lr
-
’రవాణా’ బాదుడు
10 శాతం చార్జీలు పెంచిన రవాణా శాఖ ఎల్ఎల్ఆర్ నుంచి వాహన రిజిస్ట్రేషన్ వరకూ అన్నీ ప్రియమే జిల్లాలో రోజుకు రూ.9 లక్షల అదనపు భారం ఏలూరు (మెట్రో) : వాహన రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తదితర ఫీజులు భారీగా పెరిగాయి. రవాణా శాఖ ద్వారా అందించే 83 రకాల సేవలకు సంబంధించి వసూలు చేసే చార్జీలు, ఫీజులను 10 శాతం నుంచి 100 శాతం వరకూ పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో రవాణా శాఖ ద్వారా సేవలు పొందే జిల్లా ప్రజలపై రోజుకు సుమారు రూ.9 లక్షల మేర అదనపు భారం పడింది. పెంపుదల ఇలా.. ఇప్పటివరకూ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన వారినుంచి ఎల్ఎల్ఆర్ నిమిత్తం ప్రస్తుతం రూ.30 వసూలు చేస్తుండగా.. ఆ మొత్తాన్ని రూ.150కి పెంచారు. దీనిపై వసూలు చేసే సర్వీస్ చార్జి రూ.60ని యథాతథంగా వసూలు చేస్తారు. రూ.550 ఉండే డ్రైవింగ్ లైసెన్స్ ఫీజును రూ.960కి పెంచారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు రూ.500 వసూలు చేస్తుండగా.. ఇప్పుడు రూ.1,000కి పెంచారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్‌కు రూ.50 వసూలు చేసేవారు. ఇదికాస్తా రూ.200కు పెరిగింది. గడువు తీరిపోయిన లైసెన్స్ రెన్యువల్‌కు అపరాధ రుసుంతో రూ.100 వసూలు చేసేవారు. ఆ మొత్తాన్ని రూ.300కు పెంచారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో మార్పులు చేయాల్సి వస్తే రూ.50 వసూలు చేసేవారు. ప్రస్తుతం అది రూ.200కు పెరిగింది. వాహన రిజిస్ట్రేషన్ చార్జీలు సైతం పెరిగాయి. ఏ మేరకు పెంచారనే విషయంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు అందలేదు. కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. మా శాఖ ద్వారా 83 రకాల సేవలు అందిస్తున్నాం. ప్రతి సేవలోనూ పెరిగిన చార్జీలను అమలు చేస్తున్నాం. ఎస్ఎస్ మూర్తి, డెప్యూటీ కమిషనర్, రవాణా శాఖ -
పాకిస్థాన్ కు ఎల్ ఆర్ పంపనున్న భారత్
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి వెనుకున్న కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్థాన్ ను భారత్ కోరనుంది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వానికి లెటర్ రొగేటరీ(ఎల్ ఆర్) పంపనుంది. సైనిక ఆపరేషన్ లో మృతి చెందిన ఉగ్రవాదుల డీఎన్ఏ నమూనాలు, ఫోన్ కాల్స్ తదితర వివరాలు పాకిస్థాన్ కు అందజేయనుంది. పఠాన్ కోట్ లో సైనిక బలగాల చేతిలో హతమైన ఆరుగురు ఉగ్రవాద మృతదేహాలకు వీలైనంత త్వరగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వీటితో పాటు పాకిస్థాన్ లోని సూత్రధారుల నుంచి ఉగ్రవాదులకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు ఎల్ ఆర్ ద్వారా పొరుగు దేశానికి పంపించనుంది. ఈ వివరాలతో కుట్రదారులను పట్టుకోవాలని పాక్ ప్రభుత్వ వర్గాలకు భారత్ అధికారికంగా విజ్ఞప్తి చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొన్ని రకాల న్యాయ సేవల కోసం కోర్టు ద్వారా విదేశీ కోర్టును అభ్యర్థించడానికి ఎల్ ఆర్ ను పంపుతారు. న్యాయ సేవ ప్రక్రియ ప్రాసెస్, ఆధారాలు పంపడానికి ఎల్ ఆర్ ను వినియోగిస్తుంటారు. పఠాన్ కోట్ లో ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే-ఈ-మొహ్మద్ తీవ్రవాద సంస్థ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. -
నేటినుంచి ‘కోతలు’
తాండూరు, న్యూస్‌లైన్ : లోడ్ రిలీఫ్ (ఎల్ఆర్) పేరుతో ట్రాన్స్‌కో మళ్లీ విద్యుత్ కోతలకు దిగుతోంది. రెండు వారాలుగా కొనసాగుతున్న అనధికారిక విద్యుత్ కోతలు ఆదివారం నుంచి అధికారికంగా అమలు కానున్నాయి. వేళలకు సంబంధించిన షెడ్యూల్‌ను వికారాబాద్ విద్యుత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) సాంబశివరావు శనివారం ప్రకటించారు. పట్టణాల్లో(మున్సిపాలిటీలు) నాలుగు గంటలు, మండల కేంద్రాల్లో నాలుగు గంటలపాటు ఎల్ఆర్ కోతలు విధించనున్నారు. ఇందులో భాగంగా పట్టణాల్లో ఇప్పటివరకు అమల్లో ఉన్న మూడు గంటల కోతలకు అదనంగా మరో గంటసేపు సరఫరా నిలిపివేస్తుండటం గమనార్హం. ఇక మండల కేంద్రాల్లో కోతల్లో అధికారులు పెద్దగా మార్పు చేయలేదు. ఆదివారం నుంచి రెండు విడతలుగా లోడ్ రిలీఫ్ కోతలు అమలు చేయనున్నారు. పట్టణాల్లో ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు, మండల కేంద్రాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. అయితే ఈ ఎల్ఆర్ కోతలు ఎప్పటివరకు కొనసాగుతాయనేది అధికారులు స్పష్టం చేయటం లేదు. రెండు దఫాలుగా పట్టణ, మండల కేంద్రాల్లో నాలుగు గంటల పాటు కోతలు విధించాలని మాత్రమే ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని స్థానిక విద్యుత్ సిబ్బంది ఒకరు పేర్కొన్నారు. ఎప్పుడు కోతలు ఎత్తివేసే విషయం తెలియదన్నారు. అధికారికంగా రెండు విడతలుగా విధించనున్న 8గంటల విద్యుత్ కోతలకు తోడు అనధికారిక కోతలతో తమకు కష్టాలు తప్పవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.