lunch for opposition
-
‘ఎవరనే దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు’
-
‘ఎవరనే దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు’
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థి ఎవరనే దానిపై చర్చించలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ప్రతిపక్ష పార్టీల నేతల సమావేశం అనంతరం మమతా మీడియాతో మాట్లాడారు. అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. సమావేశం బాగా జరిగిందని, ఏకాభిప్రాయంతోనే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక జరుగుతుందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థినే ఎన్డీయే ఎంపిక చేస్తే మంచిదని, అలాంటివారికే తాము కూడా మద్దతు ఇస్తామన్నారు. అభ్యర్థి ఎంపికపై త్వరలోనే ఉమ్మడి ప్రకటన చేస్తామని మమతా పేర్కొన్నారు. కాగా సోనియా అధ్యక్షత జరిగిన విపక్షాల సమావేశానికి దేవగౌడ, శరద్ యాదవ్, శరద్ పవార్, ఏచూరి సీతారం, సురవరం సుధాకర్‌రెడ్డి, లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, మాయవతి, కనిమొళి, ఒమర్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విపక్ష నేతలకు సోనియా విందు ఇచ్చారు. -
కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేదు!
నేడు ప్రతిపక్షాలకు సోనియా గాంధీ విందు చర్చకు రానున్న రాష్ట్రపతి ఎన్నిక అంశం న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం మధ్యాహ్నం ప్రతిపక్ష పార్టీల నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఇందులో రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడంపై చర్చించే అవకాశాలున్నాయి. పార్లమెంట్ హౌస్ లైబ్రరీలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీల అగ్ర నాయకులు హాజరు కానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వేరే పనుల వల్ల అందుబాటులో ఉండటంలేదని, ఆయన తరఫున జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ హాజరవుతారని తెలిసింది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆహ్వానం పంపలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. జేడీ(యూ), సీపీఐ, సీపీఎం, ఎస్పీ, డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, టీఎంసీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపడానికి సోనియా కొంతకాలంగా అన్ని ఎన్డీఏయేతర పార్టీల నాయకులతో తీవ్రంగా చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.