు చేతికి రాగానే భార్య, పిల్లలతో కలిసి కేరళకు వెళ్లిపోయి హాయిగా జీవిస్తానని చెప్పాడు. -
కోటి రూపాయల లాటరీ.. భయంతో పోలీసుల వద్దకు!
కోల్‌కతా: రాత్రికి రాత్రి లాటరీ ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. 70 సంవత్సరాల వయసున్న ఆ వ్యక్తి పేరు నిన్నటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పుడాయన పేరు పశ్చిమ బెంగాల్ లో మారు మోగుతోంది. ఆయనే ఇందిరా నారాయణన్. గత ఆదివారం ఆయనను కోటి రూపాయల లాటరీ వరించింది. దీంతో జీవితంలో ఎన్నడూ చూడనంత డబ్బు వచ్చి పడే సరికి.. వాటితో పాటు కష్టాలు కూడా వచ్చేశాయి. లాటరీ తగిలిందన్న విషయం తెలియగానే తమకు కొంత డబ్బులు ఇవ్వాలంటూ.. అతనికి బెదిరింపులు, ఒత్తిడులు పెరిగాయి. దీంతో ప్రాణ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను అభ్యర్థిస్తున్నాడు. చదవండి: '79 ఏళ్ల వయసులో ఏడుగురిని చిత్తు చేసింది' కాగా, ఇటీవల గుప్తిపారా మార్కెట్లో మింటూ బిశ్వాస్ అనే లాటరీ సెంటర్ యజమాని వద్ద టికెట్ కొన్నాడు. రూ. 60 పెట్టి, 10 నాగాలాండ్ స్టేట్ లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. తర్వాత దాన్ని ఇంటికి తీసుకెళ్లి మర్చిపోయాడు. లాటరీ ఫలితాలు కూడా చూడలేదు. తనకు టికెట్లను అమ్మిన లాటరీ సెంటర్ యజమాని మింటూ బిశ్వాస్.. తనకు ఫోన్ చేసి డబ్బులు వచ్చిన విషయాన్ని చెప్పాడని.. తన షాప్ నుంచి కొన్న టికెట్లకు బహుమతి వచ్చిందని.. షాపు యజమానిక ద్వారానే తనకు విషయం తెలిసిందని చెప్పాడు. లాటరీ తగిలిందని తెలిసినప్పటి నుంచి తనకు బెదిరింపులు ప్రారంభం అయ్యాయని.. అందుకే ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను కోరుతున్నానని చెప్పారు. చదవండి: ఏడాదిలో రూ.750 కోట్లు వసూళ్లు రాబట్టిన స్టార్హీరో -
కోట్లు గెలిచి.. ముఖానికి మాస్క్‌తో వచ్చి!
కింగ్స్టన్ : కష్టాల్లో ఉన్నవారికి ఎవరైనా చిన్నసాయం చేస్తేనే సంతోషిస్తారు. అలాంటిది ఓ మహిళకు ఏకంగా 180 మిలియన్ల జమైకన్ డాలర్ల లాటరీ ప్రైజ్‌మనీని(భారత కరెన్సీలో సుమారుగా 9.44 కోట్ల రూపాయాలు) నెగ్గారు. అయితే లాటరీ నెగ్గడం కంటే కూడా ఆ నగదు తీసుకోవడానికి వచ్చిన తీరే చూపరులను ఆకర్షించింది. ఆ వివరాలిలా.. ఎన్ గ్రే అనే జమైకా మహిళ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో సూపర్ లొట్టో లాటరీ టికెట్ కొన్నారు. ఆమె పంట పండింది. తాజాగా తీసిన లాటరీ డ్రాలో ఎన్. గ్రే విజేతగా నిలిచారని ప్రకటించగా.. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీ ప్రైజ్‌మనీని తీసుకునే కార్యక్రమానికి ముఖానికి మాస్క్‌తో ఆ మహిళ వచ్చారు. తాను ఆ నగదులో కొంత భాగం తన అప్పులకు వెచ్చించగా, మరికొంత పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఖర్చు చేస్తానన్నారు. యువత కోసం, తన సామాజిక వర్గం కోసం కమ్యూనిటీ సెంటర్లను నిర్మించి సేవలు అందిస్తానని చెప్పారు. తన ఉనికిని అందరికీ తెలియజెప్పడం ఇష్టం లేని కారణంగా మాస్క్ ధరించినట్లు లాటరీ విజేత తెలిపారు. ముఖానికి మాస్క్ ధరించడంపై నెటిజన్లు స్పందించారు. ఎత్తుపల్లాలు ఎన్ని ఎదురైనా ఆమె సాధారణంగా ఉండాలని భావించడం సరైన నిర్ణయమని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఇతరులు ఎలాగైతో ఆలోచిస్తారో.. అదే విధంగా తాను ఎవరన్నది తెలియకుండా ఆ మహిళ తెలివైన పని చేశారని మరికొందరు ప్రశంసిస్తున్నారు. -
3.45 కోట్లను టాయిలెట్లో పడేసిన వృద్ధురాలు
లండన్: ఓ వృద్ధురాలు తాగిన కిక్కులో లాటరీలో గెలుచుకున్న భారీ మొత్తాన్ని టాయిలెట్లో పడేసింది. జర్మనీకి చెందిన 63 ఏళ్ల బామ్మకు లక్కు కలిసొచ్చి రూ. 3.45కోట్లు లాటరీ రూపంలో తగిలింది. కానీ, ఏం లాభం... వచ్చిన సొమ్మునంతా టాయిలెట్లో పడేసి తన అదృష్టానికి నీళ్లు వదులుకుంది. ఎస్సెన్‌కు చెందిన ఏంజెలా మేయిర్ ఇటీవల జర్మనీ జాతీయ లాటరీలో రూ. 3.45కోట్ల మొత్తాన్ని గెలుచుకుంది. ఆ సంతోషంలో ఉండగానే కోర్టు నుంచి వచ్చిన ఓ లెటర్ ఆమె ఆనందాన్ని ఆవిరి చేసింది. ‘మీ భర్త మర ణించే వరకు మా సంరక్షణలోనే ఉన్నారు. ఆయన కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని మీరే చెల్లించాలి’ అని లెటర్ లో ఉంది. దీంతో కోపం నషాళానికెక్కిన ఏంజెల్ వెంటనే 5 సీసాల షాంపేయిన్‌ను గడగడా తాగేసింది. లాటరీలో గెలిచిన డబ్బును చించేసి టాయిలెట్లో పడేసింది.