‘టీడీపీ తొత్తుగా మారిన అశోక్బాబు’
కాచిగూడ: ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్బాబు తెలుగుదేశం పార్టీ తొత్తుగా మారారని... అధికారులు, ఉద్యోగులపైన దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని హైదరాబాద్ టీఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం నారాయణగూడలోని ఐపీఎంలో అసోసియేషన్ బ్రాంచి కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, ఐఎన్టీయూసీ ఐపీఎం అధ్యక్షుడు ఆర్.కృష్ణారెడ్డి, చెన్నయ్య, ఈశ్వర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విఫ్ చింతమనేని ప్రభాకర్ తనఅనుచరులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సీమాంధ్ర ఉద్యోగులు అశోక్బాబును అసోసియేషన్ అధ్యక్షునిగా, ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్గా వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.