m-set
-
మే 3 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్)లకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్సీహెచ్ఈ) తేదీలను ఖరారు చేసింది. సెట్ల పరీక్షల సమయంతోపాటు వాటిని నిర్వహించే యూనివర్సిటీలను పేర్కొంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. సెట్ల నిర్వహణ యూనివర్సిటీల నుంచి కన్వీనర్ల నియామకం కోసం ముగ్గురు చొప్పున పేర్లు పంపించాలని సోమవారం ఆయా యూనివర్సిటీలకు లేఖలు రాయనుంది. వర్సిటీలు పంపించే మూడేసి పేర్లలో ఒకరి పేరును ఖరారు చేసి సెట్ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించనుంది. కన్వీనర్ల నియామకం పూర్తయిన వెంటనే సెట్లవారీగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మే 3 నుంచి 9 వరకు వరుసగా ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి. తొలుత ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నిర్వహించిన తర్వాత అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. టీఎస్ పీఈసెట్ మినహా మిగతా అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే జరుగుతాయి. టీఎస్ పీఈసెట్ మాత్రం శారీరక దృఢత్వం, నైపుణ్యాల ఆధారంగా నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. -
ఇప్పటి‘కీ’ గందరగోళమే
ఎం-సెట్లో ఒక ప్రశ్నకు సమాధానంపై అస్పష్టత ప్రాథమిక ‘కీ’కి... తుది ‘కీ’కి విభిన్న సమాధానాలు హైకోర్టుకెళ్లిన విద్యార్థులు ప్రాథమిక ‘కీ’ సమాధానమే సరైనదని నిర్ధారించిన కోర్టు హైదరాబాద్: ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో 35 శాతం మేనేజ్మెంట్ల సీట్లకు గత నెల మూడో తేదీన జరిగిన వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్)లో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంపై గందరగోళం నెలకొంది. పరీక్ష అయిన రోజు ప్రాథమికంగా విడుదల చేసిన సమాధానాల ‘కీ’కి... అనంతరం విడుదల చేసిన తుది ‘కీ’కి ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో తేడా వచ్చింది. దీంతో గందరగోళం నెలకొంది. ప్రశ్నపత్రంలో రసాయన శాస్త్రానికి సంబంధించిన ఒక ప్రశ్నకు 4 రకాల సమాధానాలు ఇవ్వగా... నాలుగోది సరైన సమాధానమని ప్రాథమిక ‘కీ’లో ప్రకటించారు. తర్వాత విడుదల చేసిన తుది ‘కీ’లో మాత్రం మొదటి సమాధానం సరైనదిగా ప్రకటించారు. తుది ‘కీ’ ప్రకారమే విద్యార్థుల మార్కులను అప్పట్లో ఎం-సెట్ కన్వీనర్ విడుదల చేశారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక ‘కీ’లో ప్రకటించిన నాలుగో సమాధానమే సరైనదిగా హైకోర్టు నిర్ధారించింది. ఈ తీర్పును ఆధారం చేసుకొని మొదట వెలువరించిన ఫలితాలను సవరించి మళ్లీ రెండోసారి విద్యార్థుల మార్కుల జాబితాను ఎం-సెట్ కన్వీనర్ ప్రకటించారు. దీంతో ఒక మార్కు తేడాతో కొందరు విద్యార్థులు నష్టపోగా... 70 మంది వరకు కొత్తగా అర్హత సాధించినట్లు తెలిసింది. ఒక మార్కుతో పరిస్థితి అటూ ఇటూ అయింది. త్వరలో ఇంటర్ మార్కులను ఆధారం చేసుకొని ర్యాంకులు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక మార్కు తక్కువ పొందినవారు ర్యాంకుల వద్దకు వచ్చేసరికి చాలా వెనక్కుపోయే పరిస్థితి ఏర్పడింది. మరికొందరు ముందుకు వచ్చే పరిస్థితి ఏర్పడనుంది. జేఎన్టీయూ ఆధ్వర్యంలోనే ప్రశ్నపత్రం ఎం-సెట్ ప్రవేశ పరీక్ష ప్రైవేటు వైద్య కళాశాలల నేతృత్వంలో జరిగింది. మొత్తం 5,130 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. దాదాపు 2,500 మంది వరకు అర్హత సాధించారు. ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలోనే పరీక్ష జరిగినా ప్రశ్నపత్రాన్ని హైదరాబాద్ జేఎన్టీయూ తయారు చేసింది. పరీక్ష నిర్వహణ బాధ్యత టీసీఎస్ చేపట్టిన సంగతి తెలిసిందే. -
ఏం సెట్టింగ్ గురూ!
