జూలై 11 నుంచి కేంద్ర ఉద్యోగుల సమ్మె
సాక్షి, న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం సిఫార్సులను సవరించాలన్న డిమాండ్‌తో జూలై 11 నుంచి 32 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తారని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్)ప్రధాన కార్యదర్శి ఎం. రాఘవయ్య తెలిపారు. సమ్మెకు జూన్ 9న నోటీసు ఇస్తామన్నారు.