మారు తల్లిదండ్రులకూ చట్టబద్ధ సంబంధం
న్యూఢిల్లీ: మారు తల్లిదండ్రులకు, దత్తత తీసుకునే పిల్లలకు ‘చట్టబద్ధమైన సంబంధం’ ఉండేలా దత్తతకు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. బంధువుల పిల్లలనూ దత్తత తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనలు ఈనెల 16 నుంచి అమల్లోకి వస్తాయి.
‘ఇప్పటిదాకా దేశంలో మారు తల్లి/తండ్రికి, మారు పిల్లలకు మధ్య చట్టబద్దంగా ఎలాంటి సంబంధం లేదు. మారు తల్లిడండ్రుల ఆస్తులపై వారికి ఎలాంటి హక్కు లేదు. అదీగాక వృద్ధాప్యంలో మారు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత కూడా తప్పనిసరి కాదు. ఇలాంటి చాలా అంశాలను పరిష్కరించాల్సి ఉంది’అని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ దత్తత వనరుల సంస్థ (కారా) సీఈఓ లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ చెప్పారు. ఇంతకుముందు అనాధలు/తల్లిదండ్రులు వదిలిపెట్టిన పిల్లలనే దత్తతకు అనుమతించేవారు.