మైక్రోసాఫ్ట్.. మూడు లూమియా స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ డివెసైస్ కంపెనీ లూమియా రేంజ్లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తెచ్చింది. ఈ మూడు ఫోన్లు- లూమియా 730(ధర రూ.15,299), లూమియా 830(ధర రూ.28,700), లూమియా 930(ధర రూ.38,649)కు 1 టెర్రాబైట్ క్లౌడ్ స్టోరేజ్ ఆరు నెలల పాటు ఉచితమని, ఆ తర్వాతి నుంచి నెలకు రూ.125 చార్జ్ చేస్తామని కంపెనీ తెలిపింది. విండోస్ ఫోన్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే లూమియా 830లో 10 మెగాపిక్సెల్ ప్యూర్‌వ్యూ కెమెరా, లూమియా డెనిమ్ అప్డేట్, 15 జీబీ ఉచిత స్టోరేజ్నిచ్చే వన్ డ్రైవ్ వంటి ప్రత్యేకతలున్నాయి.
ఈ ఫోన్ విక్రయాలు ఈ నెల 8 నుంచి ప్రారంభమవుతాయి. లూమియా 730లో డ్యుయల్ సిమ్, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ నెల 6 నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇక లూమియా 930లో 20 మెగా పిక్సెల్ ప్యూర్‌వ్యూ కెమెరా, 2.2 గిగా హెర్ట్స్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ ఈ నెల 15 నుంచి లభిస్తుంది. విండోస్‌ను భారత్‌లో విస్తరించడమే లక్ష్యమని నోకియా ఇండియా ఎండీ అజేయ్ మెహతా చెప్పారు. అందరికీ అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లనందిస్తామని వివరించారు.