love affair end
-
మాయలేడి: పరిచయం, రెండేళ్ల ప్రేమ.. పెళ్లనగానే!
సాక్షి, జైపూర్(మంచిర్యాల): ప్రాణంగా ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జైపూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కాన్కూర్ గ్రామానికి చెందిన మధునక్క, శంకర్ దంపతుల కుమారుడు మహేశ్ డిగ్రీ చదువుతూనే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేశాడు. అక్కడే మంచిర్యాలలోని చున్నంబట్టి వాడకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఇటీవల మహేశ్ యువతి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటానని తెలపగా.. యువతి పోలీసులను ఆశ్రయించి తనకు మహేశ్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన మహేశ్ శుక్రవారం కాన్కూర్ గ్రామ సమీపంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. కుటుంబసబ్యులు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, తాను ప్రేమించిన అమ్మాయి సుఖంగా ఉండాలన్ని మహేశ్ రాసిన సూసైడ్‌నోట్ లభించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
సుఖాంతమైన ప్రేమ కథ
చందర్లపాడు: ప్రేమ కథ సుఖాంతమైంది. వేర్వేరు సామాజికవర్గాలు కావడం, పెళ్ళికి పెద్దల అంగీకారం లేనప్పటికీ అనేక మలుపుల మధ్య ప్రేమికులిద్దరూ ఒక్కటయ్యారు. ఆరేళ్లుగా ప్రేమిస్తూ పెద్దలు ఒప్పుకోలేదన్న సాకుతో ముఖం చాటేసిన యువకుడు పోలీసుల కౌన్సెలింగ్‌తోపాటు ఎమ్మార్పీఎస్ నాయకుల రంగప్రవేశంతో పెళ్లికి ఒప్పుకోకతప్పలేదు. ఆరేళ్ల ప్రేమకు ఫుల్స్టాప్ పెట్టి గ్రామ దేవత సాక్షిగా ఒక్కటయ్యారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన వేదాంతం పవన్‌కుమార్(24), తిరువూరు మండలం చౌటపల్లికి చెందిన దేవి(20)కి మధ్య ఆరేళ్ళుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఫోన్లో మాట్లాడుకోవడమేగాక అప్పుడప్పుడూ కలిసి తిరిగేవారు. వీరి సామాజిక వర్గాలు వేరైనందున విషయం దేవి ఇంట్లో తెలిసి మందలించారు. అయినా ఆమె పవన్ ఒత్తిడి మేరకు స్నేహం కొనసాగించింది. పెళ్లి మాట వచ్చేసరికి ముఖం చాటేశాడు. ఈ క్రమంలో కొద్ది నెలల క్రితం తిరువూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకునేందుకు రెండు నెలల గడువు కోరిన పవన్ అప్పటినుంచి ముఖం చాటేశాడు. ఫోన్లోకూడా స్పందించకపోవడంతో ఈ నెల 10వ తేదీ ఉదయం పవన్ ఇంటికి వచ్చిన దేవి జరిగినదానిపై అతని తల్లిదండ్రులకు చెప్పింది. వారినుంచి సరైన సమాధానం రాకపోవండతో అక్కడే దీక్ష చేపట్టింది. ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆమెకు ఆసరాగా నిలిచారు. పవన్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆమె వద్ద ఉన్న సాక్ష్యాల ఆధారంగా జరగబోయే పరిణామాలపై హెచ్చరించారు. విధి లేని పరిస్థితిలో పవన్ పెళ్ళికి అంగీకరించగా గురువారం రాత్రి చందర్లపాడు గ్రామ దేవత అలివేలమ్మ సాక్షిగా ఒక్కటయ్యారు. -
బాలీవుడ్లో మరో బ్రేకప్
బాలీవుడ్లో మరో ప్రేమజంట కటీఫ్ చెప్పారు. యువ హీరోహీరోయిన్లు సిద్ధార్థ మల్హోత్రా, అలియా భట్ ప్రేమబంధం ముగిసినట్టు సమచారం. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ ప్రేమపక్షులు చాలాకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. సిద్ధార్థ, అలియా ప్రేమ గురించి పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇటీవల వీరిద్దరూ ప్రేమకు గుడ్ బై చెప్పి, వారి కెరీర్లపై దృష్టిసారించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా సిద్ధార్థ, అలియా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. డ్రీమ్ టీమ్ టూర్ సందర్భంగా వీరిద్దరూ దూరంగా ఉన్నారని, మాట్లాడుకోవడం కూడా తక్కువని బాలీవుడ్ వర్గాలు చెప్పాయి. సిద్ధార్థ సినిమా కెరీర్‌కు సంబంధించిన విషయాలు మినహా వ్యక్తిగత జీవితం గురించి మీడియాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక అలియా కూడా ప్రేమ వ్యవహారానికి ముగింపు చెప్పి, పూర్తిగా సినిమాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ ప్రేమికులుగా గాక, స్నేహితులుగా ఉండాలని భావిస్తున్నారు.