m set examinations
-
ప్రశాంతంగా ముగిసిన టీఎస్ ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఎస్ ఎంసెట్–2019 గురువారం తో ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 3, 4, 6 తేదీ ల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు.. 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం పరీక్షలు నిర్వహించారు. పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్ష నిర్వహించారు. చివరి నిమిషంలో విద్యా ర్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చి ఇబ్బందులు పడకుం డా ఉండేందుకు గంటన్నర ముందే పరీక్ష కేంద్రాలను తెరిచి ఉంచారు. దీంతో చివరి నిమిషం దాటాక వచ్చి పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన ఘటనలు పెద్దగా చోటుచేసుకోలేదు. ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఈసారి అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకున్నారు. రాష్ట్రంలోని 15 టెస్ట్ జోన్లు, 83 పరీక్ష కేంద్రాలు, ఏపీలోని 3 టెస్ట్ జోన్లు, 11 కేంద్రాల్లో ఎంసెట్‌ను నిర్వహించారు. ఇంజ నీరింగ్ పరీక్షకు 1,42,216 మంది రిజిస్టర్ చేసుకోగా.. 1,31,209 మంది (92.26%) హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 91.41 శాతం హాజరు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం పరీక్షను ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించారు. గురువారం ఉదయం 10 నుంచి ఒంటి గంటల వరకు పరీక్ష జరిగింది. తెలంగాణలోని 78 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 21,753 మంది రిజిస్టర్ చేసుకోగా.. 20,150 (92.7 శాతం) మంది హాజరయ్యారు. ఏపీలోని 7 కేంద్రాల్లోనూ ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 3,339 మంది రిజిస్టర్ చేసుకోగా.. 2,740 (82.01 శాతం) మంది హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి మొత్తం 74,989 మంది రిజిస్టర్ చేసుకోగా.. 68,550 మంది (91.41 శాతం) హాజరయ్యారు. -
44 ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపుపై సందిగ్ధత!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 44 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులపై సందిగ్ధత నెలకొంది. ఆయా కాలేజీలు 111 జీవో పరిధిలోని ప్రదేశాలు, భూదాన్ భూముల్లో ఉండటంతో వాటికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి నిరాకరించింది. దీంతో ఆయా కాలేజీలకు అనుమతులపై గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో మొత్తంగా 212 ఇంజనీరింగ్ కాలేజీలుండగా 168 కాలేజీల్లో ప్రవేశాలకే ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేసింది. జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు జాబితాను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే నెల 7లోగా అనుబంధ గుర్తింపు జాబితాను ఇస్తామని జేఎన్టీయూహెచ్ పేర్కొనగా, వచ్చే నెల 15లోగా అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించింది. ఏఐసీటీఈ గుర్తింపు లభించని కాలేజీల్లో ప్రముఖుల కాలేజీలు ఉండటంతో ఈలోగా వాటికి అనుమతులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మే 2 నుంచి ఎంసెట్.. రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలను మే 2 నుంచి 7 వరకు నిర్వహించేందుకు జేఎన్టీయూహెచ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు మొత్తంగా 2,20,990 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,47,912 మంది, అగ్రికల్చర్ ఎంసెట్ రాసేందుకు 73,078 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. -
మళ్లీ అవేచూపులు.. ఎదురుచూపులు..
ఎదురుచూపులు.. నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని.. మళ్లీ ఎదురుచూపులు అదే నెలలో ఎంసెట్ పరీక్షలు ఉన్నాయంట.. మన పరీక్షలు జరుగుతాయా? లేదా? అని.. మళ్లీ అవే చూపులు.. ప్రశ్నాపత్రాల్లో అనేక తప్పులు దొర్లాయంట.. రిజల్ట్స్ ఇస్తారా? లేదా? అని.. ఇప్పుడూ అవే ఎదురు చూపులు.. కోర్టులో కేసులు వేశారంట.. మెరిట్ వచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తారా? లేదా? అని.. ఇదీ 2014 డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన ఒకే ఒక పోటీ పరీక్ష డీఎస్సీ. ఉపాధ్యాయులై పిల్లలకు పరీక్షలు పెట్టాల్సిన నిరుద్యోగ అభ్యర్థులు ఇలా అగ్ని పరీక్షకు గురవుతున్నారు. జిల్లాలో డీఎస్సీ-14 నియామకాలకు సంబంధించి 31 వేల మంది దరఖాస్తు చేస్తే, సుమారు 29 వేల మంది అభ్యర్థులు ఆయా కేటగిరీల్లో టెట్ కమ్ టెర్ట్ పరీక్షలు రాశారు. వీటి ఫలితాలు విడుదల చేసి 9 నెలలు దాటినా నేటికీ పోస్టుల భర్తీ చేపట్టడం లేదని ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ)అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెకండరీ గ్రేడ్, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల భర్తీకి ఒక అడుగు ముందుకేసిన పాఠశాల విద్యాశాఖ మరో రెండు అడుగులు వెనక్కి వేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. మార్చి 1 నాటికే ఎస్జీటీ, ఎల్పీ, పీఈటీ పోస్టులు భర్తీ పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ నిర్ణయంపై పునరాలోచిస్తున్నట్టు సమాచారం. ఎలాగూ రెండు నెలలు వేసవి సెలవులు వస్తోన్న దశలో ఊరికే కూర్చోబెట్టి జీతాలు చెల్లించటం కంటే జూన్ నెల అనంతరం పోస్టుల నియామకాలు చేపడితే మంచిదనే ఆర్థిక శాఖ నిర్ణయంతో నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందంటున్నారు. స్కూల్ అసిస్టెంట్ల మాటేమిటి? కోర్టు కేసులు ఉన్నాయనే నెపంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయకపోవటం దారుణమని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 123 స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ పోస్టులకు ఏకంగా 22,760 మంది అభ్యర్థులు పోటీ పరీక్ష రాశారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వేధిస్తున్నా ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించకుండా ఇలా తాత్సారం చేస్తోందనే విమర్శలూ ఉన్నాయి. జిల్లాలో వేలాదిగా బీఎడ్ కోర్సులు పూర్తిచేసి డీఎస్సీ పరీక్షలు రాసి మెరిట్ లిస్ట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నామని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఎస్జీటీ, ఎల్పీల భర్తీపై సందిగ్ధం సెకండరీ గ్రేడ్, భాషా పండిట్ పోస్టుల భర్తీ ప్రక్రియపైనా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మార్చిలోనే పోస్టుల భర్తీ చేస్తే ఆర్థిక భారం తప్ప ఉపయోగం ఉండదనే ఆర్థిక శాఖ కొర్రీతో నియామకాలపై సందిగ్ధత నెలకొంది. జిల్లాలో ప్రస్తుతం ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 518 భర్తీ చేయాలని నిర్ణయించగా, వాటిలోనూ అభ్యర్థులు లేక మరో 62 పోస్టులు ఖాళీగానే మిగిలిపోయాయి. ఇక 456 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను సైతం ఇప్పటికిప్పుడు నియామకాలు చేపడితే నెలకు వీరి జీతాలకు సుమారు రూ.82 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. వేసవి సెలవులు ఎలాగూ సమీపిస్తున్న తరుణంలో అనవసర భారాన్ని తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా తక్షణం డీఎస్సీ నియామకాలు చేపట్టి ఆదుకోవాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.