పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ను విచారించిన సీబీఐ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలీకాప్టర్ ఒప్పందం కేసులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్‌ను సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో ఆయనను సాక్షిగా విచారించారు. 3600 కోట్ల రూపాయిలకు సంబంధించి ముడుపుల వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతోంది.
సీబీఐ అధికారులు శుక్రవారం నారాయణన్ విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా నారాయణన్ బాధ్యతుల చేపట్టకుముందు జాతీయ భద్రత సలహాదారుగా వ్యవహరించారు. హెలికాప్టర్లను కొనుగోలు చేసేముందు 2005లో జరిగిన సమావేశాల్లో నారాయణన్ పాల్గొన్నారు. గోవా గవర్నర్ బీవీ వాంఖూ కూడా నారాయణన్‌తో పాటు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని రక్షణ బాధ్యతలు చూసే ఎస్పీజీ ఆ సమయంలో వాంఖూ ఉన్నారు. అగస్టా కేసులో వాంఖూను కూడా ప్రశ్నించాలని సీబీఐ భావిస్తున్నట్టు సమాచారం. అగస్టా ఒప్పందంలో 360 కోట్ల రూపాయిలు ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో గతేడాది రద్దు చేశారు. భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగీతో పాటు 13 మందిపై కేసు నమోదు చేశారు.