
సాక్షి, హైదరాబాద్: వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్)లకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) తేదీలను ఖరారు చేసింది. సెట్‌ల పరీక్షల సమయంతోపాటు వాటిని నిర్వహించే యూనివర్సిటీలను పేర్కొంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. సెట్‌ల నిర్వహణ యూనివర్సిటీల నుంచి కన్వీనర్ల నియామకం కోసం ముగ్గురు చొప్పున పేర్లు పంపించాలని సోమవారం ఆయా యూనివర్సిటీలకు లేఖలు రాయనుంది.
వర్సిటీలు పంపించే మూడేసి పేర్లలో ఒకరి పేరును ఖరారు చేసి సెట్ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించనుంది. కన్వీనర్ల నియామకం పూర్తయిన వెంటనే సెట్‌లవారీగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మే 3 నుంచి 9 వరకు వరుసగా ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి. తొలుత ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నిర్వహించిన తర్వాత అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. టీఎస్ పీఈసెట్ మినహా మిగతా అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే జరుగుతాయి. టీఎస్ పీఈసెట్ మాత్రం శారీరక దృఢత్వం, నైపుణ్యాల ఆధారంగా నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment