కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రితో హరీష్ భేటీ
బెంగళూరు : పాలమూరు జిల్లా ప్రజలకు తాగు, సాగు నీటి అవసరాల కోసం నారాయణపూర్ నుంచి జూరాలకు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రికి తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. ఆర్టీఎస్ పనులు ఈ సీజన్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హరీష్ రావు బృందానికి కర్ణాటక మంత్రి ఎం బి పాటిల్ హామీ ఇచ్చింది. గురువారం బెంగుళూరులో కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎం బి పాటిల్‌తో తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు బృందం భేటీ అయ్యి... ఈ రాజోలి బండ మళ్లింపు పథకం అంశంపై చర్చించింది.