3.45 కోట్లను టాయిలెట్‌లో పడేసిన వృద్ధురాలు | German lottery winner flushes 330,000 pounds down the toilet | Sakshi
Sakshi News home page

3.45 కోట్లను టాయిలెట్‌లో పడేసిన వృద్ధురాలు

Published Mon, Jan 27 2014 8:20 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

German lottery winner flushes 330,000 pounds down the toilet

 లండన్: ఓ వృద్ధురాలు తాగిన కిక్కులో లాటరీలో గెలుచుకున్న భారీ మొత్తాన్ని టాయిలెట్‌లో పడేసింది. జర్మనీకి చెందిన 63 ఏళ్ల బామ్మకు లక్కు కలిసొచ్చి రూ. 3.45కోట్లు లాటరీ రూపంలో తగిలింది. కానీ, ఏం లాభం...  వచ్చిన సొమ్మునంతా టాయిలెట్‌లో పడేసి తన అదృష్టానికి నీళ్లు వదులుకుంది. ఎస్సెన్‌కు చెందిన ఏంజెలా మేయిర్ ఇటీవల జర్మనీ జాతీయ లాటరీలో రూ. 3.45కోట్ల మొత్తాన్ని గెలుచుకుంది. ఆ సంతోషంలో ఉండగానే కోర్టు నుంచి వచ్చిన ఓ లెటర్ ఆమె ఆనందాన్ని ఆవిరి చేసింది.

 

‘మీ భర్త మర ణించే వరకు మా సంరక్షణలోనే ఉన్నారు. ఆయన కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని మీరే చెల్లించాలి’  అని లెటర్ లో ఉంది. దీంతో కోపం నషాళానికెక్కిన ఏంజెల్ వెంటనే 5 సీసాల షాంపేయిన్‌ను గడగడా తాగేసింది. లాటరీలో గెలిచిన డబ్బును చించేసి టాయిలెట్‌లో పడేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement