నైపుణ్య వృద్ధితోనే అవకాశాలు
మైలవరం:
వృత్తి విద్యలో విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకోవాలని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఇ.వి. ప్రసాద్ తెలిపారు. ఐటి, ఎమ్సిఏ తృతీయ సంవత్సరం విద్యార్థులకు మీన్ స్టాక్ టెక్నాలజీ అండ్ క్లౌడ్ అనే అంశంపై విశాఖపట్నంకు చెందిన మిరాకిల్ సాఫ్ట్ సంస్థ సాంకేతిక సహకారంతో మూడు రోజులు వర్క్షాప్ను మంగళవారం ప్రారంభించారు. ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యోగాలకు పోటీ పెరుగుతుందన్నారు. దానికి అనుగుణంగా విద్యార్థులు ఇప్పటి నుంచే వృత్తి విద్య నైపుణ్యాల్లో వెళకువలు ఎలా పెంపొందించాలో తెలుసుకుని సంసిద్ధం కావాలన్నారు. ఐఒటి, హడూప్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ల మీద విద్యార్ధులు పట్టు సంపాదించాలన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ ఆర్ చంద్రశేఖరం, సిఎస్ఇ విభాగాధిపతి డాక్టర్ యన్. రవిశంకర్, ఐటి విభాగాధిపతి డాక్టర్ డి.నాగరాజు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.