టాలీవుడే టాప్
తెలుగు చిత్రాల నిర్మాణం... విడుదలలో టాలీవుడ్ గత ఏడాది దూసుకుపోయింది. దేశవ్యాప్తంగా గత ఏడాది (ఏప్రిల్ 2013 - మార్చి 2014) మొత్తం1966 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 349 తెలుగు చిత్రాలు విడుదలై టాలీవడ్ మొదటి స్థానంలో నిలిచింది. 326 తమిళ చిత్రాల విడుదలతో తమిళ చిత్ర పరిశ్రమ ఆ తర్వాత స్థానాన్ని పొందింది. 263 హింది చిత్రాల విడుదలతో బాలీవుడ్ మూడో స్థానంలో నిలిచింది. అయితే 2012- 13 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1724 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో తమిళ చిత్రాలు 292 విడుదలై... మొదటిస్థానాన్ని ఆక్రమించగా, 280 చిత్రాలతో తెలుగు సినిమా రెండో స్థానంలో నిలిచింది. అలాగే 255 హిందీ చిత్రాలతో మూడో స్థానంలో నిలిచింది. కానీ అంతకుముందు ఏడాదిలో ఉన్న తమిళ చిత్రాల సంఖ్యను పడతోసి టాలీవుడ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
అంతకుముందు మొదటి స్థానంలో ఉన్న తమిళ చిత్రాల స్థానాన్ని గత ఏడాది తెలుగు చిత్రాలు అక్రమించాయి. అయితే తెలుగు చిత్రాలు భారీ సంఖ్యలో విడుదలవుతున్న బాక్సాఫీసు వద్ద అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. అది పెద్ద పెద్ద హీరోలు నటించిన ఈ పరిస్థితి నెలకొంది. చిత్రాల నిర్మాణంపై ఉన్న అసక్తితో చిన్న చిత్రాలు విడుదల సంఖ్య భారీగా పెరిగిందని... అలాగే డిజిటల్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో టాలీవుడ్ పరిశ్రమలో భారీ సంఖ్యలో చిత్రాలు విడుదలవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.