lpg dealers
-
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..! ఇకపై..
న్యూ ఢిల్లీ: ఎల్పీజీ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో గ్యాస్ వినియోగదారులు ఇకపై తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి రిఫిల్ సిలిండర్లను పొందవచ్చునని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గురువారం రోజున ప్రకటన చేసింది. కాగా ఈ సదుపాయాన్ని ప్రస్తుతం చండీగఢ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీ నగరాలల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనుంది. త్వరలోనే ఈ సదుపాయం దేశవ్యాప్తంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఒసీలతో జతకట్టి రాష్ట్రాలలో 21,000 ఇప్పటివరకు ఎల్పిజి కేంద్రాలను తెరిచినట్లు సీఎస్సీ ఎస్పీవీ డైరక్టర్ దినేష్ త్యాగి ఒక ప్రకటనలో తెలిపారు.అంతేకాకుండా దేశవ్యాప్తంగా మార్చి 2022 నాటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించి సుమారు ఒక లక్ష ఎల్పీజీ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ -
ఆందోళన బాటలో ఎల్పీజీ డీలర్లు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్లక్ష్య వైఖరికి నిరనసగా దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు భారత ఎల్పీజీ డీలర్ల సమాఖ్య ప్రకటించింది. ఢిల్లీలో సమావేశమైన అన్ని రాష్ట్రాలకు చెందిన సమాఖ్య ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపింది. గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లే, వినియోగించే వారికి ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, రకరకాల ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కొత్త డిస్ట్రిబ్యూటర్లను నియమించరాదని, కమీషన్ పెంచాలని, పటిష్టమైన లాకింగ్ కలిగిన సిలిండర్లు మాత్రమే సరఫరా చేయాలని, 5 కిలోల సిలిండర్లను అందుబాటులోకి తేవాలనే తదితర డిమాండ్లను సమాఖ్య చాలా కాలంగా చేస్తోంది. వీటిని ఆయిల్ కంపెనీలు, పెట్రోలియం శాఖలు పట్టించుకోకపోవడంతో ఆందోళన ప్రణాళిక రూపొందించినటు సమాఖ్య జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రావు, పవన్‌సోని తెలిపారు. నవంబరు 5 నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఆరంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలను చైతన్య పరిచేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తారు. నవంబరు 22న అర్ధరోజు పాటు డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాలు మూసివేస్తారు. నవంబర్ 29, డిసెంబర్ 1న పూర్తిరోజు కార్యాలయాలు మూసివేస్తారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాని పక్షంలో డిసెంబరు 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతారు. -
రేపటి నుంచి సమ్మె షురూ
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడనున్నది. ఎల్పీజీ డీలర్లు నిరవధిక సమ్మెకు సిద్ధం అయ్యారు. ఈనెల 25 నుంచి అన్ని రకాల సేవలు నిలుపుదల చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్యాస్ ఏజెన్సీలకు డిసిప్లినరీ గైడ్ లైన్స్ -2014ను అమల్లోకి తెచ్చింది. ఇందులో 17రకాల మార్గదర్శకాలు పొందు పరిచారు. వీటి అమల్లో జాప్యం నెలకొన్న పక్షంలో, వినియోగదారుడికి ఇబ్బందులు తలెత్తినా ఏజెన్సీలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఎల్పీజీ డీలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కేంద్రం దృష్టికి పలు మార్లు తీసుకెళ్లినా ఫలితం శూన్యం. దీంతో సమ్మెకు రెడీ అయ్యారు. రాష్ట్రంలోను డీలర్లు ఏకం అయ్యారు. నిరవధిక సమ్మెను జయప్రదం చేయడానికి నిర్ణయించారు. సమ్మెకు రెడీ: రాష్ట్ర ఎల్పీజీ డీలర్ల సంఘం కార్యదర్శి దక్షిణామూర్తి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, సమ్మె ప్రకటన చేశారు. కేంద్రం నిర్ణయం కారణంగా డీలర్లు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరి తమను తీవ్ర కష్టాలు, నష్టాల పాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. కొత్త మార్గ దర్శకాల మేరకు లక్షలాది రూపాయల జరిమానాలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎంఎస్ విధానం మేరకు గ్యాస్ బుక్ చేసిన 