చంద్రుడిపైకి ‘టీమ్ఇండస్’!
న్యూఢిల్లీ: చంద్రుడి పైకి రోబోను పంపేందుకు ‘టీమ్ ఇండస్’ను గూగుల్ షార్ట్‌లిస్ట్ చేసింది. భారత్ నుంచి ఎంపికైన ఏకైక కంపెనీ ఇదే కావడం విశేషం. గూగుల్ చేపట్టిన ‘లూనార్ ఎక్స్‌ప్రైజ్’ పోటీకి టీమ్ఇండస్ అంతరిక్ష నౌక ఎంపికైతే వచ్చే ఏడాది లూనార్పైకి వెళ్తుంది. అదే జరిగితే తొలిసారిగా చంద్రుడి పైకి వెళ్లే ప్రైవేటు అంతరిక్ష నౌక ఇదే అవుతుంది.
టీమ్ఇండస్.. చంద్రుడిపైకి పంపేందుకు ఓ ప్రాజెక్టును డిజైన్ చేయడానికి యువతను ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా 25 ఏళ్ల లోపు వయసున్న అనేక మంది యువకులు తమ ఐడియాలను పంపారు. దాదాపు వచ్చిన 1600 ఆలోచనల నుంచి 20 ప్రాజెక్టులను షార్ట్‌లిస్ట్ చేయనుంది. ఈ టీమ్ ఇండస్ 2017 చివరికల్లా చంద్రుడి పైకి వెళ్లే అవకాశం ఉంది.