ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం లభ్యం
తాడేపల్లిగూడెం: ఈతకు వెళ్లి గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థి మాక ఫణికుమార్ మృతదేహం శనివారం లభ్యమైంది. పట్టణంలోని యగర్లపల్లి ప్రాంతంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిగూడెంలోని పంటకాలువలో ఫణికుమార్ ఈతకు వెళ్లి... గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది... సహాయంతో గాలింపు చర్యలు చేపట్టాడు. ఆ క్రమంలో శనివారం ఉదయం మృతదేహన్ని కనుగొన్నారు.