వైఎస్సార్సీపీ గ్రేటర్ అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షులు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అనుబంధ విభాగాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎం.శ్యామల, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా బత్తుల నాని, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎన్.రవికుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎం.డి.అజీజ్ అహ్మద్, ఐటీ విభాగం అధ్యక్షురాలిగా పట్టా ప్రియ, వైఎస్సార్ సేవాదళ్ అధ్యక్షుడిగా సుధాకర్ నియమితులయ్యారు.
నియోజకవర్గం కమిటీల వివరాలివీ..
వైఎస్సార్ సీపీ కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ప్రధాన కార్యదర్శులుగా కేఎల్ రమణారెడ్డి, డి. సురేష్ రెడ్డి, కార్యదర్శులుగా వై.పద్మనాభరెడ్డి, ఎం.శివ ప్రసాద్ రెడ్డి, జూబ్లీహిల్స్ ప్రధాన కార్యదర్శిగా కె. రాజశేఖర్, కార్యదర్శిగా ఎ.హెచ్. రాజేంద్రసింగ్, సంయుక్త కార్యదర్శిగా ఎ. మహేష్, శేరిలింగంపల్లి ప్రధాన కార్యదర్శిగా ఇమాం హుస్సేన్, కార్యదర్శులుగా ప్రసాదరెడ్డి, తొర్రం రాజా, సంయుక్త కార్యదర్శులుగా నాగేశ్వరావు, రమణారెడ్డి, నక్కల రవిబాబు, ముషీరాబాద్ ప్రధాన కార్యదర్శి సత్తి సూరిబాబు, కార్యదర్శిగా శ్రీశైలం, సంయుక్త కార్యదర్శిగా రామచందర్, మలక్పేట్ ప్రధాన కార్యదర్శిగా బి.చంద్రశేఖర్, షాహిద్ ఖాన్, సనత్నగర్ ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ గౌడ్, కార్యదర్శిగా మణిదీప్, చార్మినార్ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి శ్రీనివాసరావు, ఎల్బీ నగర్ ప్రధాన కార్యదర్శిగా మామిడి రామచందర్, కార్యదర్శిగా అంజుబాబు గౌడ్, సంయుక్త కార్యదర్శిగా సురగంటి సుధాకర్ రెడ్డి, చంద్రాయణగుట్ట కార్యదర్శిగా మాజీద్ఖాన్లను నియమించారు.