ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
హైదరాబాద్: వనస్థలిపురంలో దారుణం జరిగింది. కూతరును ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడిని బంధువులు చితక్కొట్టారు. అడ్డువచ్చిన అతని తల్లిపై సైతం దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన లక్ష్మణ్ తన కుటుంబసభ్యులతో కలిసి వనస్థలిపురంలోని సాయి సప్తగిరి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు.
అదే జిల్లా పోచంపల్లికి చెందిన రాంచంద్రారెడ్డి కూడా అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. రామచంద్రారెడ్డి కూతురు సుష్మ- లక్ష్మణ్‌లు సంవత్సర కాలంగా ప్రేమించుకుంటున్నారు. సుష్మ తండ్రి ప్రేమకు అడ్డుచెప్పడంతో వారిద్దరి మధ్య కొద్దిరోజులు మాటలు లేవు. అయితే ఈ మధ్యే వాళ్లు తిరిగి కలుసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో రామచంద్రారెడ్డి, అతని కుటుంబ సభ్యులు లక్ష్మణ్‌పై దాడి చేశారు. అడ్డు వచ్చిన తమ తల్లిపై దాడి చేశారని.. అందువల్లే ఆమె చనిపోయిందని లక్ష్మణ్ అతని బంధువులు ఆరోపించారు.