ఎంసెట్‌లో యాజమాన్యాల కుట్ర మేనేజ్మెంట్ సీట్లను బ్లాక్ చేసుకునే ఎత్తుగడ ఇప్పటికే కాలేజీల్లో చేరిన విద్యార్థులతో దరఖాస్తు {పతిభావంతులతో పరీక్ష రాయించి సీటు కొట్టేసే యత్నం {పవేశాలు ముగిశాక ఎక్కువ రేటుకు అమ్మకం! అక్రమాలపై విచారణ ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్: యాజమాన్య కోటాలోని ఒక్క మెడికల్ సీటును బ్లాక్ చేస్తే కోటి రూపాయలు జేబులో ఉన్నట్లే! ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్క సీటును ఆపుకోగలిగితే కనీసం రూ. 3 లక్షలు వచ్చినట్టే!! అందుకే యాజమాన్యాలు పక్కా వ్యూహంతో ఎంసెట్‌ను హైజాక్ చేస్తున్నాయి. ఇప్పటికే తమ కాలేజీలో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను రంగంలోకి దించి ఎంట్రెన్స్ పరీక్షను రాయిస్తున్నాయి. ఇందుకోసం మెరికల్లాంటి విద్యార్థులకు కొంత మొత్తం ముట్టజెబుతాయి. వారితో తమ కాలేజీలోని మేనేజ్మెంట్ కోటా సీట్లను బ్లాక్ చేయించే ఎత్తుగడను అమలు చేస్తున్నాయి. ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ సీట్లను ఎక్కువ రేటుకు అమ్ముకునేందుకే ఈ అక్రమాలకు తెరలేపాయి. సదరు విద్యార్థులు తమ అడ్మిషన్‌ను రద్దు చేసుకుంటే వారి స్థానంలో మరొకరిని చేర్చుకునే వెసులుబాటు యాజమాన్యాలకు ఉంటుంది. ఇలా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకునేందుకు వీలు చిక్కుతుంది. ఈసారి ఇలాంటి విద్యార్థుల సంఖ్య దాదాపు 2 వేల వరకు ఉంది. దరఖాస్తుల పరిశీలన లో ఈమేరకు ఎంసెట్ అధికారులు గుర్తించారు. గతంలో మంచి ర్యాం కులు సాధించి అడ్మిషన్లు పొందిన వారు మళ్లీ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వ్యవహారాన్ని పోలీసులకు అప్పగించారు. సోమవారం దీనిపై ఎంసెట్ విభాగం అధికారులు పోలీసులతో ఉన్నతస్థాయి సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. అలాంటి విద్యార్థులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడంపైనా అధికారులు దృష్టి పెట్టారు. హైటెక్ మాస్ కాపీయింగ్ విషయంలోనూ పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. మెడికల్‌కు పెరిగిన దరఖాస్తులు ఇప్పటివరకు ఎంసెట్‌కు మొత్తంగా 3,94,440 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం 1,11,746 దరఖాస్తులు రాగా.. ఇంజనీరింగ్ కోసం 2,81,566 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,128 మంది రెండింటికీ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 19 వరకూ రూ. 10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఇప్పటికే ఇంజనీరింగ్‌లో చేరి మళ్లీ దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1500లకు పైగా ఉంది. అలాగే మెడికల్, అగ్రికల్చర్ కోర్సులు చేస్తున్న 500 మందికిపైగా విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ఇక గత ఏడాది ఇంజనీరింగ్ కోసం 2,91,083 మంది, మెడికల్‌కు 1,05,070 మంది దరఖాస్తు చేసుకున్నారు.