48 గంటల్లో సిలిండర్లు వినియోగదారుడికి చేరకున్నా, తమకు జరిమానా విధించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. డిసిప్లినరీ గైడ్ లైన్స్ విధానాన్ని రద్దు చేయాలని, నగదు బదిలీ అమలు చేయాలా..? నిలిపి వేయాలా..? అన్నది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సిలిండర్ సీలు తీయడానికి వీలు లేని రీతిలో సీల్డ్ ప్రూఫ్ సిలిండర్లు అందజేయాలని, బాట్లింగ్ పాయింట్లో తూనికల్లో తేడా ఉన్న పక్షంలో, దానికి డీలర్లను బాధ్యులు చేయడానికి వీల్లేదని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనే లక్ష్యంగా మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నామన్నారు. గ్యాస్ డెలివరీ, బుకింగ్ , కొత్త గ్యాస్‌ల నమోదు తదితర అన్ని రకాల సేవలు నిలుపుదల చేయనున్నామని ప్రకటించారు. వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయాలన్నది తమ అభిమతం కాదని, కేంద్ర నిరంకుశ వైఖరికి నిరసనగానే ఈ సమ్మె చేపట్టాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. తమ సమ్మెకు వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. డీలర్ల సమ్మె దృష్ట్యా, రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువే. ఈ సమ్మె ఎంత కాలం సాగుతుందో, ఎలాంటి పరిస్థితుల్ని సృష్టించనుందో వేచి చూడాల్సిందే. -
ఈ నెల 25 నుండి గ్యాస్ డీలర్ల సమ్మె
-
25 నుంచి ఎల్పీజీ డీలర్ల సమ్మె
సాక్షి, హైదరాబాద్/విజయవాడ, న్యూస్‌లైన్: కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా 25వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) డీలర్లు నిర్ణయించారు. గత రెండు రోజులుగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న ఎల్పీజీ డీలర్లు ఈనెల 25వ తేదీ నుంచి గ్యాస్ డెలివరీతోపాటు అన్నిరకాల సేవలను పూర్తిగా నిలిపివేసి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమ న్యాయమైన డిమాండ్లు తీర్చేవరకూ నిరవధిక సమ్మె చేపట్టాలని అఖిల భారత ఎల్పీజీ డీలర్ల సమాఖ్య(ఏఐఎల్డీఎఫ్), భారత ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల సమాఖ్య(ఎఫ్ఎల్డీఐ) ప్రతినిధులు నిర్ణయించారు. రెండు సంఘాల సంయుక్త పిలుపు మేరకు 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ డీలర్లంతా ఆందోళనలో పాల్గొని సమ్మెను విజయవంతం చేస్తామని రాష్ట్ర ఎల్పీజీ డీలర్ల సంఘం నేత వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఇదిలా ఉండగా సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డి.మనోజ్‌కుమార్ శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. గ్యాస్ డీలర్లు పడుతున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చమురు కంపెనీల నుంచి గ్యాస్ ఏజెన్సీలకు సక్రమంగా స్టాక్ రావట్లేదన్నారు. రాత్రికిరాత్రే నిర్ణయాలు తీసుకుంటున్నారని, వాటిని అమలు చేయడంలో నానా అగచాట్లు పడుతున్నామని చెప్పారు. ఆధార్ లింకు విషయంలో తమకెటువంటి సంబంధం లేకపోయినా గ్యాస్ ఏజెన్సీలనే బాధ్యులను చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించని ఏజెన్సీలపై చర్యలకోసం ఎండీజీ(మార్కెటింగ్ డిసిప్లినరీ గైడ్‌లైన్స్) పేరుతో కొత్త మార్గదర్శకాలు అమలు చేయడం శోచనీయమన్నారు. ఆ మేరకు చీటికిమాటికీ గ్యాస్ డీలర్లకు లక్షలాది రూపాయల జరిమానాలు విధిస్తున్నారన్నారు. 48 గంటలలోపు గ్యాస్ సరఫరా కాకపోయినా తమనే బాధ్యుల్ని చేయడం అన్యాయమన్నారు. దీంతో గత్యంతరం లేకే గ్యాస్ డీలర్లు నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు వివరించారు. డీలర్ల ప్రధాన డిమాండ్లివీ.. 2014 మార్కెటింగ్ డిసిప్లినరీ గైడ్‌లైన్స్(ఎండీజీ)ను రద్దు చేయాలి. నగదు బదిలీ అమలు చేయాలా? నిలిపేయాలా? అనేది ప్రభుత్వం ఇష్టం. అయితే వంటగ్యాస్ సబ్సిడీ బ్యాంకు అకౌంట్లలో జమకానందున వినియోగదారుల నుంచి డీలర్లు పడే ఇబ్బందులను తొలగించేందుకు నగదు బదిలీపై కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. సిలిండర్ సీలు తీయడానికి వీల్లేని విధంగా సీల్డ్ ఫ్రూఫ్ సిలిండర్లు అందజేయాలి. బాట్లింగ్ పాయింట్లోనే తూనికల్లో తేడా ఉంటే, దాంతో ఎలాంటి సంబంధం లేకున్నా డీలర్లను కేసుల్లో ఇరికించే విధానానికి ఈ పద్ధతితో చెక్‌పెట్టాలి.